Telugu-educational-news-October-1st-2022

హైస్కూల్ + పై కొన్ని సూచనలు

*హైస్కూల్ + ఫై కొన్ని సూచనలు :*

హైస్కూల్ + లో సబ్జెక్టు బోధనకు దరఖాస్తు చేసుకునే వారు కొత్త జిల్లాల ప్రాతిపదికన ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు దరఖాస్తులు పంపుకోవాలి.

*ఎంపిక కాబడిన వారు +2 (ఇంటర్) తరగతుల సబ్జెక్టు మాత్రమే కాకుండా ప్రధానోపాధ్యాయుల ఆదేశానుసారం కింది తరగతులకు బోధనకృత్యములు సాగించవలసి ఉంటుంది.*

ఎంపికైన వారికి వారు పని నిబంధనలు ఇంకా వెల్లడి కావాల్సివుంటుంది.

*ఒక రకంగా చెప్పాలంటే ఇది డెప్యుటేషన్ మాత్రమే. పోస్టుకు పూర్తిస్థాయి చట్టబద్ధత లేదు.*

*+2 తరగతుల బోధన నుండి విరమించుకుంటే వారికిచ్చే ఇంక్ర్మెంట్ కొనసాగకపోవచ్చు.*

*(ఇంక్రిమెంట్ కూడా రెగ్యులర్ JL గా ప్రమోషన్ వచ్చే వరకు ఇవ్వరని సమాచారం)*

*వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు తమ నిర్ణయాన్ని సరిచూసుకోవాలి.*

బడికి వెళ్ళే బాలలు తగ్గుతున్నారు.

బడికెళ్లే బాలలు తగ్గుతున్నారు.

దేశవ్యాప్తంగా స్కూళ్లలో చేరికలపై జనాభా తగ్గుదల ప్రభావం

ఎన్సీఈఆర్టీ నివేదికలో వెల్లడి

2011 నుంచి పడిపోతున్నఒకటో తరగతి చేరికలు*

చేరికల్లో 9.47 శాతం మేర తగ్గుదల*

2025 నాటికి తగ్గుదల14 శాతం ఉంటుందని అంచనా*

2025కి బాలురు 13.28 శాతం, బాలికలు15.54 శాతం తగ్గవచ్చని అంచనా*

ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపవుట్స్ లేకుండాప్రత్యేక చర్యలు*

దేశవ్యాప్తంగా పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రైమరీ, ఒకటో తరగతి నుంచే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇందుకు జనాభా తగ్గుదలే కారణమని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకే షన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) నివేదిక వెల _డించింది. మరోపక్క కరోనా తదనంతర పరిస్థితుల ప్రభావంతో డ్రాపవుట్ల సమస్య కూడా వెన్నాడుతోందని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 2011 జనగణనలో 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఇటీవల నేషనల్ ఎచీవ్మెంటు సర్వే (ఎన్ఎస్) జరిగింది. 2011 నుంచి గత ఏడాది వరకు పాఠశాలల్లో చేరికలను ఎన్ ఎస్ వెల్లచింది. ఈ గణాంకాలను ఎన్ సీఈఆర్టీ విశ్లేషించింది. సామాజిక చైతన్యం ఉన్న రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గుతు న్నట్లు వెల్లడించింది. ఆ కారణంగా పాఠశాలల్లో చేరికల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఎన్సీఈఆర్టీ అధ్యయనం ప్రకారం.. 2025 నాటికి పాఠశాలల్లో చేరికలు 14 శాతానికి పైగా తగ్గుతాయని అంచనా. బాలురకంటే బాలికల చేరికల సంఖ్య మరింత తక్కువగా ఉంటుందని.. పేర్కొంది. ముఖ్యంగా 6 16 ఏళ్ల లోపు వయసు పిల్లలు విద్యాలయాలకు వెళ్లే సంఖ్య తక్కువగా ఉంటుందని పేర్కొంది. అప్పర్ ప్రైమరీ దశలో చేరికల నమోదు 2016. నుంచి క్రమంగా తగ్గుతోంది. 2011 నుంచి ఇప్పటివరకు మొత్తంగా చేరికల్లో 9.47 శాతం మేర తగ్గినట్లు తేలింది. దీనిలో బాలురు 8.07 శాతం కాగా బాలికలు 10.94 శాతం గా ఉంది. 2025 నాటికి మొత్తం చేరికల తగ్గుదల 14.37గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాలుర నమోదు 13:28. శాతం, బాలికల నమోదు 15.54 శాతం మేర తగ్గుతుందని ఎన్సీఈఆర్టీ వివరించింది.

అంగన్వాడీ గణాంకాలు చెప్పేది ఇదే.

