Today-school-assembly-news-01-04-2023

 Today-school-assembly-news-01-04-2023

నేటి వార్తలు (01-04-2023) తెలుగులో pdf

Today News (01-04-2023) in English pdf

School Assembly*

*01-04-2023*

   
*_👭నేటి 𝐀𝐏 – పాఠశాల అసెంబ్లీ👬_*
❍─━━━━━━━❐━━━━━━━─❍  
               
          *🗓️𝐒𝐀𝐓𝐔𝐑 𝐃𝐀𝐘*
          *🗒️𝟎𝟏 – 𝟎𝟒 – 𝟐𝟎𝟐𝟑*
❍─━━━━━━━❐━━━━━━━─❍           
    
       *✍🏻నేటి వార్తలు📜*
━━━━━━━━━━━━━━━━━━━━
*🧑🏻‍💻నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
*👩🏻‍🏫నేటి ప్రాముఖ్యత:-*
┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅
*_➢1935 ఏప్రిల్ 1వ తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థాపించబడింది._*
*_➢ఒడిశా రాష్ట్రఅవతరణ దినోత్సవం._*
*_➢విద్యా హక్కు చట్టం – 2009(RTE-2009) ఏప్రిల్,1 అమలులోకివచ్చిన రోజు._*
*_➢ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల వైద్యశాస్త్రవేత్త, రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న విలియం హార్వే జయంతి_*
*🧑🏻‍💻అంతర్జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_➠నాసా ” మూన్ టు మార్స్” హెడ్ గా భారత సంతతికి చెందిన రోబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ నియమితులయ్యారు._*
*_➠సినీ నటికీ రహస్యంగా డబ్బు లు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చు కున్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనేరాభియోగాల నమోదుకు మన్ హటన్ గ్రాండ్ జ్యూరీ నిన్న అనుమతించింది._*
*_➠అమెరికా విదేశాంగ శాఖలో శక్తివంతమైన డిప్యూ టీసెక్రటరీ(నిర్వహణ, వనరులు) పదవికి ప్రస్తుత న్యా యవాది, దౌత్యవేత్త రిచర్డ్ వర్మ నామినేషన్ ను సెనేట్ ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అందిన ఏకైక నామినేషన్ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా దే కావడంతో తదుపరిఅధ్యక్షుడిగా ఆయన నియమితులు కానున్నారు._*
*🧑🏻‍💻జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_➨ఇండోర్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 36 కి చేరింది._*
*_➨భారత ఎగుమతుల్ని 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించారు. నేటి నుండి ఈ విధానం అమలులోకి రానుంది._*
*_➨వాహన కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో B.S-6.2 ప్రమాణాలతో కూడిన వాహనాలు నేటి నుండి అందుబాటులోకి రానున్నాయి._*
*_➨ప్రపంచంలోని 10 అత్యుత్తమ నేత్ర పరిశోధన సంస్థల్లో హైద్రాబాద్ చెందిన L.V. ప్రసాద్ నేత్ర వైద్య, విజ్ఞాన సంస్థ 8 వ స్థానంలో నిలిచింది._*
*_➨ఈరోజు 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది._*
*_➨ప్రధాని మోదీ సర్టిఫికేట్లు అడిగినందుకు ఢిల్లీ సీయం అరవింద్ కేజ్రీవాల్ కు రూ.25,000 ఫైన్ విధించిన గుజరాత్ హై కోర్ట్._*
*_➨అండమాన్ నికోబార్ దీవులలో నిన్న రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది_.*
*🧑🏻‍💻రాష్ట్ర వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_➯మే20 నాటికి భూ సర్వే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు._*
*_➯నేటి నుంచి ఇంటర్ ప్రశ్న పత్రాల మూల్యంకానం_*
*_➯ఏప్రిల్ 3వ.తేదీ నుంచి ఒంటి పూట బడులు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ సంఘాల నాయకులతో అన్నారు._*
*_➯ఏప్రిల్ 20వ.తేది నుంచి 28వరకు SA-2 మరియు CBA పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది_*
      *🏏క్రీడా వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_➤IPL తొలి మ్యాచ్ లో చెన్నైపై నెగ్గిన గుజరాత్ టైటాన్స్._*
*_➤న్యూ జిలాండ్ శ్రీలంక జట్ల మధ్య 3 వన్డే క్రికెట్ మ్యాచ్  సిరీస్ లో భాగంగా నిన్న వెల్లింగ్టన్ లో జరిగిన చివరివన్డేలో న్యూ జిలాండ్ 6 వికెట్లతేడాతో విజయం సాధించి 2-0తో సిరీస్ ను గెలుచుకుంది._*
*⛈️🌥️వాతావరణ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_❐ఏప్రిల్ రెండోవారంలో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటే  అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది._*
*ఇంతటితో వార్తలు సమాస్తం….🙏🏻*
              *✍🏻నేటి సూక్తి*
──━━━━━━━━━━━━━━━──
*_❍”మాట ఇవ్వటం ముఖ్యం కాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడం ముఖ్యం”_*
     *🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
──━━━━━━━━━━━━━━━──
*_❈క్యాన్సర్లను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది_*
       *📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
──━━━━━━━━━━━━━━━──
*_Q) భూకంపాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?_*
_A: సిస్మోలజీ_
             *📕నేటి జీకే ప్రశ్న❓*
──━━━━━━━━━━━━━━━──
 *_Q) హరికథ పితామహుడు అని ఎవరికి బిరుదు?

