lic-new-policy-LIC Jeevan Utsav Policy Details

 lic-new-policy-LIC Jeevan Utsav Policy Details

LIC Policy: ఎల్‌ఐసీ కొత్త పాలసీ – జీవితాంతం ఆదాయంతో పాటు ఎక్కువ వడ్డీ పొందే ఆప్షన్‌

పాలసీదారు కట్టే ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారెంటీడ్‌ అడిషన్స్‌‍ను ‌(Guaranteed additions) LIC కూడా జమ చేస్తుంది.
8 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఎవరైనా LIC జీవన్ ఉత్సవ్ ప్లాన్‌ను కొనగోలు చేయవచ్చు. ఈ పథకం కింద.. 5-16 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత కొంత వెయిటింగ్‌ పిరియడ్‌ ఉంటుంది. 

WHAT IS LIC’S JEEVAN UTSAV PLAN?

LIC’s Jeevan Utsav is a Non-Linked, Non-Participating, Individual, Savings, Whole Life Insurance plan. This plan provides financial support to family in case of unfortunate death of Life Assured and survival benefits in the form of Regular Income Benefit or Flexi Income Benefit as per the option chosen for surviving policyholder.

జీవన్‌ ఉత్సవ్‌ పథకం కింద జీవితాంతం ఆదాయం పొందడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. అవి.. రెగ్యులర్‌ ఇన్‌కమ్‌, ఫ్లెక్సీ ఇన్‌కమ్‌. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ ఆప్షన్‌లో ఏటా 10% డబ్బు జీవితాంతం తిరిగి వస్తుంది.  ఫ్లెక్సీ ఇన్‌కమ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే, ఏటా చెల్లించే డబ్బు ఎల్‌ఐసీ వద్దే ఉంటుంది, దానిపై 5.5 శాతం చక్రవడ్డీ వస్తుంది. 
పాలసీదారు మరణిస్తే, డెత్‌ బెనిఫిట్స్‌తో పాటు గ్యారెంటీడ్‌ అడిషన్స్‌ను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. డెత్‌ ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ లేదా వార్షిక ప్రీమియానికి 7 రెట్ల మొత్తం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం నామినీకి అందుతుంది. 

LIC Jeevan Utsav Policy Details in Telugu: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC), వివిధ వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు కొత్త బీమా పాలసీలను తీసుకువస్తూనే ఉంది. ఇటీవలే, LIC జీవన్ ఉత్సవ్ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది వ్యక్తిగత, పొదుపు, పూర్తి జీవిత కాలపు బీమా ప్లాన్. దీనిలో కొత్తగా తీసుకువచ్చిన అంశం… జీవితాంతం హామీతో కూడిన రాబడి (Guaranteed return). ఈ ప్లాన్‌ నంబర్‌ 871 (Plan No 871). 

పాలసీ తీసుకోవడానికి ఎవరు అర్హులు? (Who is eligible to take the policy?)

5 సంవత్సరాల ప్రీమియం టెన్యూర్‌ను ఎంచుకుంటే, ఆ తర్వాత మరో 5 సంవత్సరాలు వెయిట్‌ చేయాలి. 6 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే 4 సంవత్సరాల వెయిటింగ్‌ పిరియడ్‌ ఉంటుంది. 7 సంవత్సరాల పేమెంట్‌ ఆప్షన్‌ తీసుకుంటే వెయిటింగ్‌ పిరియడ్‌ మరో 3 సంవత్సరాలు అవుతుంది. 8-16 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే ఇంకో 2 ఏళ్లు వెయిట్‌ చేయాలి


 

వెయింటింగ్‌ పిరియడ్‌ ముగిసిన నాటి నుంచి మీ పాలసీ మొత్తంలో ఏటా 10% చొప్పున LIC మీకు తిరిగి చెల్లిస్తుంది. అలా.. పాలసీదారు జీవితాంతం డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ పథకం కింద, పెట్టుబడిదార్లు కనీసం రూ.5 లక్షల హామీ మొత్తాన్ని (Minimum sum assured) పొందుతారు. 

