Conducting-parent-committee-elections-complete-details

AP లో పాఠశాల విద్యాకమిటీల ఎన్నికలకు మోగిన నగారా!

23న తల్లితండ్రుల కమిటీ ఎన్నికలు

clarifications on conducting parent committee electins

PC ఎన్నికల నిర్వహణపై సందేహాలకు SPD గారి వివరణలు Vide SSA AP SPD Memo No 16021 dt 19.9.2021
High lights:
>Parent/ Guardian Govt employee అయినా కూడా Parents commitee ఎన్నికల్లో Contest చేయవచ్చును
>ఒక Parent కు ఒకరి కంటె ఎక్కువ పిల్లలు School లో వేరు వేరు క్లాసులలో చదువు తుంటే ప్రతి Class PC ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన వచ్చును అయితే ఒక ఏదో ఒక క్లాసు నుండే ఎన్నిక అవ్వాలి
> Sept 22 నా పాఠశాలలో Exams జరుగుతూ ఎన్నిక నిర్వహించ లేకుంటే ,Timings మార్చు కొనవచ్చును, లేక దగ్గరలోని మరొక పాఠశాలలో నిర్వహించు కొనవచ్చును .మరో రోజుకు వాయిదా వేయాలంటే జిల్లా కలెక్టరు గారి అనుమతి తీసుకోవాలి
> తల్లి తండ్రలలోఇద్దరూ లేక ఎవరో ఒకరు జీవించి యున్నాడు సంరక్షుకుని అనుమతించరాదు
> Child info లో పేరు ఎక్కించుక పోయినా ది 15.9.2021 నాటికి అన్ని ధృవపత్రాలతోManual Admission జరిగి ఉంటే‌ఆ తల్లి/తండ్రి/సంరక్షకునికి ఓటర్ లిస్టు లో చేర్చాలి
> Weaker Sections అంటే‌BC,Minorities,తో పాటుAnnual income RS 1.20 lakhs (in urban Rs1.4lakh) గరిష్టంగా యున్న O.C లు కూడా
>PC Members పదవీ కాలము 2 ఏళ్ళు( గత ఎన్నిక తేదీ నుండి 2ఏళ్ళు లేక విద్యార్ధి పాఠశాల విడిచిన తేది లలో ఏది ముందయితే ఆ తేది)

New clarification on PC ELECTIONS CLICK HERE

*పేరెంట్స్ ఎన్నికలు-2021* : జాగ్రత్తలు
===============
ఓటర్స్ జాబితా తయారు చేయుటకు Admission Register ప్రామాణికం.

❌Child info తో అవసరం లేదు.❌

1. 15.09.2021 తేదీ నాటికి పాఠశాలలో చేరిన వారి వివరాలు Admission Register & Pupils Attendance Register లో తప్పక నమోదు చేయండి.

2. ఇది వరకే పాఠశాలలో చేరి, ప్రస్తుతం ప్రవేటు పాఠశాలకు వెళ్లే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
వీరు కమిటీ సభ్యులుగా ఎంపిక చేయవద్దు.
అవసరమైతే… Remove/Droup out గా చేయండి.

3. ఈ ఎన్నికల నిర్వహణ పూర్తిగా Head Teacher/HM లదే. కాబట్టి సహచర ఉపాధ్యాయులతో కలసి కమిటీ ఏర్పాటులో తగిన జాగ్రత్తలు పాటించండి.

4. ఆహ్వాన పత్రాలను ప్రతి పిల్లవానికి ఇచ్చి రసీదు తెప్పించుకొని ఫైల్ చేసి భద్రపరచుకోండి.

5. ఇదివరకే ఉన్న చైర్మన్ కొనసాగినా… ఎన్నికను మాత్రం కొత్తగా ఎన్నుకొనినట్లుగా చేసుకోవాలి.

6. ప్రతి తరగతికి 3రిని ఎంపిక చేయునపుడు హాజరైన వారిని తరగతివారిగా గదిలోకి పిలిచి ఎన్నుకొన్న 3రిని నిలబెట్టి ఫొటోలు తీసుకోండి.

తరగతిలో 3 కంటే తక్కువ ఉంటే… 2లేదా1 ఉన్నా వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాలి.

7. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరిని పిలువకండి.

8. *ప్రధాన ఎన్నికల అధికారి : HT/HM*

9. సహచర ఉపాధ్యాయుల సహకారం తీసుకోండి.

10. ప్రభుత్వం ఇచ్చిన టైం ప్రకారం మినిట్స్ బుక్ లో రాసుకోండి.

11. హాజరైన వారి సంతకాలు అవసరమైన ప్రతిచోట తప్పక చేయించండి.

12. ఒక చార్ట్ పై…

*ప్రతి ఒక్కరు మాస్క్ తప్పక ధరించండి*

*భౌతిక దూరం పాటించండి*

అని రాసి అందరికి కనిపించేలా అంటించండి.