                *🔥Today News*

> *Women and Child Development Ministry says MGNREGS workers will build almost 75% of anganwadis in 2023*

> *India registers highest proportional increase of new COVID-19 cases in Southeast Asia: WHO*

> *China poses challenge to rules-based order in Indo-Pacific: German envoy*

> *Gujarat High Court sets aside CIC order seeking information on PM Modi’s M.A. degree, fines Arvind Kejriwal*

> *IIT-Bombay Dalit student death – Mumbai Police register FIR for abetment to suicide*

> *MoP increases rake availability for coal supply to TS-Genco in summer*

> *Telangana: Power utilities’ employees plan strike from April 17*

> *Andhra Pradesh: All arrangements in place for SSC examination*

> *Andhra Pradesh: Police should focus on technology and training, says Visakhapatnam range DIG S. Harikrishna*

> *NEET UG 2023: NTA issues important information for OCI candidates;*

> *Under NEP, study materials till Class 5th will be provided in 22 Indian languages: Pradhan*

> *Isolated rains forecast in Telangana for four days starting tomorrow*

> *World Test Championship final – India have firepower in pace department to trouble Australia, says Ross Taylor*

             *🌻Proverb/ Motivation*

*Accept your past without regret, handle your present with confidence 
And face your future without fear.*

              *💎నేటి ఆణిముత్యం💎*

*టిప్పణములు చేసి చప్పని మాటలు*
*చెప్పుచుందురన్ని స్మృతులు శ్రుతులు*
*విప్పి చెప్పరేల వేదాంతసారంబు?*
*విశ్వదాభిరామ వినురవేమ!*

తాత్పర్యము: *తమ పాండిత్యాన్ని తెలియచెప్పడానికి మూర్ఖులు వేదాలని, ధర్మ శాస్త్రాలని, వ్యాఖ్యలని వివరిస్తారు కాని వీటి యోక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో మాత్రం చెప్పలేరు. వీరి గొప్పతనమంత పదాల గారడీ తప్ప పాండిత్యం శూన్యం.*

                 *🌷Today’s GK*

Q: *Which of the ministry monitered the functions of the National River Conservation Directorate ?*

A: *Environment and Forests Ministry*

CBA-3-S.A-2-exams-2023-schedule-time-table-blue-print

 CBA-3-S.A-2-exams-2023-schedule-time-table-blue-print

SA2 CBA3 EXAM SCHEDULE FROM 20.04.2023 TO 29.04.2023 PROCEEDINGS ISSUED BY CSE,AP

SA 2Exams info:*

*అన్ని క్లాసులకు ఉదయమే పరీక్షలు*


SA2 పరీక్షలు From 1st class To IX class  Apr 20 నుండి 28 వరకు ఉదయం 8 am to 11 am (For IX from 8 am to 11.15 am)  అన్ని మేనేజ్ మెంట్లు నిర్వహించాలి  -CSE Revised orders.

