chandrayan-3-tobe-launched-July-14th-countdown-start

chandrayan-3-tobe-launched-July-14th-countdown-start

Chandrayaan 3: మరికొన్ని గంటల్లో జాబిల్లి మీదికి.. చంద్రయాన్ 3 కౌంట్‌డౌన్

Launch of LVM3-M4/CHANDRAYAAN-3 Mission from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota

చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని 
ప్రత్యేక్షంగా చూడాలను కుంటున్నారా
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం 2 :35 గంటలకు 
LVM -3 /M4 రాకెట్ ద్వారా జరిగే చంద్రయాన్ – 3 ప్రయోగాన్ని ప్రత్యేక్షంగా చూడాలనుకుంటున్నారా ఐతే ఈ క్రింది లింకును సేవ్ చేసి పెట్టుకోండి ప్రయోగానికి 
30 నిమిషాల ముందు మొదలైయే  ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
లింక్ – 

Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనల్లో కీలక ముందడుగు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇస్రో.. చంద్రునిపైకి మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు చంద్రయాన్ 3 రాకెట్.. శుక్రవారం మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం కౌంట్‌డౌన్ ప్రారంభించింది. గతంలో చంద్రయాన్ -1, చంద్రయాన్ -2 ప్రయోగాలను చేపట్టిన ఇస్రో.. చంద్రుడిపై అన్వేషణకు బాటలు వేసింది. ప్రస్తుతం చేపట్టిన చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం అయితే.. జాబిల్లికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

Chandrayaan 3: చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ – 3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ చంద్రయాన్ – 3 ప్రయోగానికి సంబంధించి గురువారం కౌంట్‌డౌన్‌ను ఇస్రో ప్రారంభించింది. గురువారం మధ్యాహ్నం.. ఒంటి గంట 5 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. అది దాదాపు 25 గంటలపాటు కొనసాగనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ – షార్ నుంచి నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి లాంచ్ వెహికల్ మార్క్ – ఎల్‌వీఎం3 – ఎం4 రాకెట్‌ నింగిలోకి ప్రయాణించనుంది. ఈ చంద్రయాన్ – 3 ప్రయోగానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు, సౌకర్యాలను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఇక మరి కొన్ని గంటల్లోనే చంద్రయాన్ – 3 జాబిల్లి వైపు ప్రయాణించనుంది.

చంద్రయాన్ – 2 వైఫల్యాలను అధిగమించి ఇప్పుడు మరింత అధునాతన టెక్నాలజీతో చంద్రయాన్ – 3 ని ప్రయోగిస్తున్నారు. ఎల్‌వీఎం 3-ఎం4 భారీ వాహక నౌక ద్వారా చేపట్టనున్న ఈ చంద్రయాన్ – 3 ఉపగ్రహాన్ని ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో సిద్ధం చేశారు.

ఈ ఉపగ్రహం.. 3,84,000 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. జాబిల్లికి 100 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుకుంటుంది. ఆ తర్వాత చంద్రుని దక్షిణ ధ్రువంలో నిర్దేశించిన ప్రాంతంలో దిగుతుందని.. ఇస్రో వెల్లడించింది. అయితే ఈ చంద్రయాన్ – 3 లో ఆర్బిటర్‌ను పంపడం లేదని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఎందుకంటే.. చంద్రయాన్‌ – 2 లో ప్రయోగించిన ఆర్బిటర్‌.. ఇంకా చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోందని.. ఇప్పుడు అదే ఆర్బిటర్‌ను చంద్రయాన్ – 3 లో కూడా వాడనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే చంద్రయాన్‌ – 2 క్రాష్ ల్యాండింగ్ అయిన నేపథ్యంలో ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఇస్రో తెలిపింది. గతంలో జరిగిన వైఫల్యాన్ని పూర్తిగా విశ్లేషించి.. ఈసారి అలా జరగకుండా ఫెయిల్యూర్‌ బేస్డ్‌ డిజైన్‌ చంద్రయాన్‌ – 3 ని అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.

ఈ ల్యాండర్ జాబిల్లిపై దిగే సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించినా.. ఎలాంటి సమస్య లేకుండా విజయవంతంగా చంద్రుడిపై దిగేలా చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఈ సారి ల్యాండర్ దిగేందుకు గతం కన్నా మరింత విశాల ప్రదేశాన్ని గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్‌ – 3 లో ఇంధన పరిమాణాన్ని కూడా పెంచామని.. ఏదైనా సమస్య ఎదురైతే అది మరో చోటుకు చేరుకుని ల్యాండింగ్‌ చేసుకోగలదని పేర్కొన్నారు. భారత్ కంటే ముందు 4 దేశాలు జాబిల్లి ఉపరితలంపై తమ వాహక నౌకలను సురక్షితంగా దించాయి. అమెరికా, చైనా, రష్యా దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ ల్యాండర్లను ల్యాండ్‌ చేశాయి. అయితే ఈ జాబితాలే చేరేందుకు భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది.

ఈ చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడి మీదికి ఉపగ్రహాన్ని పంపించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. అయితే చంద్రయాన్ సిరీస్‌లో ఈ చంద్రయాన్ – 3 మూడో ప్రయోగం కావడం గమనార్హం. ఇప్పటివరకు చంద్రయాన్ -1, చంద్రయాన్ – 2 లను ఇస్రో ప్రయోగించింది. చంద్రుడి మీద దిగాలని.. అక్కడ పరిశోధనలు జరపాలని.. 2008 లోనే ఇస్రో అధికారులు చంద్రయాన్ – 1 ప్రయోగాన్ని చేపట్టారు. 2008 లో తొలి చంద్రయాన్ ప్రయోగమైన చంద్రయాన్ – 1 ను భారత్ పంపించింది. అయితే ఈ చంద్రయాన్ – 1 లో ల్యాండర్ లేకుండా కేవలం ఆర్బిటర్, ఇంపాక్టర్‌ను మాత్రమే జాబిల్లి పైకి పంపించింది.