13. తల్లిదండ్రులు ఇతర దేశాలలో ఉన్న వారి తరపున సంరక్షకులుగా అనుమతించరాదు.
తల్లిదండ్రులు ఇద్దరూ మరణించి ఉంటే… వారిపేరు Admission Register లో రాసి ఉంటేనే ఓటర్ గా గుర్తించాలి.

14. చైర్మన్ గా ఎన్నికయ్యే వారు పాఠశాల అభివృధ్ధికోసం సహకరించేవారై ఉండాలని, పాఠశాల లోని అనేక సమస్యలను చెప్పండి.

15. ఎన్నికల నిర్వహణ సమస్య అయ్యేటట్లు ఉంటే… MEO గారికి తెలుపండి.

Schedule ప్రకారం  16/09/2021  PC Elections ప్రకటన విడుదల చెయ్యాలి

అవును,  ప్రతీ HM తమ పాఠశాలలో నిర్వహించబోయే Parents Comittee Elections కి సంబంధించిన ప్రకటన 16 న  విడుదల చేయాలి

A4 size లో పాఠశాల పేరుతో PC ఎన్నికల ప్రకటన పత్రాన్ని తెలుగులో PDF రూపంలో  కింది లింక్ నుండి easy గా Mobile లో Download చేసుకోవచ్చు

Select Dist, Mandal & school tap on Submit  to Download PC elections Notification. Open link

https://prtuinfo.com/ap/pcelections/notification.php

Parents Commitee Elections కోసం invitation ని మీ పాఠశాల పేరుతో A4 size లో ముగ్గురు పిల్లలకు సరిపోయే విధంగా 3 invitation copy లను కింది లింక్ ద్వారా PDF రూపంలో పొందవచ్చు.

కింది link open చేసి, జిల్లా, మండలం, స్కూల్ select చేసి, student name, father name, class enter చేసి Submit పైన ట్యాప్ చెయ్యండి.

Next screen లో Download invitation పైన ట్యాప్ చెయ్యండి

అంతే, invitation pdf copy mobile లో download అవుతుంది

https://prtuinfo.com/ap/pcelections/invitation.php

Note:

student & father name & class పెన్ను తొ రాసుకోవ టానికి ఖాళీగా ఉండాలి అనుకునే వారు ఆ వివరాలు enter చెయ్యకుండా Submit చెయ్యండి.

ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న ప్రాథమిక పాఠశాలలకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16న ఎన్నికల ప్రకటన జారీ కానుంది.

కమిటీలో మొత్తం 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి. ప్రతి తరగతి విద్యార్థుల నుంచీ తల్లిదండ్రులు ఈ కమిటీలో ఉంటారు. ప్రతి తరగతి నుంచీ ఇద్దరు మహిళలు ఖచ్ఛితంగా ఉండాలి.

తల్లిదండ్రుల కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహణ 22వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది.

అదేరోజు కమిటీ సభ్యులతో అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. కమిటీ మొదటి సమావేశం కూడా అదేరోజు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ ఎన్నికలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి.

ఎన్నికలు నిర్వహించే సమయంలో కనీసం 50 శాతం తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండాలి. తల్లిదండ్రుల్లో, సంరక్షకుల్లో ఒకరికే ఓటు హక్కు ఉంటుంది.

లోకల్‌ బాడిలో ఉన్న సభ్యులు, ప్రధానోపాధ్యాయులు ఓటింగ్‌లో పాల్గనకూడదు.

ప్రభుత్వ, పంచాయతీరాజ్,మున్సిపల్  పాఠశాలల యందు నూతన PC కమిటీల సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ తో కూడిన ఆదేశాలు విడుదల.

తల్లిదండ్రుల కమిటీ ఎలక్షన్స్ కొరకు పూర్తి వివరాలు గల బుక్ లెట్ PDF file DOWNLOAD CLICK HERE

సెప్టెంబర్ 16న నోటిఫికేషన్ విడుదల చేయాలి. మరియు ఓటర్ల జాబితా నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.*

సెప్టెంబర్ 20న అబ్జక్షన్స్ స్వీకరించాలి.  తుది జాబితా విడుదల చేయాలి.*

సెప్టెంబర్ 22న PC కమిటీ ఎన్నిక నిర్వహించాలి.  ప్రమాణ స్వీకారం చేయించాలి.*

సెప్టెంబర్ 22న మొదటి సమావేశం నిర్వహించాలి.

Admission Register  లో   వ్రాసి యున్న  తల్లి/ తండ్రి / సంరక్షకు లకే  ఎవరో ఒకరికే ఓటు

PC ELECTIONS SCHDULE DOWNLOAD PDF

Reconstitution of Parent Committees – Guidelines issued Reg.

