world-ozone-day-september-16th-2023

 world-ozone-day-september-16th-2023

Ozone Day: ‘ఓజోన్‌’తోనే మానవజాతికి జీవం.. పదిలంగా కాపాడుకుందాం
World Ozone Day: : నేడు ఓజోన్ డే… ఇదీ చరిత్ర

ఈ రోజుల్లో మనం తీసుకునే ప్రతీ నిర్ణయమూ ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. భూతాపం పెరిగినా, వానలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం ఎక్కువైనా… ఇలాంటి అనర్థాలన్నీ ఓజోన్ పొరను దెబ్బతీసేవే. పాలపై మీగడలా… ఈ ఓజోన్ అనే వాయువు… భూమి చుట్టూ ఓ పొరలా అల్లుకొని ఉంది. ఇది భూమి నుంచీ స్ట్రాటో ఆవరణంలో… 15 నుంచీ 50 కిలోమీటర్ల మందంలో విస్తరించి ఉంది. సూర్యుడి నుంచీ వచ్చే అతి నీలలోహిత కిరణాలు డైరెక్టుగా భూమిపై పడనివ్వకుండా… ఓజోన్ పొర అడ్డుకుంటోంది. ఫలితంగా భగభగ మండే కిరణాలు మనపై పడకుండా ఉంటున్నాయి. ఆ పొరే గనక లేకపోతే… ఆ కిరణాలు డైరెక్టుగా భూమిపై పడి… మొత్తం ప్రాణికోటి చనిపోయేదే. సమస్యేంటంటే… పెరుగుతున్న భూతాపం వల్ల నానాటికీ ఓజోన్ వాయువు తగ్గిపోతోంది.

1980లో మొదటిసారి ఓజోన్ పొరకు కన్నం పడిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల భూమిపై డైరెక్టుగా సూర్యకిరణాలు పడిపోతున్న విషయం బయటపడింది. ఇలాగే పొర విచ్ఛిన్నం అవుతూ పోతే… కోట్ల మంది ప్రజలు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటిపైనా వ్యతిరేక ప్రభావం పడుతుంది. చర్మంపై తీవ్రమైన సూర్యకిరణాలు పడి… కేన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు… పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

ఓజోన్ కోసం సెప్టెంబర్ 16 : ఓజోన్ అంటే ఏంటో, దాన్ని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం కోసం ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం జరుపుతున్నారు. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న స్ప్రేలు, పొలాల్లో చల్లుతున్న ఎరువులు, క్రిమి సంహారాలు, ఫ్రిజ్‌లు, కార్లపై వేస్తున్న కలర్స్, క్లోరో ఫ్లోరో కార్బన్ల వంటి వాటి వాడకాన్ని ఆపేయాలని 1987లోనే నిర్ణయం తీసుకున్నా… ఇప్పటికీ అది అమలవ్వట్లేదు. ఫలితంగా ఓజోన్ పొర దెబ్బతింటూనే ఉంది.

ఓజోన్ కోసం ఏం చెయ్యాలి :

1.క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా చెయ్యాలి.

2. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలూ చేపట్టాలి.

3. మొక్కలు, చెట్లూ పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి.

4. పర్యావరణాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం బలమైన చట్టాలు తేవాలి.

5. అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాళ్లూ నిర్మించేటప్పుడే… 33 శాతం మొక్కలు, చెట్లు పెంచేందుకు ప్లేస్ ఉండేలా నిబంధనలు తేవాలి


6. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచడం ద్వారా… భూతాపాన్ని తగ్గిస్తూ… ఓజోన్ పొరను కాపాడేందుకు వీలవుతుంది.

సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే కవచం ఓజోన్ పొర. మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువైన ఓజోన్(O3) వాయు రూపంలో, లేత నీలం రంగులో ఉంటోంది. జీవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి భూమికి రక్షణ కల్పిస్తూ వస్తున్న ఈ పొరకు ఇప్పుడు మనమే తూట్లు పొడస్తున్నాం. అడవులను నరికేయడం, కాలుష్యం పెరగడం వల్ల ఓజోన్ వాయువు రోజు రోజుకు తగ్గిపోతోంది. దీని వల్లనే భూతాపం పెరగడం, వానలు కురవకపోవడం వంటి అనర్థాలను ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం.

అయితే ఓజోన్ పొర క్షీణిస్తోందని సరిగ్గా 39ఏళ్ల క్రితం 1982లో పర్యావరణ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో భవిష్యత్‌లో జీవకోటికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్ సంరక్షణ కోసం ప్రపంచదేశాలను ఏకం చేసింది. ఆ తరువాత 1987, సెప్టెంబర్ 16న ఓజోన్ సంరక్షణ రోజు రోజుగా ఖరారు చేసింది. ఆపై ప్రతి సంవత్సరం ఈ రోజున ఒక్కో నినాదంతో ప్రచారం చేస్తూ ఓజోన్ పొరపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ‘32 ఇయర్స్ అండ్ హీలింగ్’(గాయం మానుతోంది) అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

పుంజుకుంటోన్న ఓజోన్..? కాగా 2018లో ఓ సంస్థ చేసిన స్టడీలో.. 2000 సంవత్సరం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఓజోన్‌ 1 నుంచి 3 శాతం మేర తిరిగి పుంజుకుంటోందని తేలింది. అంతేకాకుండా కొన్ని చర్యలు తీసుకుంటే 2030లో ఉత్తర ధ్రువంలో.. 2050కు దక్షిణ ధ్రువంలో.. 2060కు పోలార్ ప్రాంతాల్లో పూర్తిగా ఓజోన్‌ను రక్షించుకునే అవకాశం ఉందని ఆ స్టడీ తెలిపింది.

