term-2-exams-schedule-for-cbse-10th-class-12th-standard

term-2-exams-schedule-for-cbse-10th-class-12th-standard

CBSE Term 2 Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల టర్మ్-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే

CBSE Class 10, 12 Term 2 Exams: టర్మ్‌-2 థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలన్నీ ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగనున్నాయి

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల టర్మ్‌-2 పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది. ఇప్పటికే టర్మ్‌-1 పరీక్షలను నిర్వహించిన బోర్డు తాజాగా టర్మ్‌-2 పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. కరోనా (Corona) మహమ్మారి కారణంగా పరీక్షల నిర్వహణలో జాప్యం కావడంతో సీబీఎస్‌ఈ బోర్డ్‌ ఈ సారి రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టర్మ్‌-2 థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలన్నీ ఆఫ్‌లైన్‌ విధానంలో జరగనున్నట్లు బోర్డ్‌ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక.. ఈ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించే సమయంలో జేఈఈ మెయిన్‌తో సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకున్నట్లు బోర్డు జారీ చేసిన సర్క్యులర్‌లో తెలిపింది.

సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షల షెడ్యూల్‌:

cbse-10th-schedule

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌:

cbse-12th-schedule