invest-once-in-lic-single-premium-policy-saral-pension

invest-once-in-lic-single-premium-policy-saral-pension

LIC Plan: ఎల్ఐసీ బెస్ట్ ప్లాన్.. ఒక్కసారి కడితే జీవితాంతం నెలకు రూ.12 వేలు.. 40 ఏళ్ల నుంచే షురూ!

LIC Plan: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దల మాట. అదే విధంగా సంపాదించే సమయంలోనే భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో జీవితం మొత్తం కష్టపడేందుకు చాలా మంది ఇష్టపడడం లేదు. వీలైనంత త్వరగా జీవితానికి సరిపడా సంపాదించి ఆ తర్వాత లైఫ్ ని ఎంజాయ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక బెస్ట్ పెన్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. జీవితాంతం నెలకు రూ.12 వేల చొప్పున పెన్షన్ అందుకోవచ్చు. అది కూడా 40 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ తీసుకోవడం ప్రారంభించవచ్చు.

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యెజన్ (LIC Saral pension Yojana) లో చేరడం ద్వారా 40 ఏళ్ల నుంచే పెన్షన్ అందుకోవచ్చు. ఇది ఒక సింగిల్ ప్రీమియం పాలసీ. ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం మీకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. పాలసీదారుడు మరణించిన అనంతరం జీవిత భాగస్వామికి లేదా సూచించిన నామినికీ పెట్టుబడితో పాటు పరిహారం చేల్లిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగానూ ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు. మీకు ఎంత పెన్షన్ రావాలనుకుంటున్నారో దానికి తగినట్లుగానే పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో చేరేందుకు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు అర్హులు. ఈ సరళ్ పెన్షన్ ప్లాన్ తీసుకుంటే ఆ ఏడాది నుంచే పెన్షన్ ప్రారంభమవుతుంది. ఆరు నెలల తర్వాత నచ్చకపోతే సరెండర్ చేసుకోవచ్చు.

ఈ సరళ్ పెన్షన్ ప్లాన్ ను రెండు రకాల ఆప్షన్లలో తీసుకోవచ్చు. సింగిల్ లైఫ్ ప్లాన్ ద్వారా పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తూనే ఉంటుంది. మరణాననంతరం అతను పెట్టిన పెట్టుబడి సొమ్మును నామినీకి తిరిగి ఇస్తారు. ఇక రెండోది జాయింట్ లైఫ్ ప్లాన్. రెండో ఆప్షన్ తీసుకుంటే పాలసీదారుడు మరణించే వరకు పెన్షన్ రావడంతో పాటు అతని మరణానంతరం జీవిత భాగస్వామికి పెన్షన్ మొదలవుతుంది. ఒక వేళ ఇద్దరూ మరణిస్తే నామినీకి పెట్టుబడి చెల్లిస్తారు.

ఈ ప్లాన్ ద్వారా నెలకు కనీసం రూ.1000 పెన్షన్ వచ్చేలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేదానిపై మీకు వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. నెలవారీగా, ఆరు నెలలు, వార్షిక వాయిదా పద్ధతుల్లోనూ పెన్షన్ అందుకునే ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఉదాహరణకు ఒక 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రూ.30 లక్షల పెట్టి ఈ సరళ్ పెన్షన్ యోజన పాలసీ కొనుగోలు చేశారు అనుకుందాం. సదరు వ్యక్తికి నెలకు రూ.12,388 వరకు పెన్షన్ లభిస్తుంది. ఇలా పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం నెలకు రూ.12 వేలపైన పెన్షన్ వస్తుంది.

error: Content is protected !!