personal-loans-low-interest-rates-details

personal-loans-low-interest-rates-details

బంపర్ ఆఫర్..ఈ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే పర్సనల్​ లోన్లు.. ఏ బ్యాంక్‌లో ఎంతంటే?

Personal Loan: అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు చాలా మంది ప్రజలు పర్సనల్ లోన్ తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు.

ఎందుకంటే వ్యక్తిగత రుణం కోసం ముందస్తు హామీగా ఎలాంటి ఆస్తిపాస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే వ్యక్తిగత రుణాలు చాలా పాపులర్ అయ్యాయి.

అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు చాలా మంది ప్రజలు పర్సనల్ లోన్ (Personal loans) తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు.

ఎందుకంటే వ్యక్తిగత రుణం కోసం ముందస్తు హామీగా ఎలాంటి ఆస్తిపాస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే వ్యక్తిగత రుణాలు చాలా పాపులర్ అయ్యాయి.

అయితే ఎలాంటి తనఖా ఉండదు కావున దాదాపు అన్ని బ్యాంకులు అధిక వడ్డీ (Interest Rates) రేట్లతో పర్సనల్ లోన్స్ అందిస్తుంటాయి.

కానీ కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే వ్యక్తిగత రుణాలను అందజేస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు మంజూరు చేసే ముందు బ్యాంకులు రుణ గ్రహీతల రిపేమెంట్ హిస్టరీ (Repayment History), ఆదాయం (Income), క్రెడిట్ స్కోరు (Credit Score)ను పరిశీలిస్తాయి. ఈ అర్హతలు వేతన జీవులకు ఒకలా.. స్వయం ఉపాధి కల్పించుకున్న వారికి మరోలా ఉంటాయి. వేతన జీవులు పర్సనల్ లోన్ తీసుకునే ముందు తమ మూడు నెలల పే స్లిప్స్ (Payslips), ఫారం 16, మునుపటి ఏడాదికి సంబంధించిన ఇన్‌క‌మ్ టాక్స్ రిటర్న్స్  (Income Tax Returns) బ్యాంకులకు అందించాల్సి ఉంటుంది.

స్వయం ఉపాధి కల్పించుకున్న వ్యక్తులు ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌, గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఐటీఆర్(ITR) బ్యాంకుల్లో సమర్పించాల్సి ఉంటుంది. అలాగే వారి బిజినెస్ అనేది కనీసం గత రెండేళ్లుగా నడుస్తూనే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వారు తమ వ్యాపారాన్ని మూసి వేసినట్లయితే రుణాలు జారీ కావు. అంతేకాకుండా, రుణ గ్రహీతలు కొత్తగా వ్యక్తిగత రుణం తీసుకునే ముందు.. ప్రస్తుతం తమకు ఉన్న ఇతర రుణాలను తీర్చడం అత్యావశ్యకం.

దీనివల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఫలితంగా రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఈఎంఐ చెల్లింపులలో డిఫాల్ట్స్ (defaults) లేకుండా, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా ఉండటం వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. తద్వారా లోన్ అప్రూవల్ అవకాశాలు పెరుగుతాయి.

అలాగే, మీకు అవసరమైనంత వరకు మాత్రమే వ్యక్తిగత రుణం తీసుకోండి. అలా చేయడం వల్ల మళ్ళీ తిరిగి చెల్లించడం చాలా సులభతరం అవుతుంది.

ప్రధానంగా వ్యక్తిగత రుణాలు అందిస్తున్న అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లు పోల్చి చూడటం చాలా ముఖ్యం. వ్యక్తిగత రుణంపై కొంచెం వడ్డీ రేటు తగ్గినా.. మీరు చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐదేళ్ల కాలపరిమితితో రూ.5 లక్షల పర్సనల్ లోన్ అతి తక్కువ వడ్డీ రేట్లకే ఆఫర్ చేస్తున్న బ్యాంకులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

యూనియన్​ బ్యాంక్​లో అతి తక్కువ వడ్డీ..

యూనియన్ బ్యాంక్ 8.90% వడ్డీ రేటుతో రూ.5 లక్షల వ్యక్తిగత రుణం ఆఫర్ చేస్తోంది. ఐదేళ్ల కాలపరిమితి అందించే ఈ లోన్ తీర్చడానికి ప్రతినెలా మీరు రూ.10,355 ఈఎంఐ (EMI) కట్టాల్సి ఉంటుంది.

సెంట్రల్ బ్యాంక్ కూడా ఇదే వడ్డీ రేటుతో ఇదే మొత్తం రుణం ఆఫర్ చేస్తోంది. దీని ఈఎంఐ కూడా రూ.10,355 నిర్ణయించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.95 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి రూ.5 లక్షలు అందజేస్తోంది. నెలవారీ వాయిదా రూ.10,367 చెల్లించాలి.

ఇండియన్ బ్యాంక్ 9.05 శాతం వడ్డీ రేటుకు ఐదేళ్లకు రూ.5 లక్షలు ఇస్తుండగా.. రూ.10,391 ఈఎంఐ కట్టాలి.

ఇక, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 9.50 శాతం, ఐడీబీఐ 9.50 శాతం,

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.60 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 10.00 శాతం,

యూకో బ్యాంక్ 10.05 శాతం, సౌత్ ఇండియన్ బ్యాంక్ 10.25 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 10.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.35 శాతం, ఎస్ బ్యాంక్ 10.40 శాతం, ఫెడరల్ బ్యాంక్ 10.49 శాతం, ఐడీఎఫ్‍సీ 10.49 శాతం, ఐసీఐసీఐ 10.50 శాతం, కోటక్ బ్యాంక్ 10.75 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 10.80 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 11.00 శాతం, కెనరా బ్యాంక్ 11.25 శాతం,

ధనలక్ష్మి బ్యాంక్ 11.90 శాతం, యాక్సిస్ బ్యాంక్ 12.00 శాతం, కరూర్ వైశ్యా బ్యాంక్ 12.00 శాతం, కర్ణాటక బ్యాంక్ 12.45 శాతం వడ్డీ రేటుకు ఐదేళ్ల కాలానికి రూ.5 లక్షల వ్యక్తిగత రుణాన్ని అందిస్తున్నాయి.