CBA-3/S.A-2 EXAMS REVISED TIME TABLE PDF

సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 (తరగతి గది ఆధారత మదింపు -3) ఏప్రిల్ 20 తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించుటకు ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్

సమ్మేటివ్ 2 / CBA 3 పరీక్షలు ఏప్రిల్ 2023 అఫిషియల్ టైమ్ టేబుల్, బ్లూ ప్రింట్స్ విడుదల*

CBA3/ SA2 2022-23 SCHEDULE FOR CLASSES I TO IX

SA2 TIMETABLE*
*PRIMARY*
*20.4.2023 –  TELUGU*
*24.4.2023 –  ENGLISH*
*25.4.2023 – MATHS*
*26.4.2023 – EVS*
*VI to IX Classes*.
*20.4.23. First language.*
*24.4.23 Second Language*.
*25.4.23. English*.
*26.4.23. Maths.*
*27.4.23. Gen Science*.
*28.4.23 Social* .
Download SA 2 / CBA 3 Time Table, Blue Print 2022-23 from Class 1 to Class 10
All Regional Joint Directors of School Education and District Educational Officers in the state are informed that it has been decided to


conduct the 3rd classroom-based assessment/ Summative Assessment 2 in the academic year 2022-23, from 20.04.2023, across the state. Classroom-based assessments 1 and 2 have been completed in the academic year 2022-23, and the results are being analysed for further remedial action. As decided earlier, the third classroom-based assessment is being conducted as per the blueprint, and the MUA balance is being maintained as specified in the annexure.
To familiarize class IX students with the SSC exam pattern, it has been decided to conduct the Summative Assessment 2 in the SSC public exam model, with a 100 marks scheme, and in a 6-paper system. All the DCEBs are requested to instruct the teachers to post the marks for class IX students by reducing them to 80 marks in the SA2 marks entry registers and web portal. The schedule and blueprint are annexed herewith.”
Blueprint Creation
1. Type of questions:
a. Multiple-Choice Questions (MCQs)
b. Free Response Questions (FRs)
Distribution of MCQs and FRs:
All the questions for classes 1-3 will be read aloud by the teachers.
In Class 4 and 5, language papers, one passage will be read aloud by the teachers.
Grade 6 Hindi paper will have 20 MCQs and 10 FRs to lower the difculty level of the paper.
                                Difference between CBA11, CBA12 and CBA13
 Overall, the blueprint of CBA-1 and CBA-2 remained the same in terms of the type and number of questions assessed in each class. However, since the CBA-3 is a summative assessment the number of questions was increased in higher grades. Based on the evaluation of past summative papers, with the lower grades, the number of questions was not changed significantly.
In consideration of the feedback received during CBA-1 and CBA-2, it was decided to simplify the paper by including more straightforward questions.

List-of-holidays-in-April-2023

 List-of-holidays-in-April-2023

*ఏఫ్రిల్ నెల పనిదినాలు* 2023 

ఏప్రిల్-01- పనిదినం


02-ఆదివారం.*

03-04-పనిదినాలు.

*05-బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి.సెలవు*

06-పనిదినం.

*07-గుడ్ ఫ్రైడే*

*08-రెండవ శనివారం.*(ఫుల్ డే స్కూల్ ఉంటే)

*09-ఆదివారం*

10-13 వరకు పనిదినాలు.

*14-డా”బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి.సెలవు*.

15-శనివారం పనిదినం.

*16-అదివారం*

17-21-పనిదినాలు.

