6th-to-10th-class-F.A-1-Telugu-subject-model-papers

నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహణకై సూచనలు

ప్రభుత్వం సరఫరా చేసిన పాఠశాల సంసిద్ధత/వర్క్ షీట్స్ పై లేదా సంబంధిత సబ్జెక్టు లోని మొదటి పాఠం/చాప్టర్ లో FA 1 నిర్వహించాలి.*

FA 1 కి సంబంధించి ముద్రించబడిన/ఉమ్మడి ప్రశ్నపత్రాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించరాదు*

F.A- 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు.

ఈ నెల 21 నుండి 25 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలి. 

సెకండరీ పాఠశాల విషయంలో 

21 వ తేదీ ఉదయం తెలుగు మధ్యాహ్నం గణితం, 

22వ తేదీ ఉదయం హిందీ మధ్యాహ్నం 6 7 తరగతులకు సైన్స్ 8 9 10 తరగతులకు భౌతిక శాస్త్రము అలాగే 23వ తేదీ ఉదయము ఆంగ్లము మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించాలి. తరువాత 25వ తేదీ జీవశాస్త్ర పరీక్ష నిర్వహించాలి  

ఈసారి ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రధానమైన మార్పులు చేశారు. ప్రశ్న పత్రము నేరుగా ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి వారు ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పంపుతారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక బోర్డు పైన ప్రదర్శించి విద్యార్థులను రాసుకోమని చెప్పాలి. తర్వాత పరీక్ష నిర్వహించాలి . మరుసటి రోజు నుంచి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయాలి.   తరువాత ప్రధానోపాధ్యాయులు వాటిని అనగా మూల్యాంకనం చేసిన పరీక్షా పత్రాలను ర్యాండమ్ గా తనిఖీ చేయాలి .  

ఆ తర్వాత మార్కులను నమోదు చేసి  ఆన్లైన్లో సమర్పించాలి. తర్వాత తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలి . ఈ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి రెమిడియల్ టీచింగ్ ప్రత్యేకంగా చేపట్టి తరగతులు నిర్వహించాలి.  

కనుక ఈ సారి నుండి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి . అంతేకాక దాదాపు నవంబరు ఒకటవ తేదీ నుండి ప్రత్యేక  బోధన నిర్వహించవలసి రావచ్చు.

6th-to-10th-class-F.A-1-Telugu-subject-model-papers

6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి మరియు 10వ తరగతి తెలుగు సబ్జెక్టు మోడల్ పేపర్లు 2021-22 F.A-1 పేపర్లు.

PREPARED BY,

B.SRINIVASARAO, S.A(TELUGU), GUNTUR DT

6వ తరగతి తెలుగు మోడల్ పేపర్లు

7వ తరగతి తెలుగు మోడల్ పేపర్లు

8వ తరగతి తెలుగు మోడల్ పేపర్లు

9వ తరగతి తెలుగు మోడల్ పేపర్లు

10వ తరగతి తెలుగు మోడల్ పేపర్లు