ఓజోన్ దెబ్బ తింటే కలిగే నష్టాలు ఓజోన్ దెబ్బ తినడం వలన కేవలం మనుషులకే కాదు భూమి మీద నివసిస్తున్న జంతువులు, పక్షులు, చెట్లు అన్నింటికి ప్రమాదమే. ఆ పొర లేకపోతే సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన అతినీల లోహిత కిరణాలు మనమీద పడి కేన్సర్ రావొచ్చు. అంతేకాదు సూర్యుడి నుంచి పడే కిరణాలను తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి పలు రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంది. వర్షాలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.

ఓజోన్‌ను రక్షించుకోవాలంటే ఏం చేయాలి? చెట్లను పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. పంటల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.

ap-icet-2023-phase-1-counselling-schedule

 ap-icet-2023-phase-1-counselling-schedule

AP ICET: ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సెప్టెంబరు 14 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఐసెట్‌-2023 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 8న ప్రారంభమైంది. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబరు 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు సెప్టెంబరు 9 – 16 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు సెప్టెంబరు 12న అర్హత పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సెప్టెంబరు 19 నుంచి 21 వరకు కొనసాగనుంది.

సెప్టెంబరు 22న వెబ్ఆప్షన్లలో మార్పునకు అవకాశం ఇచ్చి, సెప్టెంబరు 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 26న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 27 నుంచి తరగతులు ప్రారంభంకాన్నాయి.

ఐసెట్ షెడ్యూలు ఇలా..

✦ సెప్టెంబరు 8 నుంచి 14 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది


 

✦ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి సెప్టెంబరు 9 నుంచి 16 మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

✦ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థులు సెప్టెంబరు 19 నుంచి 21 వరకు వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.

✦ అభ్యర్థులు సెప్టెంబరు 22న వెబ్ ఆప్షన్లలో ఏమైనా మార్పులు ఉంటే సరిచేసుకోవచ్చు.

✦ సెప్టెంబరు 25న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

✦ సీట్లు పొందినవారు సెప్టెంబరు 26లోగా సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

✦ సెప్టెంబరు 27 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

సెప్టెంబరు 8 నుంచి 14 వరకు

రిజిస్ట్రేషన్
సెప్టెంబరు 9 నుంచి 16 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్
సెప్టెంబరు 19 నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు
సెప్టెంబరు 22న వెబ్ఆప్షన్ల మార్పు
సెప్టెంబరు 25న సీట్ల కేటాయింపు
సెప్టెంబరు 26లోగా కాలేజీలో రిపోర్టింగ్
తరగతులు ప్రారంభం సెప్టెంబరు 27 నుంచి

AP ICET 2023 కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

✦ AP ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్, https://icet-sche.aptonline.in/ వెళ్లాలి.

✦ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

✦ రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.

✦ అవసరమైన వివరాలను నింపాలి.

✦ బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఎంచుకోవాలి.

✦ ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.

✦ సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.

కావాల్సిన డాక్యుమెంట్లు..

  • ఏపీ ఐసెట్ 2023 హాల్‌టికెట్
  •  ఏపీ ఐసెట్ 2023 ర్యాంకు కార్డు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
  • డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్
  • ఇంటర్ లేదా డిప్లొమా మార్కుల మెమో
  • పదోతరగతి మార్కుల మెమో
  • 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్లు
  • రెసిడెన్స్ సర్టిఫికేట్
  • ఇన్‌కమ్ సర్టిఫికేట్
  • కులధ్రువీకరణ సర్టిఫికేట్
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
  • లోకల్ సర్టిఫికేట్
  • NCC/CAP, మైనార్టీ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.

ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఐసెట్‌(AP ICET)-2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 49,162 మంది దరఖాస్తు చేసుకోగా.. 44 వేల మంది పరీక్షకు హాజరయ్యారు.

ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 8 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

AP ICET – 2023 OFFICIAL WEBSITE LINK

upi-atm-launched-no-need-of-debit-card-can-withdraw-money-from-atm

upi-atm-launched-no-need-of-debit-card-can-withdraw-money-from-atm

UPI ATM: డెబిట్‌ కార్డ్‌ను మర్చిపోండి, UPIతో ATM నుంచి డబ్బులు డ్రా చేయండి

UPI అప్లికేషన్ ఉన్న ఎవరైనా UPI-ATMలను ఉపయోగించవచ్చు.

UPI ATM: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయడానికి డెబిట్‌ కార్డ్‌/ఏటీఎం కార్డ్‌ తీసుకెళ్లాల్సిన అవసరం లేని రోజులు వచ్చాయి. UPI (Unified Payments Interface) ద్వారా డబ్బులు ఎలా పే చేస్తున్నామో, అదే విధంగా ఏటీఎం నుంచి కూడా డ్రా చేసే ఫెసిలిటీ వచ్చింది.

జపాన్‌కు చెందిన హిటాచీ అనుబంధ సంస్థ ‘హిటాచీ పేమెంట్ సర్వీసెస్’ (Hitachi Payment Services), యూపీఐ-ఏటీఎంను (UPI-ATM‌) ప్రారంభించింది. హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం (Hitachi Money Spot UPI ATM) అని దీనికి పేరు పెట్టింది. మీ డెబిట్ కార్డ్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించకుండానే ఈ మెషీన్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. 

ఈ నెల 5న, ముంబైలో జరిగిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023’లో హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను లాంచ్‌ చేశారు. ఈ UPI ATMని దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే, డబ్బులు డ్రా చేయడానికి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ATMలకు తీసుకువెళ్లాల్సిన రోజులు పోతాయి. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అప్లికేషన్స్‌ ఉపయోగించి, మీ బ్యాంక్ అకౌంట్‌ నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి UPI-ATM అనుమతిస్తుంది.