పాలసీ తీసుకున్న తర్వాత… 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. దీనిని నెలకు ఒకసారి, మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి చొప్పున చెల్లించవచ్చు. పాలసీ చెల్లింపు కాలంలో పాలసీదారు కట్టే ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారెంటీడ్‌ అడిషన్స్‌‍ను ‌(Guaranteed additions) LIC కూడా జమ చేస్తుంది.

ఎక్కువ వడ్డీ ప్రయోజనం (High interest benefit)

డెత్‌ బెనిఫిట్స్‌ (LIC Jeevan Utsav Death Benefit)

జీవన్‌ ఉత్సవ్‌ పాలసీపై లోన్‌ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. ప్రీమియం చెల్లింపు ప్రారంభమైన తర్వాత రుణం తీసుకోవచ్చు. అప్పుపై చెల్లించే వడ్డీ, రెగ్యులర్‌ ఆదాయంలో 50% దాటకూడదు. 

today-December-15th-ap-cabinet-complete-details

 today-December-15th-ap-cabinet-complete-details

AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ – పెన్షన్ రూ.3 వేలకు పెంపు, పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
Pension Increase in AP: ఏపీ ప్రభుత్వం (AP Government) పించన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024, జనవరి నుంచి సామాజిక పెన్షన్లు (Pensions) రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ (AP Cabinet) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్య శ్రీలో (Arogya Sri) చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు చేయనున్నట్లు పేర్కొంది. ‘మిగ్ జాం’ తుపాను నష్ట పరిహారం అందించేందుకు ఆమోదం తెలిపింది.

కేబినెట్ కీలక నిర్ణయాలు

  • విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్ట్ DPRకు కేబినెట్ ఆమోదం, అలాగే విశాఖలోని 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం
  • జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం
  • కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం
  • 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం, అలాగే ఈ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వైద్య కళాశాలల్లో అంకాలజీ (క్యాన్సర్ చికిత్స, అధ్యయనం) విభాగం ఏర్పాటుకు నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద రూ.300 ఇవ్వాలని నిర్ణయం.
  • ఏపీ సీసీ టీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు  కేబినెట్ అనుమతి ఇచ్చింది.
  • రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు, ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ, వీటిపై విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశం
  • కోర్టుల్లో పని చేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ఏ చెల్లింపు
  • యాంటీ నక్సల్ ఆపరేషన్ లో పని చేసే టీమ్స్ కు 15 శాతం అలవెన్స్ పెంపు, కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
  • ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యూబ్స్ పంపిణీ
  • ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మెరిటైం బోర్డు పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం
  • ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం
  • 45 – 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేయడానికి కేబినెట్ ఆమోదం.

edit-option-modify-tenth-class-students-details

edit-option-modify-tenth-class-students-details
AP Tenth: ‘టెన్త్‌’ విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
AP SSC: ఏపీలోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది.
ఇప్పటికే పదోతగతి ఫీజు చెల్లింపు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రూ.200 ఆలస్యరుసుముతో డిసెంబరు 9 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 10 నుంచి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శి పేపర్లకు అమలు చేయనుంది. మొదట కాంపోజిట్ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరం నుంచి తొలగించాలని నిర్ణయించింది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. 
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. 
AP SSC Details Edit: ఏపీలోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. విద్యార్థులు డిసెంబ‌రు 16 నుంచి 20 వరకు వివరాలు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి డిసెంబరు 7న ఒక ప్రకటలో తెలిపారు. బోర్డుకు సమర్పించిన విద్యార్థుల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటే సరి చేయాలని సూచించారు. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫొటో, సంతకం, మొదటి, రెండో భాష సబ్జెక్టు వివరాలను పరిశీలించాలని ఆయన తెలిపారు. 
ఫీజు చెల్లింపు గడువు..
➥ రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 26 నుంచి నవంబరు 30 వరకు 
➥  రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 నుంచి డిసెంబరు 5 వరకు. 
➥ మూగు, చెవుడు, అంధ విద్యార్థులకు పరీక్ష ఫీజు, హాజరు మినహాయింపు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 40 శాతం పైగా ప్రభావం ఉన్నవాళ్లను దివ్యాంగుల కేటగిరీ పరిగణిస్తారు.
➥ మూగ, చెవుడు విద్యార్థులకు రెండు భాషా సబ్జెక్టుల నుంచి మినహాయింపు ఉంది. అంధ అభ్యర్థులు స్క్రైబ్ తీసుకోవడానికి అర్హులు.
➥ లాంగ్వే్జ్ సబ్జెక్టుల నుంచి మినహాయింపు కోరే దివ్యాంగ విద్యార్థులు ముందుగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
‘కాంపోజిట్‌’ పేపర్ కొనసాగింపు..
ఏడు పేపర్లతోనే పరీక్ష.. ప్రశ్నపత్రాల్లో మార్పులు..
తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతుండటంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు. 
➥ తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.
➥ రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు ఉంటాయి.
➥ హిందీలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చేశారు. గతంలో బిట్ పేపర్‌ను తొలగించగా.. ఇప్పుడు అదేవిధానాన్ని తీసుకొచ్చారు. 14 ఒక మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలే అధికం.

