B.Sc-Nursing-B.P.T-Physiotherapy-AHS-Paramedical-Courses-svims-2024-25

B.Sc-Nursing-B.P.T-Physiotherapy-AHS-Paramedical-Courses-svims-2024-25

PROSPECTUS FOR THE ACADEMIC YEAR 2024-25 (Web-based counselling) For B.Sc. Nursing, B.P.T. (Physiotherapy) & B.Sc. AHS (Paramedical) Courses.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. మొత్తం 100 సీట్లు ఉన్నాయి.

ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు పది సీట్లు కేటాయించారు. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.41,000. ఈ ప్రోగ్రామ్‌కు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్( ఐఎస్సీ) గుర్తింపు ఉంది. బీపీటీ కోర్స్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగున్నరేళ్లు ఇందులో ఎనిమిది సెమిస్టర్లు, ఆర్నెళ్లఇంటర్న్షిప్ ఉంటాయి. మొత్తం 50 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు అయిదు సీట్లు ప్రత్యేకించారు. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.41,000. ఈ ప్రోగ్రామ్నకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్(ఐఏపీ) గుర్తింపు ఉందన్నారు.

బీఎస్సీ(పారామెడికల్) కోర్సు ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు, ఏడాది ఇంటర్న్షిప్ ఉంటాయి. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.29,000, ఈ ప్రోగ్రామ్కు ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు ఉందన్నారు. స్పెషలైజేషన్లు-సీట్లు యొక్క వివరాలు చూసామంటే… అనస్తీషియా టెక్నాలజీ 12, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 20, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ 9, కార్డియాక్ పల్మ సరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ 2, ఈసీజీ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ 8. డయాలసిస్ టెక్నాలజీ 12, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ 1. న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ 4, రేడియోథెరపీ టెక్నాలజీ 5, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 2 ఉన్నాయి.

అర్హత వివరాలు

గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు, సంబంధిత విభాగంలో ఇంటర్ ఒకేషనల్ ప్రోగ్రామ్ పూర్తిచేసినవారు,ఇంటర్ ఒకేషనల్ తో పాటు సంబంధిత బ్రిడ్జ్ కోర్సు ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. ఏఐఎస్ఎస్సీఈ/ ఐసీఎస్ఈ/ఎస్ఎస్సీఈ/ హెచ్ఎస్సీఈ/ఎన్ఐఐఓఎస్ అభ్యర్థులు కూడా అర్హులే.

ఏపీ ఈఏపీసెట్ 2024లో ర్యాంక్ సాధించి ఉండాలన్నారు. వయసు 2024 డిసెంబరు 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 35 ఏళ్లు మించకూడదు. 25 ఏళ్లు నిండిన అభ్యర్థులందరూ డిక్ల రేషన్ ఫారం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.2506, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.2077ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 22 గా పరిగణించారు.

AP EAPCET 2024 ర్యాంక్ ఆధారంగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ యూనివర్సిటీ)… 2024-25 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.*

Courses:* B.Sc  Nursing, BPT, B.Sc. (AHS) (Paramedical)
Eligibility:* Inter (Bi.P.C) & AP EAPCET 2024 Rank

I.  B.Sc  Nursing – 100 seats

II. BPT – 50 seats

III. B.Sc. (AHS) – 78 seats  (in 10 specialities)

B.Sc Anaesthesia Technology (AT) – 12

B.Sc Medical Lab Technology  (MLT) – 20

B.Sc Neurophysiology Technology – 04

B.Sc Radiography & Imaging Technology (RIT) – 09

B.Sc Cardiac Pulmonary Perfusion Technology (CPPT) -02

B.Sc ECG and Cardiovascular Technology (ECG & CVT)-08

B.Sc Dialysis Technology (DT) –  12

B.Sc Emergency Medical Services Technology (EMST) –  04

B.Sc  Radiotherapy  Technology (RT) – 05

10.B.Sc Nuclear Medicine Technology (NMT) – 02
SVIMS BPT/B.Sc Nursing/B.Sc Paramedical Courses Admissions 2024-25 Notification, Eligibility, Schedule, Fee Payment, Online Apply Link CLICK HERE

SVIMS OFFICIAL WEBSITE LINK CLICK HERE

Online application instructions and link

UG Prospectus 2024-25

UG Admissions 2024-25 selection procedure

error: Content is protected !!