*22-శనివారం (రంజాన్)(సెలవు మారవచ్చు)*

*23-ఆదివారం.*

24-29-పనిదినాలు.

*30-ఆదివారం*.

*ఏప్రిల్ 29-Last working Day*

GATE-2023-score-cards-download-link

 GATE-2023-score-cards-download-link

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల స్కోరు కార్డులను మార్చి 21న విడుదల చేసింది. స్కోరుకార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. 

GATE-2023 SCORE CARDS DOWNLOAD LINK

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి.

కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.

Kendriya-Vidyalaya-Sanghatan-KVS-admissions-2023-24-notification

 Kendriya-Vidyalaya-Sanghatan-KVS-admissions-2023-24-notification

దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఈ మేరకు మార్చి 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగియనుంది. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకటోతరగతిలో ప్రవేశాలకు విద్యార్థులకు 31.03.2023 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 

తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు  నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు.

ముఖ్యమైన తేదీలు…

షెడ్యూలు వెల్లడి: 21.03.2023

నోటిఫికేషన్ వెల్లడి: 25.03.2023.

* క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.03.2023. (ఉ.10.00 గం. నుంచి)

➥ క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 17.04.2023. (సా. 7.00 గం. వరకు)

➥ ఎంపిక జాబితా వెల్లడి: 20.03.2023 (లిస్ట్-1), 28.03.2023 (లిస్ట్-2), 04.05.2023 (లిస్ట్-3).

➥ సెకండ్ నోటిఫికేషన్ (ఎక్స్‌టెండెడ్ తేదీ): 

నోటిఫికేషన్-2 (ఎక్స్‌టెండెడ్): 03.05.2023.

➥ రిజిస్ట్రేషన్: 04.05.2023 – 11.05.2023.

➥ ఎంపికజాబితా వెల్లడి: 18.05.2023 – 25.05.2023.

* క్లాస్-2, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం (క్లాస్-11 మినహాయించి): 03.04.2023 – 12.04.2023. 

➥ ఎంపిక జాబితా వెల్లడి: 17.04.2023.

➥ ప్రవేశాలు: 18.04.2023 – 29.04.2023.

➥ ప్రవేశాలు పొందడానికి చివరితేది: 30.06.2023.

KVS Admission Guidelines PDF

KVS Admission Schedule PDF

KVS OFFICIAL Website

➥ క్లాస్-11 (కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి.

➥ కేవీ క్లాస్-11 ఎంపిక జాబితా: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 20 రోజుల తర్వాత నుంచి.

➥క్లాస్-11 (నాన్-కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్, ఎంపిక జాబితా, ప్రవేశాలు: కేవీ విద్యార్థులు ప్రవేశ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇతర విద్యార్థులకు ప్రవేశాలకు కల్పిస్తారు.

➥ క్లాస్-11లో ప్రవేశాలు పొందడానికి చివరితేది: పదోతరగతి ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 30 రోజుల వరకు.  

KVS Admission Guidelines PDF

KVS Admission Schedule PDF

KVS OFFICIAL Website

how-to-link-aadhar-card-and-pan-card-direct-link

how-to-link-aadhar-card-and-pan-card-direct-link

Aadhar and Pan Card Link మార్చి 31 వరకే డెడ్‌లైన్.. వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా…

Aadhar and Pan Card Link మరికొద్ది రోజుల్లో ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్ లింక్ గడువు తేదీ ముగియబోతోంది. మార్చి 31వ తేదీ సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులు రెండింటినీ తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడతాయని.. ఆదాయ పన్ను(Income Tax) సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.