UPI-ATM నుంచి డబ్బును ఎలా డ్రా చేయాలి?
UPI-ATM ఉపయోగించడం చాలా సులభం, సురక్షితం, శ్రమ లేని పని అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ క్యాష్ బిజినెస్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO సుమిల్ వికామ్సే చెబుతున్నారు. హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంను ఉపయోగించి డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలని అనేదానిపై స్టెప్‌ బై స్టెబ్‌ గైడ్‌ను ఆయన షేర్ చేశారు. 

1) హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎంకు వెళ్లిన తర్వాత, ముందుగా, ATM నుంచి విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంచుకోవాలి.

2) ఎంచుకున్న మొత్తానికి సంబంధించిన QR కోడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

3) మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న ఏదైనా UPI యాప్‌ను (గూగుల్‌ పే, ఫోన్‌పే వంటివి) ఉపయోగించి ఆ QR కోడ్‌ను స్కాన్ చేయాలి


4) ఆ లావాదేవీని ధృవీకరించడానికి మీ మొబైల్‌లో UPI పిన్‌ ఎంటర్‌ చేయాలి.

6) యూపీఐతో లింక్‌ అయిన ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్స్‌ ఉంటే, ఏ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలో కూడా మీరు నిర్ణయించుకోవచ్చు.

5) ఆథరైజేషన్‌ పూర్తయిన తర్వాత ATM నుంచి నగదు బయటకు వస్తుంది.

UPI-ATMను ఎవరు ఉపయోగించవచ్చు?
UPI అప్లికేషన్ ఉన్న ఎవరైనా UPI-ATMలను ఉపయోగించవచ్చు. లావాదేవీలు చేయడానికి కస్టమర్‌కు చెందిన Android లేదా iOS ఫోన్‌లో UPI యాప్‌ ఉంటే చాలు.

UPI ATM – కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా మధ్య తేడాలేంటి?
ప్రస్తుతం, చాలా బ్యాంకులు కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా (cardless cash withdrawals) సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దీనికి భిన్నంగా UPI-ATM పని చేస్తుంది. కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా అనేది మొబైల్, OTPపై ఆధారపడి ఉంటుంది. UPI ATM అనేది QR ఆధారిత UPI క్యాష్‌ విత్‌డ్రాపై ఆధారపడి ఉంటుంది.

చాలా ప్రయోజనాలు
UPI-ATM వల్ల, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను మోసగాళ్లు ‘స్కిమ్మింగ్’ చేసే రిస్క్‌ పూర్తిగా తగ్గుతుంది. నెలలో ఇన్ని సార్లే కార్డును ఉపయోగించాలి, ఇంత మొత్తంలోనే డబ్బులు తీయాలంటూ బ్యాంకులు ఇబ్బందులు పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, UPI-ATM ఆ ఇబ్బందులను తొలగిస్తుంది. సులభమైన విత్‌డ్రా పద్ధతితో, నిరక్ష్యరాస్యులను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ విశ్వసిస్తోంది.

UPI-ATMను దేశంలో విస్తరించే పని కొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ వెల్లడించింది

ap-government-education-policies-students-going-to-speak-at-UNO

 ap-government-education-policies-students-going-to-speak-at-UNO

AP Government: ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న 10మంది ఏపీ విద్యార్థులు

ఏపీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడబోతున్నారు. ఏపీలో జరుగుతున్న విప్లవాత్మక విద్యా విధానాలపై ప్రసంగించబోతున్నారు.

వారంతా పేదవిద్యార్థులే… కానీ విద్యాకుసుమాలు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్నా… ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడగలరు. సీఎం జగన్‌ ముందే ఆంగ్లంలో మాట్లాడి  అదరగొట్టారు. ఆ ప్రతిభే.. వారిని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో యూఎన్‌వోలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని ఆ విద్యార్థులు సొంతం  చేసుకున్నారు. 

న్యూయార్క్‌లో అంతర్జాతీయస్థాయిలో జరుగుతున్న హైలెవల్ పొలిటికల్ ఫోరంలో… ఆంధ్రప్రదేశ్‎లో జరుగుతున్న విప్లవాత్మక విద్యా విధానాలను తెలియజేయాలని  ఐక్యరాజ్యసమితి కోరింది. అందు కోసం రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని పంపించాలని ఆహ్వానించింది. ఐక్యరాజ్య సమితి ఆహ్వానంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం… 13జిల్లాల్లో పదో  తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాదించిన 150మందిని ఎంపిక చేసింది. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై ఆ విద్యార్థులకు పరీక్ష నిర్వహించగా  30 మంది ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వీరికి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ కార్యదర్శి మధుసూదనరావు, యూఎన్‌వో స్పెషల్‌ కన్సల్టేటివ్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ  షకిన్‌కుమార్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం మౌఖిక పరీక్షలు నిర్వహించి… 10 మందిని విజేతలుగా ఎంపిక చేసింది. ఈ 10 మంది విద్యార్థులు ప్రభుత్వ ఖర్చుతో…  సెప్టెంబర్15 నుంచి 27వరకు జరిగే యూఎన్‌వో డెలిబెరేషన్ సభకు వెళ్తారు. ఏపీ నూతన విద్యా సంస్కరణలుపై ప్రసంగిస్తారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ మాట్లాడతారు.  ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలు, పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు సరైన ప్రతినిధులు విద్యార్థులేనని.. ఎంపికైన వారంతా పేద కుటుంబాల పిల్లలేనని  విద్యాశాఖ అధికారులు తెలిపారు


 

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు ఎంపికైన 10 మంది ఏపీ విద్యార్థుల్లో… రైతుకూలి బిడ్డ అమ్మాజాన్, లారీ డ్రైవర్‌ కుమార్తె రాజేశ్వరి, సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోత్స్న,  కౌలురైతు కొడుకు అంజన సాయి, రోజుకూలీ బిడ్డ గాయత్రి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుమార్తె శివలింగమ్మ, టీచర్‌ కూతురు మనశ్విని, రైతుబిడ్డ యోగీశ్వర్, మెకానిక్‌  కూతురు రిషితారెడ్డి, ఆటోడ్రైవర్‌ కుమార్తె చంద్రలేఖ ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు వీరివి. పేద కుటుంబంలో పుట్టినా… చదువులో చూపిన ప్రతిభ… వీరికి  ఐక్యరాజ్యసమితి వరకు తీసుకెళ్లింది. ఈ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి పంపిస్తోందని, వీరికి అవసరమైన పాస్‌పోర్టు, వీసా వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్టు  అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో విద్యార్థులంతా అమెరికా అధ్యక్ష భవనాన్ని కూడా సందర్శిస్తారని చెప్పారు. ఈ 10 విద్యార్థులను సీఎం జగన్‌ అభినందించారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని మనస్విని సీఎం జగన్‌ను కూడా కలిసింది.

