apteachers-employees-doubts-answers-about-pensions

apteachers-employees-doubts-answers-about-pensions

పెన్షన్ రూల్స్ పై ప్రశ్నలు-జవాబులు

107. ప్రశ్న:*

భర్త/ భార్య/కుమారులు/కుమార్తెలు 

ఉద్యోగికి పైన తెలిపిన వారు ఎవరూ లేకపోతే / నామినేషన్ లేని సందర్భంలో అతని రిటైర్మెంట్ గ్రాట్యూటీ ఎవరెవరికి ఎలా చెల్లించాలి? 

✅జవాబు:*

విధవరాలైన కూతురు, కూతుళ్ళు, తల్లి, తండ్రి 

18 సంవత్సరాలలోపు వున్న తమ్ముడు,

పెళ్ళికాని చెల్లెలు, విధవరాలైన చెల్లెలు, 

పెళ్ళి అయిన కూతుళ్ళు 

చనిపోయిన కూమారుని కొడుకు 

వీరికి సమాన షేరు రూపంలో చెల్లించాలి. 

రూలు 47 (1) (బి) (2)

••••••••••••

108. ❓ప్రశ్న:*

ఉద్యోగి రిటైర్ అయిన తరువాత, రిటైర్మెంటు గ్రాట్యూటీ తీసుకోకుండా మరణిస్తే రిటైర్ మెంట్ గ్రాట్యూటీ చెల్లించాలా? 

✅జవాబు:*

నామినేషన్ వుంటే, నామినేషన్ ఆధారంగా నామినేషన్ లేకపోతే, (106) (107) ప్రశ్నలకు తెలిపిన జవాబులకు అనుగుణంగా చెల్లించాలి.

రూలు -47 (2) 

••••••••••••

109. ❓ప్రశ్న:*

ఉద్యోగి సర్వీసులో వుండి మరణించినా లేక రిటైరు అయి మరణించినా (నామినేషన్ లేని సందర్భంలో) ఎవరైనా ఆడవారు కాని, తమ్ముడుకాని రిటైర్మెంటు గ్రాట్యూటీ రిసీవ్ చేసుకొనే లోపల పెళ్ళి చేసుకొన్న లేక 18 సంవత్సరాలు నిండినా, ఆ మొత్తము తీసుకోడానికి వారు అర్హులా? 

✅జవాబు:*

ఉద్యోగి చనిపోయిన తరువాత గ్రాట్యూటీ పొందే కంటే ముందు పై సందర్భాలు సంభవించినా, రిటైర్మెంట్ గ్రాట్యూటీ పాందవచ్చు. రూలు – 47 (3) 

••••••••••••

110. ❓ప్రశ్న:*

చనిపోయిన ఉద్యోగి యొక్క మైనరు మెంబరుకు రిటైర్మెంట్ గ్రాట్యూటీ ఎలా చెల్లిస్తారు? 

✅జవాబు:*

1) మైనర్ యొక్క సంరక్షకుని (Guardian) ద్వారా చెల్లిస్తారు. 

2) Natural Guardian ద్వారా చెల్లించాలి. Natural Guardian లేకపోతే గార్డియన్ సర్టిఫికెట్ ప్రకారం చెల్లించాలి. 3) చనిపోయిన ఉద్యోగి యొక్క మైనర్ కుమారులు, పెళ్ళికాని మైనరు కుమార్తెలు ఉంటే వారి వాటా బ్రతికి వున్న తల్లి, తండ్రుల ద్వారా చెల్లిస్తారు. కాని ముస్లిం మహిళ తల్లి బ్రతికి వుంటే ఆవిడకు చెల్లించరు. గార్డియన్ సర్టిఫికెట్ ద్వారా చెల్లిస్తారు. 

4) బ్రతికి ఉన్న తల్లితండ్రులు ఎవరూ లేకపోతే లేక బ్రతికి వున్న తల్లి ముస్లిం మహిళ అయితే గార్డియన్ సర్టిఫికెట్ ద్వారా మైనర్ కు రిటైర్మెంట్ గ్రాట్యూటీ చెల్లిస్తారు. 

5) విధవరాలైన మైనరు కుమార్తెలకు గార్డియన్ సర్టిఫికెట్ ఆధారంగా చెల్లించాలి. 

6) భార్య మైనరు అయితే గార్డియన్ సర్టిఫికెట్ ఆధారంగా చెల్లిస్తారు. 

7) మైనర్ తమ్మునికి లేదా పెళ్ళికాని మైనర్ చెల్లెలికి రిటైర్మెంట్ గ్రాట్యూటీ చెల్లించాల్సివస్తే బ్రతికివున్న తల్లి తండ్రుల (తల్లిగా ముస్లిం మహిళకు మినహాయించాలి) ద్వారా చెల్లిస్తారు. తల్లితండ్రులు లేకపోతే గార్డియన్ సర్టిఫికెట్ ఆధారంగా చెల్లిస్తారు. 

8) పెళ్ళి అయిన మైనర్ బాలికకు రిటైర్‌మెంట్ గ్రాట్యూటీ చెల్లించాల్సివస్తే ఆవిడ భర్త ద్వారా చెల్లిస్తారు. 

రూలు 47 (4} (1) (ఎ)(బి)(సి)(డి) (ఇ)