కొన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల పిల్లల చేరికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఆయా రాష్ట్రాల అంగన్వాడీ పిల్లల చేరికలు తెలియజేస్తున్నాయని నివేదిక పేర్కొంది. అంగన్ వాడీల్లో పిల్లల సంఖ్య గతంలోకంటే తగ్గుతోందని, జననాల రేటు తగ్గడమే దీనికి కారణమని నివేదికలు స్పష్టం చేస్తు న్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కొద్దికాలం క్రితం నాటి రిఫరెన్సు సెన్సస్లో జనాభాలో తగ్గుదల కనిపించింది. ఆ ప్రభావం ఒకటో తరగతి చేరికలపైనా పడింది. 2020 21లో ఒకటో తరగతిలో 7.16,314 మంది పిల్లలు చేరగా. 2022 నాటికి 5,62,402కు తగ్గింది. అంటే చేరికల సంఖ్య 1.54 లక్షల వరకు తగ్గింది. అంతకు ముందు చేరికల పరిస్థితిని చూసినా ఇదే రకంగా ఉంది.

విద్యాశాఖ ప్రత్యేక చర్యలు

ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పాఠశాలలకు వరుసగా మూడు రోజులు రాని పిల్లల సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా టీచర్లకు, తల్లిదం డ్రులకు, సీఆర్టీలకు అందిస్తున్నారు. పిల్లలను తిరిగి స్కూళ్లకు రప్పిస్తున్నారు. పూర్తిగా మానివేసిన పిల్లలను తిరిగి స్కూళ్లల్లో చేరుస్తున్నారు. ఒక్క ప్రభుత్వ పాఠశాలలనే కాకుండా పిల్లలు వారికి నచ్చిన చోట చదువుకొనేలా ప్రభు త్వం ఏర్పాట్లు చేసింది. దీనివల్ల ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య ఆరంభంలో 68.5 లక్షలు ఉండగా దానిని 71.20 లక్షలకు పెంచగలిగారు.

జగనన్న విదేశీ విద్యా దీవెనకు 392 దరఖాస్తులు

పేద విద్యార్థులకు పెద్ద చదు వుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విదేశీ విద్యాదీవెన కోసం 392 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈ పథకంలో దరఖాస్తులకు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆర్థికసాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకం రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు (ఈబీసీ), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వర్తిస్తుంది. వచ్చిన దరఖాస్తులు, వాటికి జతచేసిన ధ్రువప త్రాలను అధికారులు పరిశీలించిన తరువాత ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవె నను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటుగా ఆర్థి కంగా వెనుకబడిన అగ్రకులాల వారందరికీ వర్తింపజేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవి ద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది మేలు చేస్తుంది.

ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న వారికి ఫీజు రూ. కోటి అయినా నూరుశాతం ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. 101 నుంచి 200 క్యూఎస్ ర్యాంకులున్న యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ పథకానికి వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత ఉన్న ఎంత మందికైనా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె.హర్షవర్ధన్ తెలిపారు.

నేటి నుండి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఓటర్లు నమోదు

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు*

కొత్త ఓటర్ల నమోదుకు నవంబర్ 7తో గడువు పూర్తి*

త్వరలో ఎన్నికలు జరగ నున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబం ధించి ఓటర్ల నమోదు ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రకాశం-నెల్లూ చిత్తూరు కడప అనంతపురం క ర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖప ట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, ప్రకా శం నెల్లూరు చిత్తూరు, కడప అనంతపురం-కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఈ స్థానాల్లో కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 1న పత్రికా ప్రకటన విడుదల చేస్తామని, టీచర్ నియోజకవర్గంలో ఓటరు నమోదుకు ఫారం 19. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఫారం18 వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. సీఈవో ఆంధ్రా వెబ్సైట్లో ఈ ఫారాలను దరఖాస్తు చేయడం ద్వారా ఓట ర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది.

కొత్త ఓటర్ల నమోదుకు నవంబర్ 7 చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించి, డిసెంబర్ 12 వరకు వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.