10 మంది విద్యార్థుల్లో తొమ్మిదో తరగగి చదువుతున్న సామల మనశ్విని కూడా ఉంది. కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామానికి చెందిన మనశ్విని తల్లి కృష్ణవేణి  ప్రభుత్వ టీచర్‌. మనశ్విని ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గిరిజన కుగ్రామంలో పుట్టి పెరిగిన  ఈ  చిన్నారి… సీఎం సభలో ఇంగ్లీషులో స్పీచ్‌ ఇచ్చి… అందరినీ ఆకట్టుకుంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఐక్యరాజ్యసమితికి ఎంపికైన మనస్విని.. అందరూ అభినందిస్తున్నారు.  కురుపాం ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి విద్యార్థినిని సత్కరించి… 50వేలు అందించారు. 

praveen-prakash-sir-GER-data-challenge-video-link

 praveen-prakash-sir-GER-data-challenge-video-link

GER పైన ప్రవీణ్ సర్ సంచలన నిర్ణయం??*

https://youtu.be/gi8_0E8c9I8?feature=shared

100 పర్సెంట్ G E R సాధించడమే లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ లోని సెప్టెంబర్ 2005 మరియు ఆగస్టు 2018 మధ్య జన్మించిన పిల్లలందరూ పాఠశాలల్లో నమోదు అయ్యేవిధంగా తవ్క్షణం చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు కోరారు, ఈ కార్యక్రమాన్ని విలేజ్ వాలంటీర్లు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు జూనియర్ కాలేజ్ లెక్చరర్లు హెడ్మాస్టర్లు ప్రిన్సిపల్ జిల్లా అధికారులు కలెక్టర్లు అందరూ కలిసి సెప్టెంబర్ 4వ తేదీ లోపు పూర్తి చేయాలని తెలియజేశారు.

https://www.youtube.com/watch?v=gi8_0E8c9I8&ab_channel=SCERTAndhraPradesh

సెప్టెంబర్ 4న పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క లేదా బాలిక నమోదు కాకుండా నమోదు చేయబడిన అంశాలు తప్పుగా ఉన్న తన ఉద్యోగానికి ఐఏఎస్ కు రాజీనామా చేస్తానని చాలెంజ్ చేశారు కావున విలేజ్ వాలంటీర్లు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ సమన్వయంతో నూరు శాతం  జి ఈ ఆర్ సాధించాలని అదేవిధంగా ఆ డేటా అంతా స్వచ్ఛమైనదిగా ఉండాలని ఎక్కడ పొరపాట్లకు తాగకుండా చేయాలని కోరార


https://www.youtube.com/watch?v=gi8_0E8c9I8&ab_channel=SCERTAndhraPradesh


ప్రపంచంలో ఉన్న 3500 స్థానిక ప్రభుత్వాలు అనగా స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా 250 వరకు ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ తో కలిపి దాదాపు 3800 ప్రభుత్వాలు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూరు శాతం జీ ఈ ఆర్ సాధించిన రాష్ట్రంగా అవతరించాలని ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం గురించి చర్చ జరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నాలుగు ప్రకారం బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో నమోదు కావడం తప్పనిసరి కావున ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆయన కోరారు
GER పై చాలెంజ్ .ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా ?

ప్రపంచంలో ఎక్కడా లేని వాలంటీర్స్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉంది . విద్యాశాఖ ,రెవెన్యూ శాఖ, విలేజ్ వార్డ్ సచివాలయం శాఖ సమన్వయంతో 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు గల ప్రతి ఒక్క విద్యార్థి ఏదైనా పాఠశాలలో కానీ, ఓపెన్ స్కూల్లో మరియు స్కిల్ సెంటర్లలో కానీ, కాలేజీలో గాని కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి .దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట 100% సాధించిన రాష్ట్రంగా ఖ్యాతి పొందాలి. సెప్టెంబర్ ఐదు కల్లా ఈ టార్గెట్ ను పూర్తి చేయాలి. ఆరోజు మేము ఇచ్చే డేటా నుండి ఏ ఒక్క విద్యార్థి డేటా తప్పు అయినా నేను ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తాను. ఇది ఛాలెంజ్. ఇట్లు ప్రవీణ్ ప్రకాష్ ప్రకాష్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పాఠశాల విద్యాశాఖ

chandrayan-3-vikram-lander-work-on-moon-details

 chandrayan-3-vikram-lander-work-on-moon-details

Chandrayaan-3: చందమామపై దిగిన రోవర్.. వీడియో రిలీజ్ చేసిన ఇస్రో

Chandrayaan 3: విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగాక దేనికోసం పరిశోధన చేస్తుంది?

Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ వీడియోని ఇస్రో తాజాగా రిలీజ్ చేసింది.

