ap-employees-teachers-doubts-and-answers-with-G.O-Numbers

ap-employees-teachers-doubts-and-answers-with-G.O-Numbers

సందేహాలు – సమాధానాలు*

ప్రశ్న:*
జాతీయ పెన్షన్ పథకం లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చా??
జవాబు:*
పెట్టవచ్చు. గరిష్టంగా 50000 వరకు మదుపు చేసి ఐటీ మినహాయింపు పొందవచ్చు.
ప్రశ్న:*
పెన్షనర్ ఐటీ లో ఏవిధంగా HRA మినహాయింపు పొందవచ్చు??
జవాబు:*
HRA పొందని వారు అద్దె ఇంట్లో ఉంటుంటే నెలకు 5000రూ వరకు ఐటీ మినహాయింపు పొందవచ్చు.
ప్రశ్న:*


సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి మరణించినచో ఏమి జరుగుతుంది??
జవాబు:*
జీఓ.275 , తేదీ:8.8.77 ప్రకారం సస్పెన్షన్ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారు.
ప్రశ్న:*
జీతం డబ్బులు తీసుకోవటానికి కేవలం SBI/SBH లోనే అకౌంట్ ఉండాలా??
జవాబు:*
జీఓ.58, తేదీ:21.3.05 ప్రకారం ప్రభుత్వం సూసించిన SBI/SBH బ్యాంక్ లలో ఏదో ఒక దానిలో అకౌంట్ ఉండాలి.
ప్రశ్న:*
ఈ సంవత్సరం వార్షికోత్సవం జరపాలని అనుకొనుచున్నాము.డబ్బులు ఎంత ఇస్తారు??
జవాబు:*
ప్రైమరీ స్కూళ్ళుకి 100 లోపు పిల్లలు ఉంటే 800రూ,100 పైన పిల్లలు ఉంటే 1000రూ ఇస్తారు.
అదే అప్పర్ ప్రైమరీ కి 100 లోపు ఉంటే 1000రూ,100 పైన ఉంటే 1200రూ ఇస్తారు.