ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 5న జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదలైనట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానం దరెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యార్థులు డీఈవో కార్యాలయంలో, www.bse.ap. gov. in వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎన్ఎంఎంఎస్కు ఎంపికైన విద్యార్థుల మెరిట్కార్డులను త్వరలో డీఈవో కార్యాలయాలకు పంపించనున్నారు.

జాతీయ విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఎన్ఎంఎంఎస్ కు ఎంపికైన విద్యార్థులు (వారి ఆధార్ అనుసంధానంతో) జాతీయ బ్యాంకులో తల్లి/తండ్రితో కలిసి జాయింట్ సేవింగ్స్ అకౌంటు తీసుకోవాలి. మెరిట్ కార్డులో ఉన్న విధంగానే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ విద్యార్థి వివరాలు ఉండాలి..