to-know-the-aadhar-card-history-details

to-know-the-aadhar-card-history-details

Aadhaar: మీ ఆధార్‌ కార్డ్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో ఎలా తెలుసుకోవాలంటే..

అయితే మన ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించాం.? వేరే వారు ఎవరైనా మన ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారా.? అన్న అనుమానం వస్తే తెలుసుకోవడానికి ఒక ట్రిక్ అందుబాటులో ఉంది. ఇందుకోసం ఆధార్‌ కార్డ్‌ హిస్టరీని చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే సులువుగా తెలుసుకోవచ్చు…ఆధార్‌ కార్డ్‌ వినియోగం ప్రస్తుతం అనివార్యం. సిమ్‌ కార్డ్‌ మొదలు, ఫ్లైట్ టికెట్ వరకు అన్నింటికీ ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. దీంతో ఎక్కడ పడితే అక్కడ ఆధార్‌ కార్డ్ జిరాక్స్‌లు ఇస్తున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్‌ దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరు నేరస్థులు మన ప్రయేమం లేకుండానే ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారు.

అయితే మన ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించాం.? వేరే వారు ఎవరైనా మన ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారా.? అన్న అనుమానం వస్తే తెలుసుకోవడానికి ఒక ట్రిక్ అందుబాటులో ఉంది. ఇందుకోసం ఆధార్‌ కార్డ్‌ హిస్టరీని చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే సులువుగా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆధార్‌ హిస్టరీ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్‌పోర్టల్‌లోకి వెళ్లాలి.

 అనంతరం ఎడమ వైపు కనిపించే My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar services ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* తర్వాత కిందికి స్క్రోల్‌ చేసి Aadhaar Authentication History ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే లాగిన్‌ కోసం కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

* లాగిన్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్‌ నెంబర్‌, క్యాప్చాను ఎంటర్‌ చేయాలి. మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.

* తర్వాత ఓపెన్‌ అయ్యే స్క్రీన్‌లో కిందికి స్క్రోల్‌ చేస్తే Authentication History ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* అనంతరం ‘ఆల్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేసిన వెంటనే డేట్‌ను ఎంపిక చేసుకొని Fetch Authentication History ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* దీంతో ఆధార్‌కు లింక్‌ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే వివరాలు వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తాయి.

error: Content is protected !!