చంద్రుని దక్షిణ ధ్రువం పై అనుకున్నట్టే ఆగష్టు 23 న సాయంత్రం 6 గంటల సమయం లో విక్రమ్ లాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. మన ప్రయోగం విజయవంతం అయ్యింది . ప్రపంచ దేశాల్లో భరత్ మొత్త్తమొదటి దేశము గా నిలిచిందిచంద్రయాన్‌-3 లో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. అవి..
  • 1) ప్రొపల్షన్‌ మాడ్యూల్‌,
  • 2) ల్యాండర్‌,
  • 3) రోవర్‌

ఈ మూడూ సమన్వయంతో పనిచేస్తేనే ఇస్రో కంటున్న చదనరుని దక్షిణ ధ్రువం కలలు నెరవేరతాయి. అందుకోసం వీటిని అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందించారు. వాటిలో ఉప పరికరాలను మోహరించారు.

రోవర్ ఎలా ప‌నిచేస్తుంటే..?

ఇది దీర్ఘచతురస్రాకార ఆకృతిలో.. ల్యాండర్‌లోని ఒక ఛాంబర్‌లో ఉంటుంది. ర్యాంప్‌ ద్వారా లోపలి నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వస్తుంది. చందమామపై సాఫీగా కదలడం కోసం దానికి ఆరు చక్రాలు, మార్గనిర్దేశం కోసం నావిగేషన్‌ కెమెరాను అమర్చారు. సైన్స్‌ పరిశోధనల కోసం ఇందులో ఆల్ఫా పార్టికిల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కొపీ అనే పరికరాలను ఏర్పాటు చేశారు. అవి ల్యాండింగ్‌ ప్రాంతంలో మూలకాల గురించి శోధిస్తాయి. ఆర్‌ఎక్స్‌/టీఎక్స్‌ యాంటెన్నాల ద్వారా నేరుగా ల్యాండర్‌తో రోవర్‌ కమ్యూనికేషన్‌ సాగించగలదు.

https://youtu.be/lYYY17pE6yE

ఇవి ఎంతకాలం పనిచేస్తాయంటే..?

MOON ఉపరితలంపై విజయవంతంగా దిగాక LANDER, ROVER.. అక్కడి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఎంతకాలం పనిచేస్తాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టమే! Moonపై ఒక రోజు length భూమిమీద సుమారు 28 రోజులు. అందులో Day Time 14 రోజులు ఉంటుంది. ఆ తర్వాత Night సమయం మొదలవుతుంది. అది చాలా cool గా, ప్రతికూలంగా ఉంటుంది. Sunlight లభించదు. ఆ వాతావరణాన్ని చంద్రయాన్‌-3 పరికరాలు తట్టుకొని నిలబడటం అనుమానమే! అందువల్ల 14 Days మాత్రమే పనిచేసేలా ల్యాండర్‌, రోవర్‌లను రూపొందించారు. అయితే 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ సూర్యోదయమయ్యాక అవి ‘inactive’ నుంచి మేల్కొని, తిరిగి పనిచేసే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ వీడియోలో ప్రజ్ఞాన్ రోవర్.. మెల్లగా చందమామపై దిగింది. ఆ తర్వాత దాని సోలర్ ప్యానెల్స్ ద్వారా సోలార్ పవర్ పొందుతూ.. అది పనిచేయడం ప్రారంభించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ప్రజ్ఞాన్ రోవర్.. చందమామపై 14 రోజులు పనిచేస్తుంది. ఆగస్టు 23 నుంచి ఇది పని ప్రారంభించింది. ఇది చందమామ ఉపరితలంపై ఉన్న నీటి రహస్యాల గుట్టు విప్పతుందని భావిస్తున్నారు.

చంద్రయాన్ 3 రోవర్ లాండర్ నుండి చంద్ర ఉపరితలంపైకి ఎలా దూసుకుపోయిందో వీడియో విడుదల చేసిన ఇస్రో

Chandrayan-3-Broadcasted-live-link

 Chandrayan-3-Broadcasted-live-link

Convening of Special Assembly of students and teachers in all the schools from 5.30 PM to 6.30 PM on 23.08.23 regarding LIVE Streaming of Chandrayaan-3 landing on the moon –Instructions issued.

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లోనే జాబిల్లిపై అడుగుపెట్టనుంది. జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3.. 45 రోజుల పాటు ప్రయాణించి బుధవారం అంటే ఆగస్టు 23న సాయంత్రం సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. అయితే.. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. AP సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్‌-3 జాబిల్లిపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే.. విద్యార్థుల కోసం స్కూళ్లు, కాలేజీల్లో లైవ్‌ టెలికాస్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను AP ప్రభుత్వం ఆదేశించింది.

CHANDRAYAN-3 LIVE LINK OFFICIAL

ఈమేరకు డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తెరలు, ప్రొజెక్టర్‌లను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ఛానెళ్లలో లైవ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై దిగనుండగా.. ఆ అద్బుత దృశ్యాన్ని విద్యార్థులకు లైవ్‌లో చూపించనున్నారు.

23-08-2023 సాయంత్రం 5.27 గంటల నుంచి.. చంద్రయాన్‌-3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపైకి దిగే ప్రక్రియను ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనుంది. ఈ లైవ్.. వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ఛానల్‌, డీడీ నేషనల్‌ ఛానెళ్ల ద్వారా వీక్షించవచ్చు. దీంతో.. అన్ని విద్యాసంస్థల్లో.. సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు లైవ్ ఇవ్వనున్నారు.

Message on Chandrayaan-3 Soft-landing telecast 23-08-2023 AT 5PM 

Let’s encourage students to see the Live Landing to mark India’s Historic Mission to Moon.
Please click the link to know more: 
Message on Chandrayaan-3 Soft-landing telecast Home /Message on Chandrayaan-3 Soft-landing telecast.

India’s pursuit of space exploration reaches a remarkable milestone with the impending Chandrayaan-3 Mission, poised to achieve a soft landing on the lunar surface. This achievement marks a significant step forward for Indian Science, Engineering, Technology, and Industry, symbolising our nation’s progress in space exploration.

