list-of-general-optional-holidays-2024-ap-employees-teachers

list-of-general-optional-holidays-2024-ap-employees-teachers
HOLIDAYS – HOLIDAYS UNDER THE NEGOTIABLE INSTRUMENTS ACT, 1881 FOR THE YEAR 2024 – NOTIFIED. [G.O.Rt.No.2319, General Administration (Political. B),

AP Govt Holidays: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నవంబరు 30న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt Holidays: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నవంబరు 30న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ సెలవులు, పండుగలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఏడాది మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా (Optional Holidays) ప్రకటించింది. జనవరి 15, 16ను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది.

భోగి, అంబేడ్కర్ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది. 

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం.. జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ సెలవులను ప్రకటించింది. జనవరి 26న రిపబ్లిక్‌ డే, మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ ఫ్రై డే సెలవులుంటాయని ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో స్ఫష్టం చేశారు.

ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్‌, 17న శ్రీరామ నవమి, జూన్‌ 17న బక్రీద్‌ సెలవులుంటాయని తెలియజేసింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్‌ 7న వినాయక చవితి సెలవులు, 16న ఈద్‌-ఉల్‌-ఉన్‌-నబీ పండుగల సందర్భంగా సెలవులను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సెలవులు ఉంటాయని వెల్లడించింది . వీటితో పాటు మరో 17 ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది .

ఆదివారాలు, రెండో శనివారాలకు అదనంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే ఇతర సెలవులతో కూడి జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాలు ఇందులో ఉన్నాయి.

వీటిని ప్రభుత్వ సంస్ధలు, కార్పోరేషన్లతో పాటు ప్రభుత్వం కింద పని చేసే అన్ని సంస్ధలు, ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ముస్లింల పండుగలైన రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీలకు కూడా ఇందులోనే సెలవులు ప్రకటించినప్పటికీ ఏదైనా మార్పు ఉంటే అప్పుడు మార్చుకునేందుకు వీలు కల్పించింది.

LIST OF HOLIDAY FOR 2024 PDF CLICK HERE

20 సాధారణ సెలవులు ఇవే..

➥ మకర సంక్రాంతి: 15.01.2024.

➥ కనుమ: 16.01.2024.

➥ రిపబ్లిక్ డే: 26.01.2024.

➥ మహాశివరాత్రి: 08.03.2024.

➥ హోలీ: 25.03.2024.

➥ గుడ్ ఫ్రైడే: 29.03.2024.

➥ బాబు జగ్జీవర్ రామ్ జయంతి: 05.04.2024.

➥ ఉగాది: 09.04.2024.

➥ ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్): 11.04.2024.

➥ శ్రీరామ నవమి: 17.04.2024.

➥ బక్రీద్: 17.06.2024.

➥ మొహార్రం: 17.07.2024.

➥ ఇండిపెండెన్స్ డే: 15.08.2024. 

➥ శ్రీకృష్ట జన్మాష్టమి: 26.08.2024.

➥ వినాయక చవితి: 07.09.2024.

➥ ఈద్ మిలాద్-ఉన్-నబి: 16.09.2024.

➥ మహాత్మాగాంధీ జయంతి: 02.10.2024.

➥ దుర్గాష్టమి: 11.10.2024.

➥ దీపావళి: 31.10.2024.

➥ క్రిస్ట్‌మస్: 25.12.2024.

17 ఆప్షనల్ హాలిడేస్ (ఐచ్ఛిక సెలవులు) ఇవే..

➥ కొత్త సంవత్సరం దినోత్సవం (New Year Day): 01.01.2024.

➥ హజ్రత్ అలీ జయంతి: 25.01.2024.

➥ షబ్-ఈ-మెరాజ్: 07.02.2024.

➥ షహదత్ హజ్రత్ అలీ: 01.04.2024.

➥ జమాతుల్ వెద: 05.04.2024.

➥ బసవ జయంతి: 10.05.2024.

➥ బుద్ద పూర్ణిమ: 23.05.2024.

➥ ఈద్-ఎ-గదీర్: 25.06.2024.

➥ 9వ మొహార్రం: 16.07.2024.

➥ పార్సీ కొత్త సంవత్సరం దినోత్సవం: 15.08.2024.

➥ వరలక్ష్మి వ్రతం: 16.08.2024.

➥ మహాలయ అమావాస్య: 02.10.2024.

➥ యజ్-దహమ్-షరీఫ్: 15.10.2024.

➥ కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి: 15.11.2024.

➥ హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువాన్‌పూర్ మెహదీ జయంతి: 16.11.2024.

➥ క్రిస్ట్‌మస్ ఈవ్: 24.12.2024.

➥ బాక్సింగ్ డే: 26.12.2024.

www.apteachers360.com