from-desk-of-principal-secretary-episode-12-youtube-link

 from-desk-of-principal-secretary-episode-12-youtube-link

From The Desk of Principle Secretary 12th Episode 


జిల్లా విద్య శాఖ అధికారులకు  అందరికీ నమస్కారం. 
ఈరోజు  గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు, 12వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వారా, సందేశాన్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాము. 
ఈ యూట్యూబ్ లింక్ ని మీ జిల్లా పరిధిలోని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము.
శ్రీయుత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యూట్యూబ్ ఫ్రo ది బెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ 12వ ఎపిసోడ్ ముఖ్యాంశాలు…*
ఇంతకు మునుపు ఎస్ఏ వన్ పరీక్షలు ఏ టీచరు కా టీచర్ పెట్టుకున్న పేపర్ తోటి జరిగేవి*. 
అయితే వాటిని పూర్తిగా రాష్ట్రం మొత్తం ఒకటే పేపర్ ఉండేలాగా చర్య తీసుకుని క్వాలిటీని పెంచటం జరిగింది.*
వారు వెళ్లిన ప్రతి పాఠశాలలోనూ 10వ తరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్న విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది.*
 అలాగే డిసెంబర్ 11వ తేదీన ఎస్ఏ వన్ పరీక్షల పేపర్లు ఇచ్చి విద్యార్థులతో సెల్ఫీ విత్ ద టాపర్ కార్యక్రమంలో భాగంగా వారి ఫోన్ నెంబర్ కు పిల్లలతో దిగిన ఫోటోలను పంపవలసిందిగా సూచించారు*.
ఇక 21 డిసెంబర్ న చాలా ముఖ్యమైన రోజుగా ప్రకటించారు. ఆరోజున రాష్ట్రంలోని ఇప్పటివరకు ఐ ఎఫ్ పి లు ఇవ్వని పాఠశాలలకు అన్నింటికీ అన్ని తరగతి గదులకు ఐఎఫ్పి లు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు*.
అదేరోజు పాఠశాలలోని ప్రతి ఒక్క ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు టాబులను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ కంటెంట్ తో పాటుగా ఇవ్వటం జరుగుతుందని తెలిపారు*.
అందుకొరకు ప్రతి పాఠశాల నుండి ఖచ్చితమైన 8వ తరగతి నమోదు వివరాలను పంపాలని తెలిపారు*.
డౌట్ క్లియరెన్స్ యాప్ ని చక్కగా ఉపయోగించుకునేలా చూడాలని తెలిపారు*.
అంతేకాకుండా జనవరి ఆరవ తేదీ నుండి ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ అనే కార్యక్రమానికి కింద ఒక రిసోర్స్ పర్సన్ ని ప్రతి పాఠశాలకు పంపి IT కు సంబంధించిన ఐఎఫ్బి ట్యాబ్లు ఇంకా ఇతర ఐటి రిలేటెడ్ విషయాలలో ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉండేలా పంపించుటకు ప్రయత్నం చేస్తున్నామని తెలుపుతున్నారు*. 
అలాగే 10వ తరగతి విద్యార్థులను ఎంత సీరియస్ గా ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు కూడాను సంసిద్ధులను చేయాలని తెలిపారు.   వారు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా …  వారికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు*. 
వారిని ఇంకొక స్థాయిలో వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారని అందుకు ధన్యవాదాలు తెలియజేశారు*.
EPISODE-12 YOUTUBE LINK 