The soft landing of Chandrayaan-3 is a monumental moment that not only fuels curiosity but also sparks a passion for exploration within the minds of our youth. It generates a profound sense of pride and unity as we collectively celebrate the prowess of Indian science and technology. It will contribute to fostering an environment of scientific inquiry and innovation.

In light of this, all schools and educational institutions across the nation are invited to play an active role in this historic event. The institutions are invited to actively publicise this event among your students and faculty and organize the LIVE streaming of the Chandrayaan-3 soft landing within the premises.

AP CSE PROCEEDINGS PDF

ap-polycet-2023-web-options-link

 ap-polycet-2023-web-options-link

AP POLYCET: ఆగస్టు 11 నుంచి పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

ADMISSIONS INTO POLYTECHNICS (APPOLYCET – 2023)

ఏపీలో పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగ‌స్టు 11 నుంచి ప్రారంభంకానుంది. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 14 వరకు ఆప్షన్లను నమోదుచేసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్లు మార్చుకోవాలనుకునేవారు ఆగస్టు 16న ఆప్షన్లు మార్చుకోవచ్చు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 18న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి  23 మధ్య సంబంధిత పాలిటెక్నిక్ కళాశాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

AP POLYTECHNICAL COLLEGES LIST & FEES DETAILS  CLICK HERE

కౌన్సెలింగ్ వెబ్‌సైట్

షెడ్యూలు ఇలా..

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం: ఆగ‌స్టు 11. 

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదుకు చివరితేది: ఆగస్టు 14.

➥ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం: ఆగస్టు 16 

➥ పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు: ఆగస్టు 18న


 

➥ కళాశాలలో రిపోర్టింగ్: ఆగస్టు 19 నుంచి  23 మధ్య.

➥ తరగతులు ప్రారంభం: ఆగస్టు 23 నుంచి. 

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించారు. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించాల్సి ఉండగా… కౌన్సెలింగ్‌ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూలును అధికారులు వెల్లడించారు. 



POLYCET-2023 WEB OPTIONS LINK CLICK HERE

MANUAL OPTION ENTRY FORM PDF CLICK HERE

Parent- Teacher Meetings-After every Assessment-Instructions

 Parent- Teacher Meetings-After every Assessment-Instructions

2023-24 విద్యా సంవత్సరం ప్రతీ అసెస్మెంట్ అనంతరం విద్యార్థుల ప్రగతిని చర్చించేందుకు ప్రతి పాఠశాలలో  పేరెంట్స్ సమావేశం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్
ఈ విద్యా సంవత్సరం FA 1 పూర్తి అయినందున దానికి సంబంధించిన తల్లితండ్రుల సమావేశం 10.08.2023 నిర్వహించాలి.

పేరెంట్ టీచర్స్ మీటింగ్.

 తల్లిదండ్రులతో సమావేశం 

PARENT TEACHER MEETING INVITATION CARD PDF CLICK HERE

మండల విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా ఈనెల 10వ తేదీన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. ఇటీవల ఆగస్టు ఒకటో తేదీ నుండి 4వ తేదీ వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ -1 మార్కులు తల్లిదండ్రుల సమావేశంలో ప్రదర్శించాలి. విద్యార్థులకు వచ్చిన మార్కుల గురించి తల్లిదండ్రులతో చర్చించాలి. విద్యార్థుల స్థాయిని మరింత పెంచడానికి చేయవలసిన. కృత్యాలను చర్చించాలి. 

మార్కులతో పాటు మధ్యాహ్న భోజనము. విద్యార్థుల హాజరు పెంపు. ట్యాబ్స్ ఎక్కువగా వినియోగించడం. జగనన్న విద్యా కానుక. అమ్మ ఓడి వినియోగము. వర్క్ బుక్ నోట్స్ పూర్తి చేయడం. పాఠశాలలో పరిశుభ్రత, నాడు నేడు మొదల అంశాల గురించి కూడా చర్చించాలి.ఈ సమావేశాలకు DEO, APC, DyEO, MEO, సెక్టోరియల్ ఆఫీసర్లు పర్యవేక్షి oచాలి.

The workshop’s
outcomes are poised to play a pivotal role in guiding the implementation
of various educational initiatives. The workshop encapsulated several key
highlights, which are outlined as follows:

1. Workshop Overview:
On August 3, 2023, a workshop held in Vijayawada on academic
activities. The workshop aimed to brainstorm strategies that align with the
theme “Promoting Ease of Living through Good Governance and Use of
Technology in Schooling.” This theme, pertinent to the 3rd Chief
Secretaries Conference and to elevate learning outcomes while bridging
the gaps between internal and external assessments. 

2. Participants:
The workshop was attended by esteemed stakeholders, which includes all the JDs and above cadre ofcers in the Department of School
Education, all the District Educational Ofcers in the state, all the
Additional Project Coordinators of the Samagra Shiksha, all the DCEB
Secretaries, all SCERT and SIEMAT faculty, identifed subject experts from
each district, National Best Teacher awardees, selected Mandal
Educational Ofcers, Headmasters/Principals of School Education, and all
the Technical Service Agencies of the SALT project 

3. Dignitaries Present:
Notably, the workshop was graced by the presence of several dignitaries,
including the Honorable Education Minister Sri B. Satyanarayana Garu,
Chief Secretary of Andhra Pradesh Sri K.S. Javahar Reddy Garu IAS,
Principal Secretary of School Education Sri Praveen Prakash Garu IAS,
Commissioner of School Education Sri S. Suresh Kumar Garu IAS, State
Project Director Sri B. Srinivasarao Garu IAS and the Director Mid DayMeal Dr. Nidhi Meena Garu IAS


 

4. Key Workshop Points:
The workshop covered a range of discussions focusing on enhancing
educational practices. These discussions included:
– State-specifc suggestions for “Promoting Ease of Living & Their Status”
for the Third National Chief Secretary Conference.
– Reforms in assessments, including state assessments, NAS & ASER
Reports, and CBSE assessments, with emphasis on bridging learning
outcome gaps.
– Strategies for efective English medium instruction, TOEFL preparation,
and measures for improved spoken English.
– Suggestions for SSC exam reforms.
– Ideas concerning “Gorumudda” and “TMF.”
– Among other suggestions, the stakeholders’ recommendation to
enhance parental awareness and regular parent-teacher meetings to foster student learning improvement. 

