how-to-order-PVC-Aadhar-card-in-Aadhar-main-website

how-to-order-PVC-Aadhar-card-in-Aadhar-main-website

Aadhaar Card: అలర్ట్… మీ దగ్గరున్న ఆధార్ కార్డ్ చెల్లకపోవచ్చు… ఎందుకో తెలుసుకోండి

మీ జేబులో ఆధార్ కార్డ్ ఉందా? అయితే ఆ ఆధార్ కార్డ్ చెల్లకపోవచ్చు. ఆధార్ కార్డుల వినియోగంపై యూఐడీఏఐ (UIDAI) మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరి ఆధార్ కార్డ్ హోల్డర్లు ఒరిజినల్ ఆధార్ కార్డులు ఎలా పొందాలో తెలుసుకోండి.

మీరు ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకొని, ల్యామినేషన్ చేయించి జేబులో ఐడీ కార్డులా మెయింటైన్ చేస్తున్నారా? అయితే ఆ ఆధార్ కార్డ్ (Aadhaar Card) చెల్లదు. అదే కాదు… మీరు బయట మార్కెట్‌లో ఆధార్ పీవీసీ కార్డ్, ప్లాస్టిక్ ఆధార్ కార్డ్, ఆధార్ స్మార్ట్ కార్డ్ ప్రింట్ చేయిస్తే అవేవీ చెల్లవు. వాటిని ఒరిజినల్ ఆధార్ కార్డులుగా పరిగణించబోమని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తెలిపింది. కేవలం యూఐడీఏఐ జారీ చేసే ఆధార్ కార్డులు మాత్రమే చెల్లుతాయి. యూఐడీఏఐ జారీ చేసే ఇ-ఆధార్, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డులు మాత్రమే చెల్లుతాయి. అంటే వీటిని మాత్రమే ఎక్కడైనా ఐడీ ప్రూఫ్‌గా, అడ్రస్ ప్రూఫ్‌గా చూపించొచ్చు.

ఇ-ఆధార్, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డు కాకుండా బయట మార్కెట్‌లో ప్రింట్ తీసుకొని ల్యామినేషన్ చేయించినా, ప్లాస్టిక్ కార్డుపై ఆధార్ కార్డ్ ప్రింట్ చేయించినా ఆ ఆధార్ కార్డు చెల్లదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇ-ఆధార్ కార్డులు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. ఆధార్ లెటర్ పోస్టు ద్వారా వస్తుంది. ఆధార్ పీవీసీ కార్డును ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు.

eAadhaar Card Download: ఇఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయండి ఇలా

ముందుగా https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Download Aadhaar పైన క్లిక్ చేయాలి.

12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.

ఇ-ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.

మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్స్‌లో, పుట్టిన సంవత్సరం కలిపి పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే ఇఆధార్ ఓపెన్ అవుతుంది.

Aadhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేయండి ఇలా

ముందుగా https://uidai.gov.in/ హోమ్ పేజీ ఓపెన్ చేయాలి.

My Aadhaar సెక్షన్‌లో Order Aadhaar PVC Card ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రూ.50 చెల్లించాలి.

పేమెంట్ పూర్తైన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుంది.

ఐదు వర్కింగ్ డేస్‌లో మీ అడ్రస్‌కు ఆధార్ పీవీసీ కార్డ్ వస్తుంది.

ఆధార్ పీవీసీ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. జేబులో, పర్సులో మెయింటైన్ చేయడానికి ఆధార్ పీవీసీ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. ది ఒరిజినల్ ఆధార్ కార్డ్ కాబట్టి ఎక్కడైనా ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగించొచ్చు. కేవలం రూ.50 చెల్లించి ఆధార్ పీవీసీ కార్డు పొందొచ్చు.

https://uidai.gov.in/

error: Content is protected !!