find-your-cbil-score-through-whatsapp-details

 find-your-cbil-score-through-whatsapp-details
వాట్సాప్ ద్వారా CIBIL స్కోర్ ఇలా తెలుసుకోండి

ప్రస్తుత కాలంలో ఆర్థిక అవసరాలు చాలా వరకు పెరిగాయి. వ్యక్తిగత లోన్స్, గృహ, వాహన రుణాలను తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
దీంతో పలువురు బ్యాంకులు, వివిధ ఫైనాన్స్ కంపెనీలను సంప్రదిస్తున్నారు. ఇవి CIBIL ( క్రెడిట్ స్కోర్) స్కోర్ ఆధారంగా లోన్స్‌ను అందిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా లోన్స్ పొందడానికి వినియోగదారులకు అవకాశం ఉంటుంది. అదే స్కోర్ తక్కువగా ఉంటే గనుక లోన్ పొందడం కష్టంగా ఉంటుంది. CIBIL స్కోర్ అనేది వినియోగదారులు తీసుకున్న లోన్స్‌లను సకాలంలో చెల్లించడం ద్వారా పెరుగుతుంది. సమయానికి చెల్లింపులు చేయనట్లయితే CIBIL స్కోర్ తగ్గుతుంది. దీంతో సంస్థలు లోన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, వినియోగదారుల ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించి అన్ని సంస్థలకు అందిస్తుంది. దీని ఆధారంగా సంస్థలు అర్హత ఉన్న వడ్డీ రేటు ప్రకారం రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. మరి ఇంత ముఖ్యమైన CIBIL స్కోర్‌ను సులభంగా తెలుసుకోడానికి కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
WhatsApp ద్వారా CIBIL స్కోర్‌ను తెలుసుకునే ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. WhatsAppలో క్రెడిట్ స్కోర్‌ని తెలుసుకోడానికి 9920035444 నంబర్‌ను సేవ్ చేసుకుని *”Hi”* అని మెసేజ్ చేయాలి
తరువాత చాట్‌లో వచ్చిన విధంగా పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామాను సెండ్ చేయాలి. 
వెరిఫికేషన్ పూర్తయ్యాక క్రెడిట్ స్కోర్ వాట్సాప్‌లో చూపిస్తుంది. 
కాపీ కూడా ఈ-మెయిల్ ద్వారా వస్తుంది.

thirumala-thirupathi-devasthanam-jobs-56-notification

thirumala-thirupathi-devasthanam-jobs-56-notification

TTD : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర వరకు జీతం.. అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే

TTD Tirumala Tirupati : తిరుమల తిరుపతి దేవస్థానం జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రధానాంశాలు:

  • టీటీడీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌
  • 56 ఏఈఈ, ఏఈ, ఏటీఓ పోస్టుల భర్తీ
  • నవంబర్‌ 23 దరఖాస్తులకు చివరితేది
  • TTD Tirumala Tirupati Devasthanam : తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇంజినీర్ల పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందులో ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తగిన విద్యార్హతలతో పాటు ఆసక్తి వున్న అభ్యర్థులు నవంబర్ 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొన్ని వివరాలను పరిశీలిస్తే