Guidelines for Reconstitution of Parents Committees (PCs) in the schools other than Private unaided schools in the State

పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ, ఛైర్మెన్ మరియు వైస్ చైర్మెన్, ఎన్నికల మార్గదర్శకాలు 2021

1. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది (ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలను మినహాయించి)

2. పాఠశాల ప్రదానోపాధ్యాయుడు ఎన్నికలు నిర్వహించాలి.

3. ఎన్నికలు నిర్వహించే సమయంలో కనీసం 50% తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. కోరమన్ను రూపొందించే సమయంను ప్రధానోపాధ్యాయుడు నిర్ణయించాలి.

4. చేతులు ఎత్తే పద్ధతి ద్వారా గాని లేదా నోటితో చెప్పే విధానంలో గాని ఎన్నికలు నిర్వహించాలి. కాని కొన్ని ఆసాధారణ సందర్భం తలెత్తినప్పుడు, రహాస్య బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలి.

5. తల్లి దండ్రులు మరియు సంరక్షకులలో ఒకరు మాత్రమే ఓటు హక్కుకు అర్హులు అపుతారు.

6. వివిధ తరగతులలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆయా తరగతులకు సంబందించిన ఎన్నికల్లో పాల్గోనుటకు అర్హులు.

7. తరగతుల వారిగా ఎన్నిక కాబడిన సభ్యుల నుండి ప్రధానంగా తల్లి దండ్రుల నుండి ఛైర్మెన్ మరియు వైస్ ఛైర్మెన్ను ఎన్నుకోవాలి. వీరిలో కనీసం ఒకరు S.C, S.T, B.C, మైనారిటీల నుండి మరియు కనీసం ఒకరు మహిళ ఉండే విధంగా చూసుకోవాలి.

8. లోకల్ బాడిలో ఉన్న సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయుడు (లేదా) ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఓటింగ్లో పాల్గోనుటకు అర్హులు కారు.

9. ఆయా తరగతులకు సంబంధించి ఓటు హక్కు కలిగిన పేరెంట్/గార్డియన్లు కొత్తగా అవసరమైన పి.సి. సభ్యులను ఎన్నుకోంటారు. అదేవిధంగా ఖాళీ బడిన సభ్యుల స్థానంలో కూడా కొత్త వారిని ఎన్నుకోవచ్చు.

10. ఒకసారి ఎన్నికయిన పి.సి.ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో యం.ఇ.ఓ. మరియు ఇతర పాఠశాలలో D.E.O. గారి ఆదేశాల ప్రకారం రద్దు పరచబడిన లేదా ఇతర పాఠశాలలో కలుపబడే అంతవరకు కొనసాగుతాయి. ఏది ఏమైనప్పటికి సభ్యులు మాత్రం వారి నియమానుసారం పదవీచితులు కాబడుతూ ఉంటారు. ఈ విధంగా ఏర్పడిన ఖాళీలు మరియు సాధారణ ఖాళీలను ఎప్పటికప్పుడు అమలు పరచు ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఎన్నిక కాబడుతుంటారు.

11. అమలు పరచు సంస్థ అనగా, రాష్ట్ర పథక నిర్దేశకుడు (S.P.D) సర్వ శిక్ష అభియాన్ మరియు కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్.

12. నైబర్ హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్ అనగా సురక్షితంగా ప్రయోనించగల 1 కి.మీ. దూరం (పాఠశాల నుండి) లో గల ఆవాస ప్రాంతాలు ప్రాథమిక పాఠశాలలో) అదే విధంగా 3 కి.మీ. పరిధిలో గల ఆవాస ప్రాంతలను “నైబరాుడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్” అంటారు.

13. చైల్డ్ బిలాంగ్స్ టు సోషియల్లీ డిసడ్వాంటేజ్ గ్రూపు అనగా, S.C, S.T, అనాధలు, వలసదారులు, వీధి పిల్లలు, ప్రత్యేక అవసరాలు కల పిల్లలు మరియు హెచ్.ఐ.వి. సోకిన పిల్లలు,

14. చైల్డ్ బిలాంగ్స్ టు వీకర్స్ సెక్షన్స్ అనగా BC.S, మైనారిటీస్, OCలు (తల్లిదండ్రులలో) ఎవరి ఆదాయం (సంవత్సరంలో 60000/- మించకుండా ఉంటుందో వారు.

15. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండరాదు, ఉన్నట్లయితే ఎన్నికలకు ఇబ్బందులు కలిగిస్తే వారు చట్టరిత్యా శిక్షార్హులు.

16. పరిశీలకులుగా తహశిల్దార్ / M.P.D.O. విలేజ్ సెక్రెటరీ లేదా V.R.O., V.R.Aలు ఎన్నికల కార్యక్రమంలో పాటు పంచుకోటారు.

