APPSC-recruitments-190-Assistant Engineers in various Engineering Sub Services

APPSC-recruitments-190-Assistant Engineers in various Engineering Sub Services

AP లో 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు.. APPSC నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న 190 అసిస్టెంట్ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి ఈనెల 21 నుంచి నవంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇతర వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్‌ కార్యదర్శి ఆంజనేయులు సూచించారు.

ముఖ్య సమాచారం:

  • విభాగాలు: సివిల్‌, ఈఎన్‌వీ, మెకానికల్‌

  • అర్హత: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎల్‌సీఈ/తత్సమాన ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు.

  • వయసు: అభ్యర్థుల వయసు 2021, జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

  • ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్‌ 21, 2021

  • దరఖాస్తులకు చివరితేది: నవంబర్‌ 11, 2021

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

APPSC 190 Assistant Engineers in various Engineering Sub Services NOTIFICATION