మన దేశంలో అస్సాం, జమ్మూ, కాశ్మీర్, మేఘాలయ వంటి రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పాన్, ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలని, అన్ లింక్ చేయబడిన ఖాతాలన్నీ నిలిపేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రెండింటిని లింక్ చేసుకోండి. ఈ సందర్భంగా ఆధార్‌కార్డుకు పాన్‌కార్డును ఎలా లింక్ చేయాలి.. ఆన్‌లైనుతో పాటు SMS ద్వారా క్షణాల్లో ఎలా లింకు చేయాలనే పూర్తి వివరాలను స్టెప్ బై స్టెప్ ఇప్పుడే చూసెయ్యండి…
ఈ రెండు కార్డులను లింక్ చేయడానికి రూ.1000 వెయ్యి రూపాయలు చెల్లించాలని గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా అధికారిక వెబ్‌సైటులోనే చేయాలి లేదా SMS ద్వారా కూడా చేయొచ్చు.

LINK PAN TO AADHAR CLICK HERE

ఫోన్ ద్వారా ఎలా చేయాలంటే..
ముందుగా మీరు రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ నుంచి 567678కి లేదా 56161 నెంబర్లకు ఇలా మెసెజ్ సెండ్ చేయాలి.

* మీ ఫోనులో UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చిన తర్వాత మీ 12 అంకెలుండే ఆధార్ నెంబర్ టైప్ చేసి.. స్పేస్ ఇచ్చి.. తర్వాత 10 అంకెలుండే పాన్‌కార్డు నంబర్ టైప్ చేయాలి.
* ఈ వివరాలన్నీ టైప్ చేసిన తర్వాత 567678కి లేదా 56161 రెండింట్లో ఏదో ఒక నెంబర్‌కు సెండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆధార్‌కార్డుకు పాన్ కార్డు లింక్ అవుతుంది.

ఉదాహరణకు మీ ఆధార్ నంబర్ 012345678901, పాన్ నెంబర్ ABCDE1234A అయితే..

UIDPAN 012345678901 ABCDE1234A
అని టైప్ చేసి పైన తెలిపిన రెండు నెంబర్లలో ఏదో ఒక దానికి సెండ్ చేయాలి.

గమనిక : ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానం కోసం ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆధార్, పాన్ కార్డులో రెండింట్లోనూ ఒకటే పేరు ఉండాలి. ఆ వివరాలు మ్యాచ్ అయితేనే మీ కార్డులు లింక్ అవుతాయి. ఈ రెండింట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వివరాలు ఏ మాత్రం తేడాగా ఉన్నా తిరస్కరించబడుతుంది. కాబట్టి ముందుగా ఈ వివరాలన్నీ సరిచూసుకుని లింక్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి.


ఆన్‌లైనులోనూ అత్యంత సులభంగా..
మీ అరచేతిలో ఉండే ఫోనులో లేదా సిస్టమ్ నుంచి కూడా ఆధార్, పాన్‌కార్డులను సులభంగా లింక్ చేసుకోవచ్చు.

* ముందుగా https://www.incometax.gov.in/ వెబ్‌సైటులోకి వెళ్లాలి.
* హోమ్ పేజీలో ఎడమ వైపున ఉండే లింక్ ఆధార్ ఆప్షన్ ‌పై క్లిక్ చేయండి.
* మీ దగ్గర ఉండే పది అంకెల పాన్ నెంబరును అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. అనంతరం ఇతర వివరాలు పూర్తి చేసి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీ పాన్ ఐడి నెంబర్, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాలి.
* లాగిన్ పేజీ ఓపెన్ అయ్యాక ఆధార్ లింకు కోసం మరో కొత్త విండో పేజీ ఓపెన్ అవుతుంది.
* అక్కడ పాన్‌కార్డులో ఉండే పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఆధార్, పాన్ కార్డులో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
* అన్ని కరెక్టుగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక లింక్ బటన్‌పై క్లిక్ చేయండి.