17. ఓటు పొందే హక్కు మొదట తల్లికి తరువాత తండ్రికి ఆ తరువాత సంరక్షకులకు ప్రాధాన్యత క్రమం ఇవ్వబడుతుంది. అయితే వారిలో ఒకరు మాత్రమే ఓటింగ్కు అర్హులు.

18. ఓటింగ్ లో పాల్గోనే సభ్యులు ఐడి ప్రూఫ్ గా క్రింది కనబరచిన వాటిలో ఏదైనా ఒకటి తప్పక తీసుకురావాలి.

Required for Voting Identity

  • 1) ఈ ఓటింగ్ కోసం ఇష్యూచేయబడిన ఓటింగ్ గుర్తింపుకార్డు.

  • 2 రేషన్ కార్డు

  • 3) ఆధార్ కార్డు

  • 4) వింగ్ లైసెన్స్

  • 5) ఓటర్ కార్డ్

  • 6) ఇతర ఏదైనా ఐడి కార్డు ప్రభుత్వం చే ఇవ్వబడి ఉండాలి

19. డిసడ్వాంటేజ్ మరియు వీకర్ సెక్షన్ సభ్యులు లేని పక్షంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సభ్యులను ఎన్నుకోవాలి.

PC ELECTIONS ALL PROFORMAS DOWNLOAD

PARENT COMMITTE ELECTIONS GUIDELINES TELUGU

PC ELECTIONS NOTICE PDF

PC ELECTIONS INVITATION PROFORMA PDF

PC LECTIONS VOTER LIST PROFORMA PDF

Schedule of SMC Elections 2021-22 (PMC Elections)

  • Issue of Notification to Conduct of Elections to Parent Committee Members, Chairman & Vice Chairman : 6-09-2021 at 10.00 AM

  • Display of Voter List for Conduct of Elections to Parent Committee Members in the Notice Board of Primary/Upper Primary Classes/ High Schools : 16-09-2021 at 2.00 PM

  • Calling of Objections on Voter List and Redressal of Grievances if any 20-09-2021 (9.00 A M to 1.00 PM)

  • Finalization of Voter List for Conduct of Elections to Parent Committees and its display in the Notice Board of the Primary/Upper Primary Schools / High Schools :20-09-2021 (3-4 PM)

  • Conduct of Elections to Parent Committee Members, Finalisation of Elected Parent Committee Members & reconstitution of Parent Committees : 22-09-2021( 7AM – 1 PM)

  • Conduct of Election of Chairman & Vice Chairman by Parent Committee Members : 22-09-2021 (1.30 PM)

  • Oath taking by Parent Committee Members, Chairman & Vice Chairman Conducting First Parent Committee Meeting : 22-09-2021 (2 PM -3.30PM)

పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది. జిల్లాలోని 3,400 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 16న ప్రకటన విడుదల కానుండగా, 22న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈసారి కమిటీల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు అనేకమంది పోటీ పడే అవకాశం ఉంది.

1 నుంచి 8 వరకు చదివే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే వీలుంది. పిల్లలు వేర్వేరు తరగతులు వేర్వేరు పాఠశాలల్లో చదువుకుంటుంటే రెండు ఓట్లు వినియోగించుకోవచ్ఛు పిల్లలిద్దరూ ఒకే తరగతి అయితే మాత్రం ఒకే ఓటు.

ప్రధానోపాధ్యాయులే ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు. నోటిఫికేషన్‌ విడుదలైన రోజు మధ్యాహ్నం లోపు ఓటర్ల జాబితా ఆయా పాఠశాలల్లో అందుబాటులో ఉంచుతారు. ఎన్నికైన కమిటీ సభ్యుల నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. వీరిద్దరిలో ఒకరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారు, మరొకరు మహిళ ఉంటారు. ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులు

ప్రతి తరగతికి తల్లిదండ్రుల కమిటీలో ముగ్గురు సభ్యులను ఎన్నుకుంటారు. ఎన్నిక మూజువాణి విధానంలో నిర్వహిస్తారు. అవసరమైతే రహస్య బ్యాలెట్‌ పద్ధతిని అనుసరిస్తారు. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 15 మందిని, ప్రాథమికోన్నత పాఠశాలలో 1నుంచి 8వ తరగతి వరకు 24మంది, ఉన్నత పాఠశాలలో 6 నుంచి 8 వరకు తొమ్మిది మందిని సభ్యులుగా ఎన్నుకుంటారు. ఒక్కో కమిటీకి అదనంగా ఆరుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులను నియమిస్తారు.

వీరిలో పాఠశాల ఉపాధ్యాయుడు, పంచాయతీ వార్డు సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పోటీ సాధారణ ఎన్నికలను తలపించింది. ఈసారి కూడా ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.