Central-government-good news for new home buyers

Central-government-good news for new home buyers

కొత్తగా ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త!

ఆదాయాన్ని ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు

నియమం ప్రకారం, వివాహిత దంపతుల ఆదాయాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. 31 మార్చి 2022 నాటికి 2 కోట్ల సరసమైన గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో పట్టణ పేదలకు సరసమైన గృహనిర్మాణం కల్పించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన పిఎం ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana) దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://pmaymis.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.

సబ్సిడీ ఎలా పొందాలి

EWS (ఆర్థికంగా బలహీనమైన విభాగం) మరియు LIG (తక్కువ ఆదాయ సమూహం) వర్గాలలో (6,00,000 రూపాయల వరకు వార్షిక గృహ ఆదాయం) రుణగ్రహీతలు 6,00,000 రూపాయల వరకు రుణాలపై సంవత్సరానికి 6.5 శాతం వడ్డీ రాయితీని పొందుతారు. ఎంఐజి (మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్స్) 1 కేటగిరీ (రూ .6,00,001 నుంచి రూ .12,00,000 మధ్య వార్షిక గృహ ఆదాయం) లో రుణగ్రహీతలకు రూ .9 లక్షల వరకు రుణాలపై సంవత్సరానికి 4% వడ్డీ రాయితీ లభిస్తుంది. ఎంఐజి 2 కేటగిరీలో రుణగ్రహీతలు (వార్షిక గృహ ఆదాయం రూ .12,00,001 నుంచి రూ .18,00,000 మధ్య) రూ .12 లక్షల వరకు ఉన్న రుణాలపై సంవత్సరానికి 3% వడ్డీ రాయితీని పొందుతారు. గరిష్ట రుణ కాలం 20 సంవత్సరాలు ఉండాలి.

కొత్తగా ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. 2022వ సంవత్సరం మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగనుంది.

కొత్తగా ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. 2022వ సంవత్సరం మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగనుంది. 2022 వరకు దేశంలోని అందరికీ ఇళ్లు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసినవారికి ఈ పథకం కింద కేంద్రం రాయితీ ఇస్తుంది.

దాదాపు 2 లక్షల 65 వేల వరకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. అయితే దీన్ని లబ్ధిదారుడికి నేరుగా ఇవ్వదు. బ్యాంకు రుణం తీసుకుంటే రాయితీని బ్యాంకుకే అందజేస్తుంది. దీంతో లబ్ధిదారుడి తీసుకున్న రుణం అసలు లోంచి తగ్గిస్తారు. ఫలితంగా ఈఎంఐ తగ్గుతుంది. అసలు, వడ్డీని కలుపుకుంటే లబ్దిదారుడికి దాదాపు 6 లక్షల వరకు లబ్ది చేకూరుతుంది

కేంద్రం ఈ బడ్జెట్‌లో వీధి వ్యాపారులకు కాస్త ఊరటనిచ్చింది. వారిని సామాజిక భద్రత పథకాల్లో చేర్చింది. ఇన్నాళ్లు వీధి వ్యాపారులకు భద్రత కరువైంది. నష్టపోయినా వారి గోడు ఎవరికీ పట్టేది కాదు. సామాజిక భద్రత పథకాల్లో చేర్చాలనే నిర్ణయంతో లక్షలాది మందికి మేలు జరుగుతుందని అంటోంది కేంద్ర ప్రభుత్వం.

PM ఆవాజ్ యోజన సబ్సిడి CALICULATOR

కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!

మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉందా? అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉన్న వినియోగదారులకు తక్కువ వడ్డీరేటుతో గృహ రుణాలు అందిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్తగా గృహ రుణాలు తీసుకోవాలనే వారి కోసం వడ్డీ రేటును 6.90 శాతానికి తగ్గించింది. గృహ రుణాలపై ఇప్పటివరకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. మీ సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది

రుణ పరిమితి ఎంత?
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకారం.. సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు రూ.50 లక్షల రుణంపై వడ్డీ రేటు 6.90 శాతంతో ప్రారంభమవుతుంది. 700 కంటే ఎక్కువ స్కోరు ఉన్న వినియోగదారులకు రూ.80 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీ రేటు పడనుంది. మీ సిబిల్ స్కోరు అనేది ఒక వ్యక్తి ఇంతకు ముందు రుణం తీసుకున్నాడా? ఒకవేళ రుణం తీసుకున్నట్లయితే సకాలంలో చెల్లించాడా అనే దానిపై స్కోరు ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్లను రుణదాతలు చెక్ చేసేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.