JNVST Admissions-6th-class-admissions

JNVST Admissions-6th-class-admissions

JNVST Admission : నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లు.. అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభమైంది

JNVST Class 6 Admission 2025 : దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి జవహార్‌ నవోదయ విద్యాలయ (Navodaya Vidyalaya Samiti) సెలక్షన్‌ టెస్ట్‌ – 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ జులై 16 నుంచి ప్రారంభమైంది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబరు 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 653 విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. 01-05-2013 నుంచి 31-07-2015 మధ్య జన్మించిన వారు అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్‌-15 జవహార్‌ నవోదయ విద్యాలయాలున్నాయి. విద్యార్థులు పూర్తి వివరాలకు CLICK HERE

రాత పరీక్ష విధానం :

రాత పరీక్ష ఆయా తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 3 విభాగాల నుంచి 80 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెంటల్‌ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, అర్ధమెటిక్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు, ల్యాంగ్వేజ్‌ టెస్ట్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 2 గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఓఎమ్మార్‌ షీట్‌పై సరైన సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ప్రతి తప్పు సమాధానానికి 1.25 మార్కుల చొప్పున కోత ఉంటుంది. రాత పరీక్ష స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు. తెలుగుతో సహా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ, బోడో, బెంగాళీ, అస్సామీ,పంజాబీ వంటి అన్ని స్థానిక భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

error: Content is protected !!