  • మొత్తం ఉద్యోగాలు: 56
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 27
  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)- 10
  • అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్)- 19
  • ముఖ్య సమాచారం :
  • అర్హత: బీఈ, బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌), ఎల్‌సీఈ/ ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయో పరిమితి: అప్లయ్‌ చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. 
  • TTD JOBS ONLINE REGISTRATION LINK
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • వేతన శ్రేణి: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760.. ఏఈకి రూ.48,440-1,37,220.. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.
  •  TTDER-Paper Notification
  •  TTDER-Web Notification
  •  TTDER-Syllabus for Posts – AEE,AE and ATO
  •  TTDER-User Manual
  • దరఖాస్తులకు చివరితేది: నవంబర్‌ 23, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: 
  • TTD JOBS ONLINE REGISTRATION LINK

best-cars-below-five-lakhs-details

 best-cars-below-five-lakhs-details

Best Cars Under 5 Lakhs: రూ.ఐదు లక్షలలోపు మంచి కారు కోసం చూస్తున్నారా? – ఈ టాప్-5 కార్లే బెస్ట్!

Best Cars Under 5 Lakhs in India: మనదేశంలో రూ.ఐదు లక్షలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఇవే.


Model Fuel Type Body Type Mileage Ex-Showroom Price Used Car Price
Renault Kwid Petrol Hatchback 21.4 km/l ₹4.70 – 6.33 Lakh ₹3 – 5 Lakh
Maruti Suzuki Alto K10 Petrol Hatchback 24.3 km/l ₹3.99 – 5.96 Lakh ₹3 – 4 lakh
Maruti Suzuki S-Presso Petrol Mini SUV 24.1 km/l ₹4.26 – 6.12 Lakh ₹3 – 5 lakh
Maruti Alto 800 Petrol Hatchback 22.05 km/l ₹3.54 – 5.13 Lakh ₹2- 3.5 lakh

Best Cars Under 5 Lakh in India: మనదేశంలో చాలా మంది తమ సొంత కారును కలిగి ఉండాలని కలలు కంటారు. కానీ ఎక్కువ బడ్జెట్ లేని కారణంగా, చాలా మంది కారును కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈరోజు మనం రూ.ఐదు లక్షలలోపు బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.

రెనో క్విడ్ (Renault Kwid)
రెనో లాంచ్ చేసిన ఈ ఎంట్రీ లెవల్ కారులో 799 సీసీ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇవి వరుసగా 54 హెచ్‌పీ పవర్, 68 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఫైవ్ సీటర్ కారు. ఇది మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది 270 లీటర్ల బూట్ స్పేస్‌తో దాదాపు అన్ని బేసిక్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.70 లక్షలుగా ఉంది.

మారుతీ ఆల్టో 800 (Maruti Alto 800)
మారుతి ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షలతో మొదలై రూ. 5.13 లక్షల వరకు ఉంది. ఈ కారు మార్కెట్లో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 799 సీసీ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది.

మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10)
మారుతి ఆల్టో కే10లో 998 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. దీంతో సీఎన్‌జీ కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఆల్టో కే10 మైలేజ్ వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి 24.39 కిలోమీటర్ల నుంచి 33.85 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.99 లక్షలుగా ఉంది


మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో (Maruti Suzuki S-Presso)

మారుతి ఎస్ ప్రెస్సో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఒక సీఎన్‌జీ కిట్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిని కలిగి ఉంటుంది. వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో 24.12 కిలోమీటర్ల నుంచి 32.73 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.4.64 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

మారుతి ఈకో (Maruti Eeco)
మారుతి ఈకో భారతీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర రూ. ఐదు లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. దీని బేస్ మోడల్ ఎస్‌టీడీ ఫైవ్ సీటర్ ధర రూ. 5.25 లక్షలు అయితే, టాప్ మోడల్ ఏసీ సీఎన్‌జీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.51 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్ షోరూం ధరలు. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 79.6 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఏడు సీట్ల ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

contract-employees-service-regularization-details

 contract-employees-service-regularization-details
నిరుద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉత్తర్వులు జారీ

ఏపిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.*
 జూన్ 2, 2014 నాటికి Full Time కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడి, ఈరోజు వరకు పనిచేస్తున్న వారు రెగ్యులరైజ్ అవుతారు. అలా క్రమబద్ధీకరించబడిన వారు NPS (CPS) పరిధిలోకి వస్తారు. పూర్తి వివరాలు, ఉత్తర్వుల కాపీ పేజీలో కలవు.*

