AP-polytechnic-course-seats-allotments

AP-polytechnic-course-seats-allotments

రేపు పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు

విద్యార్థుల మొబైల్కు ఎస్ఎంఎస్లు
21న వెబ్సైట్లో విద్యార్థుల వివరాలు
 పాలిటెక్నిక్ సీట్ల కేటా యింపుపై ఆగస్టు 20న ఎస్ఎంఎస్ రూపంలో విద్యార్ధులకు నేరుగా చరవాణి (మొబైల్) సందేశం పంపనున్నామని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. 
ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు సాంకేతిక విద్యాశాఖలో సంస్కరణలకు పెద్దపీట వేయను న్నట్టు తెలిపారు.
గురువారం నగరంలోని సాంకేతిక విద్యాశాఖ కమీషనరేట్ లో నూతన సంచాలకులుగా బాధ్య తలు తీసుకున్న ఆమె పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 
పాలిటెక్నిక్ ప్రవేశాల పరంగా అర్హత పొందిన విద్యా ర్ధుల వివరాలను ఆగస్టు 21వ తేదీన తమ అధికారిక వెబ్ సైట్ లో ఉంచుతామనీ, ఆగస్టు 25న తరగతులను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో దాదా సుమారు 70 వేల పాలిటెక్నిక్ స్వీట్లు అందుబాటులో ఉండగా 40 వేల మంది విద్యార్ధులు వెబ్ కౌన్సిలింగ్, అర్హతా పత్రాల ధృవీకరణకు హాజరయ్యారని నాగరాణి తెలిపారు. 
ఉపాధికి మార్గం చూపే విద్యాభ్యాసం దిశగా, ప్రభుత్వం చే పట్టిన మార్పులకు అనుగుణంగా విద్యార్ధుల్లో నైపుణ్యత మరింతగా పెంపొందేలా పాలిటెక్నిక్ విద్యను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు.

https://polycetap.nic.in/Default.aspx