* ఆ తర్వాత పేమెంట్ కోసం మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆదాయ వివరాలను నమోదు చేయాలి. మీరు ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోతే రూ.1000 వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీకు పాన్‌కార్డుకు ఆధార్ విజయవంతంగా లింక్ అయ్యిందనే వివరాలు కనిపిస్తాయి.

maintenance-of-tabs-issued-to-students-teachers-ap-schools

 maintenance-of-tabs-issued-to-students-teachers-ap-schools

Maintenance a nice of Tabs issued to VIII Class students and teachers handling class VIII for the year 2022-23

Tabs ను Teachers, Students వాడుకునేటప్పుడు, అవి చెడిపోతే పాఠశాల లేదా విద్యార్ధి నివసించే పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయములోని వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ అసిస్టెంట్(WES)/ వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ(WES) వారికి ఇచ్చి Samsung కంపెనీ వారీ ద్వారా Repairs, Replacement ఎలా చేయించుకోవాలో తెలియజేస్తూ ఆం.ప్ర ప్రభుత్వము GO.Ms.No.29 ను విడుదల చేయడము జరిగినది.

FOR MORE DETAILS CLICK HERE

Fancy-number-for-mobile-free-of-cost

Fancy-number-for-mobile-free-of-cost

ప్రస్తుత సమాజంలో చాలా మంది సామాన్యులు కూడా వీఐపీలా లేదా ప్రత్యేకమైన వ్యక్తిలా గుర్తింపు పొందేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఖరీదైన దుస్తులు, వాచీలు వంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.

మరికొందరు తమ ప్రవర్తనతో ఆ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. ఇంకొందరు అయితే ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల ద్వారా వీఐపీగా గుర్తింపు పొందుతారు. అయితే ఇలాంటి వారి కోసమే వోడాఫోన్ ఐడియా ఒక శుభవార్త చెప్పింది. ఎటువంటి ఖర్చులేకుండా కూడా ఫ్యాన్సీ ఫోన్ నంబర్ సులువుగా దొరుకుతుంది.

 గతంలో అయితే ఈ ఫ్యాన్సీ లేదా వీఐపీ నంబర్ల కోసం వేలంపాటలు జరిగేవి కానీ ఇప్పుడు అలా ఏమిలేదు. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా (VI) తన వినియోగదారుల కోసం VIP నంబర్లని అందిస్తుంది.

అయితే ఇందుకోసం మీరు కొన్ని ప్రాథమిక ప్రక్రియలను తెలుసుకోవాలి. ఇది తెలిసిన వారికి ఫ్యాన్సీ సిమ్ నంబర్ ఉచితంగా లభిస్తుంది. కోరుకున్న ఫోన్ నంబర్‌ను పొందడానికి వేల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా వోడాఫోన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 

కొత్త కనెక్షన్, ఆపై ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ పిన్ కోడ్, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఉచిత ప్రీమియం మొబైల్ నంబర్‌ల జాబితా నుంచి ఒక నంబర్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియ తర్వాత మొబైల్‌ నెంబర్‌కి OTP వస్తుంది. అంతే కొత్త కనెక్షన్‌తో VIP నంబర్‌ వస్తుంది. ప్రస్తుతం వోడాఫోన్-ఐడియా ఈ అవకాశాన్ని అందిస్తోంది. ఈ విధంగా వోడాఫోన్ ఐడియా సంస్థ తన కస్టమర్లకు ఉచితంగా వీఐపీ నంబర్లను అందజేస్తోంది. దీని కోసం మీ నుంచి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయదు. మీరు ఇలా ఇంటి నుంచే ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌ను కూడా పొందవచ్చు.

how-to-apply-driving-license-in-online-service

 

how-to-apply-driving-license-in-online-service

ఇండియాలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదైనా వాహ‌నం డ్రైవ్ చేస్తూ బ‌య‌ట‌కు రావాలంటే.. డ్రైవింగ్‌ లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే.. ఇది మీరు ఒక వాహనాన్ని రోడ్ల‌పై నడపడానికి చట్టబద్ధంగా మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి చాలా మంది తిప్ప‌లు ప‌డుతుంటారు.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసే ప్ర‌క్రియ తెలియ‌క కార్యాల‌యాల చుట్టు తిరుగుతూ తంటాలు ప‌డుతుంటారు. కొన్ని సుల‌భ‌మైన స్టెప్స్ ఫాలో అయితే ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండానే ల‌ర్నింగ్ లైసెన్స్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మీరు ఇంటిని వదిలి బ‌య‌టికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ మేము వివరిస్తాము.