5. Implementation Strategy:
Considering the various valuable insights gained from the workshop, it is
proposed to conduct parent-teacher meetings after every
assessment within one week of completing assessments. The
progress card of the students shall be handed over to the parents before
this meeting and the learning outcomes of the students to be discussed
with parents. This approach aims to actively involve parents in their
children’s academic progress and promote a conducive learning
environment. 

6. Action Plan:
Schools are currently conducting four formative assessments and two
summative assessments per academic year. In line with the proposed
strategy, parent-teacher meetings will be scheduled immediately following
each assessment. The specifc dates for these meetings will be
communicated with these orders. 

7. Discussion Points for the Parent-Teacher Meeting:
During the parent-teacher meeting, the subject teachers and the
headmaster should provide a clear explanation to parents about the
learning gaps observed in their children’s academic progress. Additionally,
a comprehensive remediation plan will be outlined, which the school
intends to implement to address these gaps for each student individually.
The objective is to ensure a smooth and constructive communication
process with parents, facilitating positive counseling sessions for both
students and parents alike.
Teachers are encouraged to communicate efectively the
misconceptions that students might have developed in their
understanding of various concepts. Furthermore, teachers will
collaboratively develop and present remedial teaching plans aimed at
rectifying these misconceptions and improving the overall learning
experience for the students. Your dedication and commitment to the betterment of our education system are highly appreciated. Let us work
collectively to implement these strategies and foster a positive learning
experience for our students.
In light of this, it is hereby directed that parent-teacher meetings
must be conducted in every school within the designated time frame
specifed below:

In this regard, the Regional Joint Directors of School Education (RJDs,
SE) and the District Educational Ofcers (DEOs) in the state are requested
to issue the necessary orders to the concerned schools and ofcers in their
jurisdiction to implement the PTA meetings as per schedule and submit
the compliance report after each meeting at once to the under signed.

Internet-Banking -safty-Tips

 Internet-Banking -safty-Tips

Banking Tips: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ సేఫ్టీ టిప్స్ గుర్తుంచుకోండి

Banking Tips | ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటారా? మొబైల్ బ్యాంకింగ్ (Mobile Banking) ద్వారా తరచూ లావాదేవీలు జరుపుతుంటారా? సేఫ్టీ టిప్స్ గుర్తుంచుకోకపోతే చిక్కుల్లో పడ్డట్టే.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking) అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ కార్యకలాపాలు సులువైపోయాయి. ఖాతాదారులకు ఎంతో సమయం ఆదా అవుతోంది. అయితే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్‌లోఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా, ఉన్న డబ్బులన్నీ కోల్పోవాల్సి వస్తుంది. 

ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో రాజీ పడకూడదు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ (Online Transactions) జరిపే సమయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడే రిస్క్‌ లేకుండా పేమెంట్స్ పూర్తి చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.

స్ట్రాంగ్ పాస్‌వర్డ్

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ప్రధానమైనది క్రెడెన్షియల్స్. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, భర్త/ భార్య పేరు వంటి వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. స్కామర్లు వీటిని సులువుగా ఊహిస్తారు. కాబట్టి, స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి. మిక్స్‌డ్ క్యారెక్టర్స్‌ కలిపి పాస్‌వర్డ్‌గా పెట్టాలి. దీన్ని తరచుగా మార్చాలి. అప్పుడే స్కామర్ల చేతిలో పడకుండా కాపాడుకోవచ్చు. 

పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసే సమయంలో కాపీ పేస్ట్ చేయకూడదు. మ్యాన్యువల్‌గా ఎంటర్ చేయాలి. దీంతో పాటు పాస్‌వర్డ్‌ ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. గుర్తుతెలియని వారికి కంప్యూటర్ షేర్ చేయకపోవడమే మంచిది. 

వివరాలు చెప్పొద్


దు

ప్రతి అకౌంట్ హోల్డర్‌కి యూజర్ ఐడీ, ఐపిన్ (IPIN) ఉంటుంది. ఇది వ్యక్తిగతం. బ్యాంకు సిబ్బందితో కూడా దీనిని పంచుకోకూడదు. నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అయ్యాక కొత్తగా జనరేట్ అయిన ఐపిన్‌ మార్చుకోవాలి. కొంత మంది బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఖాతాదారులను ఏమార్చేందుకు ప్రయత్నిస్తారు. పాస్‌వర్డ్, ఓటీపీ, డెబిట్ కార్డ్ నంబర్, సీవీవీ, తదితర వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

ఆ లింక్స్‌తో జాగ్రత్త

రోజూ ఎన్నో మెసేజ్‌లు, ఇమెయిల్స్ వస్తుంటాయి. వాటిల్లో కొన్ని అనుమానాస్పద లింకులు ఉంటాయి. వాటిని క్లిక్ చేయొద్దు. అనుమానాస్పద ఇమెయిల్స్‌కి రెస్పాండ్ కాకపోవడమే మంచిది. అందులో వచ్చే అటాచ్‌మెంట్లను డౌన్‌లోడ్ చేయొద్దు. దీంతో పాటు హోటళ్లు, ఎయిర్‌పోర్టులు, సైబర్ కేఫ్‌ల వంటి పబ్లిక్ వైఫై వాడుతున్న సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వకూడదు. 

