nmms-2023-selected-students-online-application-nsp-link

nmms-2023-selected-students-online-application-nsp-link
2023 ఫిబ్రవరిలో NMMS కు సెలెక్ట్ అయిన విద్యార్థులు తమ వివరాలను స్కాలర్షిప్ పోర్టల్ నందు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ 31-12-2023 వరకు పొడిగింపు
పత్రికా ప్రకటన
ఫిబ్రవరి 2023 లో జరిగిన నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు తమ వివరములు నమోదు చేసుకొనుటకు మరొక అవకాశంగా 31-12-2023 వరకు పొడిగించినారు.*
విద్యార్థి వివరములు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ కార్డ్ పైన ముద్రించిన విధంగానే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లో ఉండేవిధంగా సరిచూసుకుని పోర్టల్ నందు తమ వివరములు ది. 31-12-2023 లోపు నమోదు చేసుకొనవలెను.*
విద్యార్ధి వివరములను సంబంధిత స్కూల్ నోడల్ ఆఫీసర్ లెవెల్ లో ది.15-01-2024 లోపు క్షుణ్ణం గా పరిశీలించి, స్కూల్ నోడల్ ఆఫీసర్ లాగిన్ (INO) ద్వారా ధృవీకరించవలెను.
ఈ సంవత్సరం ప్రతి DNO (District Nodal Officer) మరియు INO (Institute Nodal Officer) & HOI (Head of Institution) ఖచ్చితంగా Biometric Authentication  చేయించుకోవాలని రూల్ పెట్టడం  వల్ల మైనారిటీ స్కీమ్ కొరకు Biometric Authentication చేయించుకున్న పాఠశాలల వారు కాక మిగిలిన పాఠశాలల వారు తప్పకుండా Biometric Authentication చేయించుకొనవలెను

NMMS కు ఎoపుకైన విద్యార్ధుల స్కాలర్‌షిప్ ను ఆన్లైన్ చేయుటలో అనేక సమస్యలు వాటి పరిష్కారాలు తెలుగు లో 

CLICK HERE FOR MORE DETAILS
NMMS స్కాలర్షిప్ పొందిన ఫిబ్రవరి 2023 (ఫ్రెష్) మార్చి 2022 & 2018, 2019, 2021(రెన్యువల్)  విద్యార్థులు తమ వివరాలు NSP పోర్టల్ నందు 30-11-2023 లోపు నమోదు / రెన్యువల్ చేసుకొని, పాఠశాల కాలేజీ నోడల్ ఆఫీసర్ ద్వారా వెరిఫై చేయించుకుని, జిల్లా నోడల్ ఆఫీసర్ కి సంబంధిత పత్రములు పంపించి వెరిఫై చేయించుకొనవలెనని, లేని యెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదని తాజా ప్రెస్ నోట్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వ పరీక్ష సంచాలకులు

NMMS – 2022 Merit List – Final

AP NMMS 2021 Merit List – Final

AP_NMMS_2020_MeritList_Final

AP_NMMS_2019_MeritList_Final

Press Note – N.S Portal for NMMS 2022 Selected Students

NATIONAL SCHOLARSHIPS PORTAL OFFICIAL WEBSITE

ఫిబ్రవరి 2021 , నవంబరు 2019 , 2018, 2022 సంవత్సరములలో ఎంపిక ప్రభుత్వ పాఠశాలలో / కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను. లేనియెడల స్కాలర్షిప్ మంజూరు కాబడదు*

 కావున ఎంపిక అయిన ప్రతీ విద్యార్ధి ఎట్టి పరిస్థితులలోనూ పోర్టల్ నందు తమ వివరములను నమోదు చేసుకొని స్కాలర్షిప్ పొందగలరు
www.apteachers360.com
పూర్తి వివరములు కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో సంప్రదించగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.

www.apteachers360.com
error: Content is protected !!