మీరు లెర్నర్స్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, మీ లైసెన్స్ పొందడానికి మాత్రం మీరు ఆఫ్‌లైన్‌లో ప్రాసెస్ చేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

అలాగే, కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండటం మరియు ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మీ వయస్సు మరియు ఇతర అవసరాలను అందించడానికి మీరు చెల్లుబాటు అయ్యే పత్రాలను కూడా కలిగి ఉండాలి. ఇండియ‌లో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి.

ఆన్‌లైన్‌లో Driving License అప్లై చేయ‌డం ఎలా! 

  • ముందుగా ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్ (https://parivahan.gov.in/parivahan/) లోకి వెళ్లాలి.
  • వెబ్‌సైట్ ఓపెన్ అయిన త‌ర్వాత ఆన్‌లైన్ స‌ర్వీసెస్ సెక్ష‌న్ ఓపెన్ చేసి అందులో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవ‌ల‌ను ఎంపిక చేసుకోవాలి.
  • ఆ త‌ర్వాత మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారో ఎంపిక చేసుకోవాలి.
  • ఇప్పుడు లెర్న‌ర్ లైసెన్స్ అప్లికేష‌న్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • అనంత‌రం అక్క‌డ పేర్కొన్న గైడ్‌లైన్స్ అన్ని పూర్తిగా చ‌దివి మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.
  • ఆ త‌ర్వాత మీ ఆధార్ మ‌రియు మొబైల్ నంబ‌ర్ ల‌ను న‌మోదు చేయాలి.
  • ఇలా లెర్న‌ర్ లైసెన్స్ అప్లికేష‌న్ ఫారం పూర్తి చేసిన త‌ర్వాత అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాలి.
  • ఇక చివ‌ర‌గా మీ డ్రైవింగ్ టెస్ట్‌కి ఎప్పుడు వెళ్లాల‌నుకుంటున్నారో డేట్ ఎంపిక చేసుకుని పేమెంట్‌ను పూర్తి చేయాలి.
  • ఈ ప్ర‌క్రియ పూర్తి చేసిన‌ట్ల‌యితే.. రు లెర్నింగ్ లైసెన్స్ ఆన్‌లైన్ ప్ర‌క్రియ అయిపోయింద‌ని నిర్దారించుకోవాలి.
  • ఈ స్టెప్స్ ఫాలో అవ‌డం ద్వారా మీరు లెర్నర్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి RTO వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. ముఖ్యంగా, యూపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో మీరు RTOను సందర్శించకుండానే లెర్నర్ లైసెన్స్ పొందవచ్చు మరియు పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయ‌వ‌చ్చు.

ap-house-tax-property-tax-link-for-all-municipalities

 ap-house-tax-property-tax-link-for-all-municipalities
ap-municipality-municipal-corporation-property-house-tax-online-payment
A citizen is allowed to pay property/house tax online through AP CDMA web portal. Let us see that how to pay online.
you can select DISTRICT, MUNICIPALITY, AND CATEGERY then submit button.
ఇంటి నుండి సులువుగా పే చేయవచ్చు. ఇంటి పన్ను, వాటర్ పన్ను,

PROPERTY TAX CALUCULATOR (TO KNOW THE TAX TO BE LEVIED)


Property Tax Auto Caluclator

Tax Rates and Traiffs

ఈ క్రింది టాక్స్ లు ఆన్లైన్ లో పే చేయవచ్చు.

Property Tax

Water Charges

Trade License Fee

Sewerage Charges

Leases & Agreements Fee

Property Mutation Fee

Advertisement Tax

PROPERTY/HOUSE TAX OFFICIAL WEBSITE 

error: Content is protected !!