SSLV-D3-ISRO Launched EOS-08

SSLV-D3-ISRO Launched EOS-08

షార్‌ నుంచి విజయవంతంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగం

SSLV-D3: షార్‌ నుంచి విజయవంతంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగం- 17 నిమిషాల్లో కక్షలోకి చేరిన ఉపగ్రహాలు

ISRO Launched EOS-08: ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 ద్వారా 17 నిమిషాల్లో ఉపగ్రహాలను కక్షలోకి పంపించింది.

Earth Observation Satellite -08: షార్‌ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 విజయవంతంగా ప్రయోగించారు. ఉదయం 9.17 నిమిషాలకు ఈ స్మాల్‌ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ నింగిలోకి పంపించారు. దీనికి నిన్న అర్థరాత్రి 2 గంటల నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. 

9.17 నిమిషాలకు ప్రారంభమైన ప్రయోగం… దాదాపు 17 నిమిషాల్లో పూర్తి అయింది. ఈ వెహికల్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (EOS–08)తో పాటు ఎస్‌ఆర్‌–0 డెమోశాట్‌ అనే చిన్న తరహా ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వీటనిని సర్క్యులర్‌ ఆర్బిట్‌లో ఉంచింది. ఈ ఉపగ్రహాలు రక్షణ రంగంతో పాటు ఇతర రంగాలకు సర్వీస్‌ అందించబోతున్నాయి. 

119 టన్నుల బరువు కలిగి 34 మీటర్లు పొడువు 2 మీటర్లు వెడల్పు ఉన్న SSLVD-D3 రాకెట్‌ ప్రయోగం మొదటి దశలో 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించారు. దీన్ని కేవలం 124 సెకన్లలో పూర్తి చేశారు. తర్వాత 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లకు, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లకు పూర్తి చేశారు. నాల్గో దశలో 175.5 కేజీల బరువు ఉన్న ఈఓఎస్‌–08 మొదటిగా కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తర్వాత ఎస్‌ఆర్‌–0 డెమోశాట్‌ ఉపగ్రహాన్ని లియో అర్బిట్‌లో ప్రవేశ పెట్టింది. 

error: Content is protected !!