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ :*
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో గెజిట్ జారీ చేశారు. దీంతో ప్రభుత్వంలోని 177 శాఖల్లో 2014 జూన్ రెండో తేదీ నాటికి చేరిన 10,117 మంది రెగ్యులరైజ్ అయ్యారు

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దసరాకు డబుల్ ధమాకా ప్రకటించింది. ఒకటేమో నిరుద్యోగులకు, మరొకటి కాంట్రాంక్టు ఉద్యోగులు.. ఇద్దరికీ పండుగ వేళ శుభవార్త వినిపించింది. ఈ మేరకు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గవర్నర్ ఆమోదం.*
★ ACT No. 30 of 2023 విడుదల.
★ జూన్ 2, 2014 నాటికి Full Time కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడి ఉండాలి.
★ అలా క్రమబద్ధీకరించబడిన వారు NPS (CPS) పరిధిలోకి వస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా.. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. అయితే.. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావటంతో.. వారి అభ్యర్థనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు


సీఎం జగన్ ఆదేశాలతో.. అన్ని విభాగాలలోని ఖాళీల వివరాలను మరోసారి పరిశీలించిన జీఏడీ.. మరో 212 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో.. మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ..

మరోవైపు.. ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు దసరా పండుగ వేళ జగన్ సర్కార్ తీపి కబురు వినిపించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అసెంబ్లీ బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. కాగా.. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియకు తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
FOR MORE DETAILS CLICK HERE

ugc-launches-whatsapp-channel-complete-details

 ugc-launches-whatsapp-channel-complete-details

UGC: యూజీసీ ‘వాట్సాప్‌ ఛానల్‌’ ప్రారంభం, విద్యార్థులకు మరింత చేరువగా సేవలు

విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు మరియు ఇతర వాటాదారులందరితో అనుసంధానం కోసం కొత్త వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ‘యూజీసీ వాట్సాప్ ఛానెల్‌’ను ప్రారంభించింది.

దేశంలోని ఉన్నత విద్యాసంస్కరణల్లో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు మరియు ఇతర వాటాదారులందరితో అనుసంధానం కోసం కొత్త వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ‘యూజీసీ వాట్సాప్ ఛానెల్‌’ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. యూజీసీ ఇండియా వాట్సాప్ ఛానెల్‌ని ప్రారంభించడం అనేది మరింత సమగ్రమైన మరియు సమాచారంతో కూడిన ఉన్నత విద్యా రంగాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు


 

సాంకేతికతను స్వీకరించడం, విస్తృతంగా ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం ద్వారా, యూజీసీ దాని కమ్యూనికేషన్ వ్యూహాన్ని ఆధునీకరిస్తోందని, దీనివల్ల అటు విద్యార్థులకు, ఇటు విద్యాసంస్థలకు రియల్‌టైమ్‌లో సమాచారం అందుతుందని పేర్కొన్నారు. విద్యా పరిపాలనలో పారదర్శకత, సమర్థతను మెరుగుపరుస్తోందని ఆయన అన్నారు. విద్యా పరిపాలనలో యాక్సెసిబిలిటీ, పారదర్శకత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించుకోవడానికి ఈ చొరవ ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. 

ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క ముఖ్య ప్రయోజనాల్లో అందరిని ఏకతాటిపైకి తేవడమే అని యూజీసీ తెలిపింది. ప్రతి ఒక్కరూ యూజీసీ వెబ్‌సైట్‌లు లేదా ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు అవాంతరాలు లేని యాక్సెస్‌ను కలిగి ఉండరని గుర్తించి, విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి వాట్సాప్ ఛానెల్ శక్తివంతమైన సాధనంగా మారుతుందని యూజీసీ తెలిపింది.

“భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో, కనెక్టివిటీ మారుతూ ఉంటుంది, ఈ చొరవ డిజిటల్ విభజనను తగ్గిస్తుంది మరియు ఉన్నత విద్యపై పాలసీ అప్‌డేట్‌లు అందరికీ తక్షణమే అందుబాటులో ఉండేలా చూస్తుంది” అని UGC తెలిపింది.

