tips-for-your-knee-health–details

 tips-for-your-knee-health–details

మోకాళ్ళలో గుజ్జు కరిగి పోతుందా..? అయితే ఇలా చేయండి..!

ప్రస్తుతం వయసుతో తేడా లేకుండా ఎన్నో అనారోగ్యమైన సమస్యలు మానవులను పలకరిస్తున్నాయని చెప్పవచ్చు. పూర్వం వయసు తగ్గే కొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తే రోజులను ప్రస్తుతం మరిచిపోవాల్సిన సమయం వచ్చేసింది.

ప్రస్తుతం వయసుతో తేడా లేకుండా ఎన్నో అనారోగ్యమైన సమస్యలు మానవులను పలకరిస్తున్నాయని చెప్పవచ్చు. పూర్వం వయసు తగ్గే కొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తే రోజులను ప్రస్తుతం మరిచిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు వయసుతో తేడా లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు పలువురి ని పీడిస్తున్నాయనే చెప్పవచ్చు. ప్రధానంగా మోకాలు అరిగిపోవడం, మోకాలిలోని గుజ్జు కరిగిపోవడం, ఇటువంటి సమస్యలతో విపరీతమైన మోకాలి నొప్పులను చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా కొంతమంది రోగులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి స్థితిలో మోకాళ్ళ లో గుజ్జు కరిగిపోకుండా ఉండాలంటే ఎటువంటి సూచనలు పాటించాలో ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలు (Ongole) లోని రిమ్స్ వైద్యశాల ప్రొఫెసర్ డాక్టర్ వివి నారాయణ 


వివరాలు 

ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ… తమ వైద్యశాల వద్దకు సైతం చిన్న పెద్ద అనే వయసుతో తేడా లేకుండా చాలా వరకు కరోనా కాలం తర్వాత, అధిక మోకాలి నొప్పుల వ్యాధితో బాధపడుతూ రోగులు వస్తున్నారన్నారు. అటువంటి స్థితిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించిన ఎడల చిన్నపాటి ఇంజక్షన్ ద్వారా గుజ్జును కాలి లోపలికి పంపించి మరలా యధాస్థితిగా నడవగలిగేలా చేయవచ్చన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామ సాధన చేయడం ద్వారా మోకాలి నొప్పుల బారి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నారు.

కానీ ఇటువంటి మోకాలి నొప్పుల వ్యాధితో బాధపడేవారు వైద్యులు సూచించే సూచనలను పాటించాలని, లేని యెడల దీర్ఘకాలిక వ్యాదిలా మార్పు చెంది చివరకు శస్త్ర చికిత్సకు దారి తీస్తుందన్నారు డాక్టర్ వివి నారాయణ. అలాగే కరోనా వ్యాధి వచ్చి వెళ్లిన రోగుల్లో ఇటీవల ఇటువంటి మోకాలి నొప్పులు అధికమైనట్లు తాము గుర్తించామన్నారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే కాలి నొప్పుల వ్యాధులు దారి చేరవని డాక్టర్ నారాయణ రావు తెలిపారు.

error: Content is protected !!