childrens-day-special-November-14th

childrens-day-special-November-14th

Children’s Day 2023 : చాచాజీ పుట్టిన రోజు.. పిల్లలకు పండుగ రోజు బాలల దినోత్సవం

Children’s day Speech in Telugu : ప్రతి ఏడాది నవంబర్‌ 14 వచ్చిందంటే చాలు పిల్లలకు పండుగ దినం. దేశవ్యాప్తంగా నవంబర్‌ 14న Children’s day ఘనంగా నిర్వహిస్తారు.

Happy Children’s Day 2023 : దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం (Children’s Day)గా జరుపుకుంటున్నాం. ఈరోజు చాచా నెహ్రూ అని బాలలంతా ప్రేమగా పిలుచుకునే.. భారత దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు (Jawahar Lal Nehru Jayanti 2023). ఆయనకు పిల్లలంటే మహాఇష్టం. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని చాచా నెహ్రూ అనేవారు. రేపటి దేశ పురోగతికి నేటి బాలలే పాటుపడతారని ఆయన బలంగా నమ్మారు. ఈ సందర్భంగా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈరోజు పిల్లలకు ప్రత్యేకమైన రోజు. బాలల దినోత్సవం నాడు.. పాఠశాలలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. పిల్లలు వివిధ వేషధారణల దుస్తులు ధరించి, ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటారు. జవహర్‌లాల్ నెహ్రూ బోధనలు, వారసత్వాన్ని గుర్తు చేసుకుంటారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు.
ప్రపంచంలో చాలా దేశాలు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఆరు రోజుల ముందుగా నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే (Children’s Day) నిర్వహించుకుంటారు. అందుకు కారణం భారత దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం నవంబర్ 14న కావడం. దేశం కోసం ఎంతో సేవ చేసిన, ఎన్నో త్యాగాలు చేసిన జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడంలో ఒక విశేషం ఉంది.

నెహ్రూకి.. పిల్లలంటే అమితమైన ఇష్టం : ఇండిపెన్‌డెన్స్‌ రాక ముందు బ్రిటిష్ పాలనలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న భారతదేశాన్ని.. స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటి దేశ ప్రధానిగా పురోగమనం వైపు నడిపించడంలో ఆయన చూపించిన దార్శనికత, ఆయన ఉదాత్త భావాలు ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం. పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారిని దగ్గరకు తీసుకునే వారు. దీంతో పిల్లలంతా ఆయనను చాచా నెహ్రు అని పిలిచేవారు. ఆయనకు గులాబీ పువ్వులు అంటే ఎనలేని మక్కువ. దీంతో ఆయనకు గులాబీ పువ్వులను ఇచ్చి మరీ పిల్లలు ఆయన చుట్టూ చేరేవారు.

 children’s day speech  I Minute & 2 minutes for students CLICK HERE

దేశ స్వాతంత్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేసి, బ్రిటిష్ పాలకులు వెళ్లిపోయిన తరువాత భారతదేశ అభ్యున్నతికి ఎంతగానో సేవలందించిన పండిట్ నెహ్రూ 1964వ సంవత్సరంలో మరణించారు. ఆయన మరణించిన తరువాత ఆయనకు గౌరవంగా నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నేటి వరకు నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే (Children’s Day) జరుపుకుంటున్నాం. అంతకు ముందు భారత దేశంలో కూడా చిల్డ్రన్స్ డే నవంబర్ 20వ తేదీన జరుపుకునేవారు.

Children’s Day Wishes in Telugu :
  • నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి జాతి సంపదలు.. విరిసి విరియని కుసుమాలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
  • సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చు – పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.
  • తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు.. భావి భారత పౌరులు. వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పుదాం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
  • పాలబుగ్గల నవ్వులు, అపురూపమైన క్షణాలు.. మరపు రాని జ్ఞాపకాలు, బాల్యం ఒక వరం. బాలల దినోత్సవం ఒక సంబరం. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

This year, as Children’s Day falls on Tuesday, November 14, it provides an opportunity to share heartfelt wishes, messages, and images with friends and family. To assist in spreading joy on this occasion, here are some curated Children’s Day WhatsApp messages, wishes, status updates, and quotes:

  1. “The children of today will make the India of tomorrow. The way we bring them up will determine the future of the country.” – Pandit Jawaharlal Nehru.
  2. Children, as the most beautiful creation of God, spread joy and happiness in every season. Happy Children’s Day!
  3. “Only through right education can a better order of society be built up.” – Pandit Jawaharlal Nehru.
  4. Without children, the world would be devoid of sunshine, laughter, and love. Let’s protect, guide, and love them with all our might. Happy Children’s Day!
  5. Every child is a different kind of flower, and together, they make this world a beautiful garden. Happy Children’s Day.
  6. “Let us sacrifice our today so that our children can have a better tomorrow.” – APJ Abdul Kalam.
  7. The most precious thing in this world is a smile on a child’s face. Happy Children’s Day to every kid in the world.
  8. Let’s celebrate the innocence and purity of our kids. They are our future, and they deserve to feel precious in every way. Happy Children’s Day
  9. “Every child comes with the message that God is not yet discouraged of man.” – Rabindranath Tagore.

On this Children’s Day, let’s cherish the laughter, innocence, and limitless potential embodied by every child, making the world a brighter place for tomorrow.

www.apteachers360.com
error: Content is protected !!