how-to-download-vaccination-certificate-through-whatsapp

how-to-download-vaccination-certificate-through-whatsapp

Vaccination Certificate: వాట్సాప్​లోనూ వ్యాక్సిన్​​ సర్టిఫికెట్.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను ఈజీగా పొందొచ్చు.

వాట్సాప్ ద్వారా ఈ డాక్యుమెంట్‌ను క్షణాల్లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఈ నేపధ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కేంద్ర ఆరోగ్యశాఖ వాట్సాప్‌ నుంచి పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుంది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ట్వీట్‌ చేశారు. ఒక్క డోసు టీకా తీసుకున్నా, రెండు డోసులు తీసుకున్నా.. ఆ మేరకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను పొందొచ్చునని.. ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మరి డౌన్‌లోడ్‌ చేసుకునే ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూద్దాం…

దేశంలో కరోనా కట్టడికి ఏకైక ఆయుధంగా భావిస్తున్న వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా జనాభా వ్యాక్సిన్​ తీసుకున్నారు.

వాక్సిన్​ తీసుకున్న వారు తమ వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా, దేశీయ, విదేశీ ప్రయాణాల్లో ఇది ఉపయోగపడుతుంది.

దీని కోసం ప్రభుత్వం కోవిన్​ అనే యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, దీనిపై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే, వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఛాటింగ్​ యాప్​ వాట్సాప్​లో కూడా వాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.

MyGov కరోనా హెల్ప్‌డెస్క్ ఈ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్​ కేంద్రాలు, టెస్టింగ్​ కేంద్రాలు వంటి వివరాలను మాత్రమే తెలియజేసిన ఈ హెల్ప్​డెస్క్​.. ఇప్పుడు వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ను నేరుగా వాట్సాప్​లోనే పొందే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ, ఈ సర్టిఫికెట్​ ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో స్టెప్​ బై స్టెప్​ ప్రాసెస్​ చూద్దాం.

వ్యాక్సిన్​ సర్టిఫికెట్​ డౌన్​లోడ్​ చేసుకునే ప్రక్రియ..

స్టెప్​ 1: మీ స్మార్ట్​ఫోన్​లో MyGov కరోనా హెల్ప్‌డెస్క్ వాట్సాప్​ నంబర్ +91 9013151515 ను సేవ్​ చేసుకోండి.

స్టెప్​ 2: ఫోన్​ నంబర్​ను సేవ్​ చేసిన తర్వాత వాట్సాప్​ యాప్​ను ఓపెన్​ చేయండి.

స్టెప్​ 3: చాట్​ విండోలో ఈ కాంటాక్ట్​ నంబర్​ను సెర్చ్​ చేసి ఓపెన్​ చేయండి.

స్టెప్​ 4: తర్వాత డైలాగ్ బాక్స్‌లో, డౌన్‌లోడ్ సర్టిఫికెట్ అని టైప్ చేయండి.

స్టెప్​ 5: మీ వాట్సాప్​ నంబర్​ ఇది వరకే కొవిన్​ ప్లాట్​ఫామ్​లో నమోదై ఉంటే మీకు ఆరు అంకెల OTP వస్తుంది.

స్టెప్​ 6: ఓటీపీని వాట్సాప్​ చాట్​లో ఎంటర్​ చేయండి.

స్టెప్​ 7: చాట్​బాట్​ వెంటనే మీ వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ను మీ వాట్సాప్​ నంబర్​కు పంపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోండి.

ఒకవేళ, వ్యాక్సిన్​ కోసం మీరు వేరే మొబైల్​ నంబర్​ ఇచ్చి ఉంటే ఆ వాట్సాప్​ నంబర్​ నుంచే ఈ మెసేజ్​ పంపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ను కోవిన్ యాప్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AAROGYA SETHU MOBILE APP DOWNLOAD