CLAT-common-law-admission-test-2024-notification

CLAT-common-law-admission-test-2024-notification

CLAT: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌-2024 నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను ఏటా నిర్వహిస్తున్నాయి. యూజీ క్లాట్‌ నోటిఫికేషన్‌ 2024 విడుదలైంది.

నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ను ఏటా నిర్వహిస్తున్నాయి. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాంలు(ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం)లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం యూజీ క్లాట్‌ నోటిఫికేషన్‌ 2024 విడుదలైంది. దేశవ్యాప్తంగా 22 ప్రధాన లా యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటున్నాయి. అర్హులైన విద్యార్థులు నవంబరు 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 03వ తేదీన క్లాట్‌-2024 పరీక్ష నిర్వహిస్తారు. 

వివరాలు..

⏩ యూజీ క్లాట్‌ నోటిఫికేషన్‌ 2024  కోర్సులు..

* ఎల్‌ఎల్‌బీ(5 సంవత్సరాలు)

* ఎల్‌ఎల్‌ఎం(5 సంవత్సరాలు)

పాల్గొనే విశ్వవిద్యాలయాలు: 

ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్‌ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్‌ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్‌ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్‌), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్‌), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా).

OFFICIAL WEBSITE CLICK HERE


Syllabus and Format for CLAT 2024

Notification FOR CLAT-2024  
Website

అర్హతలు: 

యూజీ కోర్సులకు 10+2 లేదా తత్సమాన పరీక్ష. పీజీ కోర్సులకు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పరీక్ష విధానం: ఈ సంవత్సరం మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 120 ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ చాయిస్‌లో ప్రశ్నలు ఉంటాయి.

ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఆంగ్ల భాష, కరెంట్ అఫైర్స్‌తో సహా జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఐదు విభాగాలుగా విభజించారు.

ఆంగ్ల భాష నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, కరెంట్ అఫైర్స్/ జనరల్ నాలెడ్జ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లీగల్ రీజనింగ్ నుంచి 28-32 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 25 శాతం, లాజికల్ రీజనింగ్ నుంచి 22-26 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 20 శాతం, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10-14 ప్రశ్నలు లేదా పేపర్‌లో దాదాపు 10 శాతం ప్రశ్నలు అడుగుతారు. 

పరీక్ష సమయం: 2 గంటలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01.07.2023.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2023.

➥ క్లాట్‌-2024 పరీక్ష తేది: 03.12.2023.

OFFICIAL WEBSITE CLICK HERE

Syllabus and Format for CLAT 2024

Notification FOR CLAT-2024  
Website