UGC said that the stakeholders can use the link to join UGC India WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaCh6c50gcfMkcXzgq1w  

how-to-get-ap-current-bill-history-download

 how-to-get-ap-current-bill-history-download
మన పాఠశాలకు కట్టిన కరెంట్ బిల్లులుమొత్తం డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్…

APCPDCL DISTRICTS GUNTUR, KRISHNA, PRAKASAM.

APSPDCL DISTRICTS. NELLORE, CHITTOOR, KARNOOL, KADAPA, ANANTHAPURAM DISTRICT.

APEPDCL DISTRICTS. SRIKAKULAM, VIJAYANAGARAM, VISAKHAPATNAM, EAST GODAVARI, WEST GODAVARI DISTRICTS

insurance-atm-card-get-5-lakhs-details

 insurance-atm-card-get-5-lakhs-details

Insurance: ₹5 లక్షల ‘ఫ్రీ’ ఇన్సూరెన్స్‌

ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

Insurance With Debit Card: మన దేశంలో మెజారిటీ జనాభాకు బ్యాంక్‌ అకౌంట్లు, ATM కార్డులు (డెబిట్‌ కార్డ్‌) ఉన్నాయి. డెబిట్‌ కార్డ్‌తో ATMల నుంచి డబ్బులు తీసుకుంటాం, ఆన్‌లైన్‌ & ఆఫ్‌లైన్‌ చెల్లింపుల కోసం ఉపయోగిస్తాం. అయితే, ఈ కార్డ్‌తో ఇంతకుమించిన బెనిఫిట్స్‌ ఉన్నాయన్న విషయం చాలామందికి తెలీదు.

ATM కార్డ్‌ విషయంలో ఎక్కువ మందికి తెలీని కీలక ఉపయోగాల్లో ఒకటి “ఉచిత బీమా కవరేజ్‌”. ఒక బ్యాంకు తన కస్టమర్‌కి ఏటీఎం కార్డు జారీ చేసిన క్షణం నుంచి, ఆ ఖాతాదారు ప్రమాద బీమా, జీవిత బీమా కవర్‌లోకి వస్తాడు. దీని కోసం కస్టమర్‌ ఎలాంటి డాక్యుమెంట్స్‌ సమర్పించాల్సిన పని లేదు, ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకులే ఆ పని చూసుకుంటాయి. ఏటా, ATM కార్డ్‌హోల్డర్‌తో సంబంధం లేకుండా బ్యాంకులే దానిని రెన్యువల్‌ చేస్తుంటాయి. ఒకవేళ, ATM కార్డ్‌హోల్డర్‌కు ఏదైనా జరిగి, ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే… బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకోవడమే గానీ, అదనంగా చేయాల్సిన పనేమీ ఉండదు. 

ATM కార్డ్ హోల్డర్ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైతే, ఆ కార్డ్‌పై ఉన్న ఇన్సూరెన్స్‌ డబ్బు అతని వైద్య ఖర్చులకు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడుంది. కార్డ్‌ యజమాని ప్రమాదంలో ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోతే… బాధితుడికి రూ. 50,000 ప్రమాద బీమా లభిస్తుంది. రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోతే లక్ష రూపాయల బీమా మొత్తం లభిస్తుంది. దురదృష్టవశాత్తు కార్డ్‌హోల్డర్‌ మరణిస్తే, లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు బీమా మొత్తం అతని కుటుంబానికి అందుతుంది.


ATM కార్డ్‌ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఒక నిబంధన ఉంది. ప్రమాదానికి గురైన కార్డుదారు, ఆ ప్రమాదానికి కనీసం 45 రోజుల ముందు ఆ ATM కార్డ్‌ను ఒక్కసారైనా ఉపయోగించి ఉండాలి. అప్పుడే క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలవుతుంది. 

