OLA-launches-electric-scooter-in-July-complete-details

OLA-launches-electric-scooter-in-July-complete-details

Ola Electric Scooter: ఈ నెలలోనే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎన్నో ప్రత్యేకతలు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెలలోనే విడుదల కానుంది. ఆ స్కూటర్ ప్రత్యేకతలు ఇవే.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ నెలలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

గంటకు 90 కి.మీ వేగంతో..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకే ఛార్జీ చేస్తే సుమారు 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దీనిలో బ్యాటరీ మార్చుకునేందుకు వీలుగా ఉండే లిథియం అయాన్​ బ్యాటరీ చేర్చనున్నారు. ఇక, స్కూటర్​ కింది భాగంలో రెండు హాఫ్​ హెల్మెట్లు పట్టేంద ఖాళీ ప్రదేశం కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హోమ్ ఛార్జర్ కూడా ఉంటుంది. దీనికి ఎటువంటి ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. రెగ్యులర్ వాల్ సాకెట్‌లోకి ప్లగ్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనాన్ని ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

గత ఏడాది కంపెనీ రూ .2,400 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇది తమిళనాడులో మొట్టమొదటి  ఈ-స్కూటర్ సంస్థ. ఫ్యాక్టరీ పూర్తిగా పనిచేస్తే ఇది సుమారు 10,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. సంవత్సరానికి 2 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసే ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-స్కూటర్ కంపెనీగా మారనుంది.

ఓలా చైర్మన్ మరియు గ్రూప్ సీఈఓ భాబీష్ అగర్వాల్ మాట్లాడుతూ.. జూన్ నుంచి ఈ కర్మాగారం పనిచేస్తోందన్నారు. మరియు ఈ ఈ-స్కూటర్ జూలైలో మార్కెట్లోకి వస్తుందని చెప్పారు. ఫ్యాక్టరీ  సంవత్సరంలోపు గరిష్ట ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని వివరించారు.

ఈ స్కూటర్ ను భవిష్యత్ అవసరాల కోసం మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు ఎలక్ట్రానిక్ వాహనాలపై ఎక్కువ ఆధారపతారన్నారు.

ఛార్జింగ్ సమస్యల పరిష్కారం కోసం 400 నగరాల్లో సుమారు 1 లక్ష ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి సంవత్సరంలో 100 నగరాల్లో 5,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది

ఈ స్కూటర్ కు 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ పూర్తవువుతంది. దీంతో 75 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు, గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ఈ స్కూటర్ పై ప్రయాణించవచ్చు.

వినియోగదారుల సౌకర్యం కోసం ఛార్జింగ్ స్టేషన్లును స్టాండ్ ఒంటరిగా టవర్లు, మాల్స్, ఐటి పార్కులు, కార్యాలయాలు, కాంప్లెక్స్ ల వద్ద ఏర్పాటు చేయనున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ యాప్ ద్వారా ద్వారా ఛార్జింగ్ పాయింట్ ల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.