ఫోన్ సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్ యాప్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లో ఉంచుకోవాలి. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సైట్‌లోనే

అధికారిక వెబ్‌సైట్‌లలోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయాలి. అఫీషియల్ వెబ్‌పేజీలను పోలిన సైట్లు ఎన్నో ఉంటాయి. ఆయా బ్యాంకులు అధికారిక వెబ్‌సైట్‌ల గురించి ఖాతాదారులకు తెలియజేస్తుంటాయి. వీటిలోనే లాగిన్ కావాలి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్‌ బ్యాంకింగ్‌కి లాగిన్ కావాలంటే www.hdfcbank.com వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 

ఇమెయిల్స్ లేదా ఇతర వెబ్‌సైట్లలో లింక్‌లను క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ వెబ్‌పేజీలోకి వెళ్లకూడదు. యూఆర్ఎల్ ఎంటర్ చేసే సమయంలోనూ వెరిఫై చేసుకోవాలి. 

వెబ్‌పేజీలోని అడ్రస్ బార్‌లో ఎడమవైపున పైభాగంలో ‘లాక్’ సింబల్ ఉందో లేదో చెక్ చేయాలి. లాక్ సింబల్ ఉంటే అధికారిక పేజీ అన్నట్లు అర్థం. అదే విధంగా యూఆర్ఎల్‌లో ‘https’ అని ఉంటుంది. ‘http’ అని ఉంటే ప్రాసెస్‌ని ఆపేయాలి.

టు స్టెప్ వెరిఫికేషన్

నెట్ బ్యాంకింగ్ సెక్యూరిటీ కోసం యూజర్లు టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా అయితే, ఇతరులు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయాలని భావిస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కి ఓటీపీ లేదా అలర్ట్ మెసేజ్ వస్తుంది. వీటిని ఎంట్రీ చేస్తేనే లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి టు ఫ్యాక్టర్ అథెంటికేషన్‌తో అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు.

AP Engineering colleges-NIRF-ranks

 AP Engineering colleges-NIRF-ranks

Top 10 Engineering colleges in AP: ఎన్ ఐ ఆర్ ఎఫ్ జాబితాలో టాప్-200లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 10 ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు స్థానం సంపాదించుకున్నాయి. 

Top 10 Engineering colleges in AP: ఏపీలో టాప్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు ఇవే!
విద్యార్థులు ఇంటర్ పూర్తి కాగానే ఇంజినీరింగ్, మెడిసిన్, బీ ఫార్మసీ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరుతుంటారు. ప్రస్తుతం ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మంచి కాలేజీలు ఏమున్నాయి అని సెర్చ్ చేస్తున్నారా. అయితే వారు ఈ వివరాలపై ఓ లుక్కేస్తే బెటర్. ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో టాప్-200లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 10 ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు చోటు దక్కించుకున్నాయి.  

కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వ‌ర్క్‌ (ఎన్ ఐ ఆర్ ఎఫ్‌) 2023 సంవ‌త్సరానికి గానూ దేశంలోని ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల ర్యాంకులను వెల్లడించింది. టాప్ – 200లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10 కాలేజీలు చోటు దక్కించుకున్నాయి. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్, ప్రతి ఏడాది విద్యార్థుల ఫలితాలు లాంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి ర్యాంకులను కేటాయిస్తుంటారు.  నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వ‌ర్క్‌(ఎన్ ఐ ఆర్ ఎఫ్‌) 2023 సంవ‌త్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు కాలేజీలు టాప్ -100లో స్థానం పొందాయి.


 

గుంటూరు జిల్లా వ‌డ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేష‌న్ ఫౌండేష‌న్ యూనివ‌ర్సిటీ (కేఎల్ ఇంజినీరింగ్ కాలేజీ) ఎన్ ఐ ఆర్ ఎఫ్ వెల్లడించిన ర్యాంకింగ్‌లో 44వ స్థానం సాధించింది. తిరుప‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) 59వ స్థానం, గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేష‌న్ ఫ‌ర్ సైన్స్ టెక్నాల‌జీ అండ్ రీసెర్చ్ 85, విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్రా యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 94వ ర్యాంకును పొందాయి. 

ఇంకా ఈ జాబితాలో టాప్ 200లో విశాఖ‌ప‌ట్నానికి చెందిన గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌, జేఎన్‌టీయూ కాకినాడ‌, జేఎన్‌టీయూ అనంత‌పురం, విజ‌య‌వాడ‌లోని వెల‌గపూడి రామ‌కృష్ణ సిద్ధార్థ ఇంజినీరింగ్ క‌ళాశాల  (141 ర్యాంకు), తిరుప‌తిలోని శ్రీ విద్యానికేత‌న్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ (165వ ర్యాంకు), తిరుప‌తిలోని శ్రీ వెంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ, లు చోటు దక్కించుకున్నాయి. 

Free Aadhaar Update-upto-September-2023

 Free Aadhaar Update-upto-September-2023

Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు గడువు పొడిగింపు.. ఆ తేదీ దాటితే డబ్బులు కట్టాల్సిందే*

 ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్‌ 14తో ముగియడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.  ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. గతంలో మార్చి 15 నుంచి ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించగా.. ఆ గడువు జూన్‌ 14తో ముగిసింది. దీంతో ఆ గడువును సెప్టెంబర్‌ 14వరకూ పొడిగిస్తున్నట్టు తాజాగా UIDAI ప్రకటించింది. ఈ గడువు కూడా ముగిస్తే ఆధార్‌ అప్‌డేట్‌ చేసేందుకు ప్రజలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
*☞యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు (Free Aadhaar Update) ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.*

అప్‌డేట్‌ చేసుకోండిలా.


    *☞https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ కావాలి.*
*☞‘ప్రొసీడ్‌ టు అప్‌డేట్‌ అడ్రస్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
*☞రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.*
*☞దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్‌ అప్‌డేట్‌’పై క్లిక్‌ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి.*
*☞తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి ‘ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
*☞ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి.*
*☞14 అంకెల ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నెంబర్‌’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు
error: Content is protected !!