G.O.154 విషయంలో ముందుకెళ్ళొద్దు ఆదేశిoచిన హైకోర్టు

ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు*

మధ్యంతర ఉత్తర్వులు జారీ..*

తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా

: ప్రతీ మండలానికి ఇద్దరు విద్యాధికారు లను (ఎంఈఓ) నియమిస్తూ జారీచేసిన జీఓ-154 విష యంలో అక్టోబర్ 20 వరకు ముందుకెళ్లొద్దని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ జీఓ కింద మండలానికి ఇద్దరు ఎంఈఓల నియామకం కోసం కొత్తగా 692 పోస్టులను సృష్టించాలంటే అందుకు రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరమ ని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రతీ మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న జీఓ-154 జారీచేసింది. దీనిని చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా పరిషత్ పాఠశాలల్లో హెడ్మాస్టర్లు-గ్రేడ్-2గా పనిచేస్తున్న పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం ఈ జస్టిస్ మన్మథరావు విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రతాప్నారాయణ్ సంఘ్, న్యాయ వాది మనోజ్కుమార్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ చర్యలవల్ల జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేసే హెడ్మాస్టర్ల కు ఎంఈఓలుగా పదోన్నతి పొందే అవకాశం ఉండదని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎన్డీపీ) కాసా జగన్మోహన్రెడ్డి వాదనలను తోసిపుచ్చారు. ఈ పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. కొత్త ఎంఈఓ పోస్టులను సృష్టించడంవల్ల ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న వివాదం పరిష్కారం అవుతుందని తెలిపారు. జీఓ – 154 అమలును నిలిపేస్తే పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతుందన్నారు.. సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఈ తెచ్చిందన్నారు. ప్రభుత్వ విధానపరమైన ఇది నిర్ణయమని, ఇందులో జోక్యం చేసుకోరాదని ఆయన కోర్టును గట్టిగా కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, కొత్త పోస్టులు సృష్టించాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరమని స్పష్టంచేశారు.

అక్టోబర్ 20 వరకు జీఓ విషయంలో ముందుకెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆ రోజుకి వాయిదా వేశారు.

APPSC గ్రూపు 1 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్

92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఏపీపీఎస్సీ గ్రూప్- 1 (జనరల్ మిటెడ్ రిక్రూట్మెంట్)లో 92 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.

రవాణాశాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహి కల్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని, నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వూలు

గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు!

: గ్రూపు-1 పోస్టుల భర్తీకి మాత్రమే మౌఖిక పరీక్షలను పరిమితంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గత నెల 28న జారీచేసిన ఉత్తర్వుల్లో గ్రూపు-1 ఉద్యోగాలతోపాటు లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కూడా ఇంటర్వ్యూలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. తాజా గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల గురించి ప్రస్తావించలేదు.

విద్యాoజలి 2.0

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతకే విద్యాంజలి 2.0

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల విద్యని అందించడానికి విద్యాంజలి 2.0, స్వచ్ఛంద సేవల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టామని, దీన్ని జయప్రదం చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 7, 2021న ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించారని, ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని పౌరులందరూ తమకు నచ్చిన రంగంలో సమీప పాఠశాలలకు స్వచ్ఛంద సేవలు అందించవచ్చునని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో విద్యానాణ్యతని పెంపొందించుకోవడానికి ఆర్జెడీలు జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా అదనపు సమన్వయకర్తలు,ప్రధానో పాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కార్యవుర్గ, తల్లిదండ్రులు విద్యాం జలి 2.0, కార్యక్రమాన్ని సత్వరమే అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ పాఠశాలకు కావలసిన విద్యా వనరులను, సామాగ్రిని మధ్యాహ్న భోజన పథకం, నీటి వసతి, స్వయం ఉపాధి కోర్సుల నిర్వహణ, కంప్యూటర్ బోధన, అదనపు తరగతి గదులు, బోధన అభ్యసన సామాగ్రి, స్పోర్ట్స్ మెటీరియల్,కంప్యూటర్లు మొదలైన అంశాలన్నిటిలోనూ వారి వారి అవసరాలని విద్యాంజలి పోర్టల్ లో పాఠశాల తరఫున నమోదు చేసుకుని, పాఠశాల అవసరాలకు ఆధారంగా స్వచ్ఛంద కార్యకర్తలు కూడా తాము అందజేయగలిగినటువంటి సేవలను విద్యాంజలి పోర్టల్ లో నమోదు చేసుకుని ఆయా పాఠశాలలకు అందించాలని కోరారు.

పదోన్నతులకు సర్వీసు లెక్కింపు పై స్పష్టత

పదోన్నతులకు సర్వీసు లెక్కింపుపై స్పష్టత

స్కూల్ అసిస్టెంట్లకు ప్రధా నోపాధ్యాయులు గ్రేడ్-2గా, సెకండరీ గ్రేడ్ టీచర్స్కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 33ను పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో కొందరు డీఈవోల సందేహాలకు స్పష్టతనిచ్చింది. ఒక సర్వీసు, కేటగిరీ, గ్రేడులో నియామక తేదీ నుంచే ఉద్యోగి సీనియారిటీ నిర్ధారిస్తారు. ఒక సర్వీసుకు ఏకకాలంలో ఇద్దరి కన్నా ఎక్కువమందిని నియమిస్తే వారి ఆర్డర్ ప్రిఫరెన్సు నిర్దేశించాలి. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ, పీజీటీల సీనియారిటీ జాబితాను అక్టోబరు 20లోపు రూపొందించాలని, ఈ జాబితాను 30లోపు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కు అందించాలని పేర్కొంది.