కార్డు రకాన్ని బట్టి ఇన్సూరెన్స్‌ కవర్‌

బ్యాంకులు తమ కస్టమర్లకు చాలా రకాల డెబిట్‌ కార్డులు జారీ చేస్తాయి. కార్డ్ కేటగిరీని బట్టి దాని వల్ల లభించే ఇన్సూరెన్స్‌ కవర్‌ మారుతుంది. కస్టమర్లకు, ATM క్లాసిక్ కార్డ్‌ మీద రూ. 1 లక్ష, ప్లాటినం కార్డ్‌ మీద రూ. 2 లక్షలు, సాధారణ మాస్టర్ కార్డ్‌ మీద రూ. 50 వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డ్‌ మీద రూ. 5 లక్షలు, వీసా కార్డ్‌ మీద రూ. 1.5-2 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతాదార్లకు అందిన రూపే కార్డు మీద రూ. 1 నుంచి 2 లక్షల వరకు బీమా ఉంటుంది.

ఇన్సూరెన్స్‌ ఎలా క్లెయిమ్ చేయాలి?

ATM కార్డ్‌ మీద ప్రమాద బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి, సంబంధిత బ్యాంక్‌ బ్రాంచ్‌కు కార్డుదారు దరఖాస్తు చేసుకోవాలి. ప్రమాదం జరిగిందని నిర్ధరించే FIR కాపీ, హాస్పిటల్ ట్రీట్‌మెంట్ పేపర్లు సమర్పించాలి. ఒకవేళ కార్డుదారు మరణిస్తే, అతని నామినీ సంబంధిత బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డుదారు మరణ ధృవీకరణ పత్రం, FIR కాపీ, డిపెండెంట్ సర్టిఫికేట్ వంటి పేపర్లు ఇందుకు అవసరం అవుతాయి. సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదిస్తే, దీని గురించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ బెనిఫిట్‌ గురించి మీ బంధుమిత్రులందరికీ చెప్పండి. ఆపద సమయంలో వాళ్లకూ ఇది ఉపయోగపడుతుంది.

Know Your Vote Details-with-your-Mobile Number

 Know Your Vote Details-with-your-Mobile Number
Candidates have been provided the facility to easily check our details through mobile to find out whether their name is in the voter list or not

మీ యొక్క పేరు, జిల్లా, నియోజకవర్గం వివరాలు ఇచ్చి మీ ఓటు ఎక్కడ ఉంది అనే వివరాలు తెలుసుకోవచ్చు.
Search your voter I’d details using district, constituency name, voter name
కేవలం మీ యొక్క పేరు, జిల్లా, నియోజకవర్గం వివరాలు ఇచ్చి మీ ఓటు ఎక్కడ ఉంది అనే వివరాలు తెలుసుకోవచ్చు. ఈ క్రింది లింకు పైన క్లిక్ చేసి పై వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆ పేరుతో ఉన్నటువంటి అన్ని పేర్లను చూపించడం జరుగుతుంది. ప్రక్కన ఉన్న ప్రింట్ ఆప్షన్ ద్వారా save చేసుకోవచ్చు.
https://ceoaperolls.ap.gov.in/Name_Search/Search.aspx

POSTAL BALLET కు అప్లై చేయు అప్లికేషన్ ఫారo 12 D PDF CLICK HERE

 Know Your Vote
మీ అసెంబ్లీ ఓటు వివరాలు  “వీజీ గా ” తెలుసు కొనండి
 >జిల్లా
>అసెంబ్లీ నియోజకవర్గం
> డోరు నెంబరు 
>మరియు Captch code Fill చేసి 
>Search క్లిక్ చేస్తే
 మీ  ఓటు మీ కుటుంబ సభ్యుల ఓటు & Epic Card వివరాలు  తెలియును

Official website CLICK HERE
*మార్పులు చేర్పులు చేయవలసిన వారు* ఎలాంటి ఫారం వాడాలి ?
👉 *ఫారం-6 : కొత్త ఓటరు నమోదు*
👉 *ఫారం-6 A : భారత పాస్ పోర్ట్ ఉన్న విదేశాల్లో ఉన్న వారికి*
👉 *ఫారం-7 : ఓటు తొలగించటానికి, లేదా అభ్యంతరం తెలపటానికి*
👉 *ఫారం-8 : మీ కుటుంబ సభ్యుల ఓట్లు వేరే పోలింగ్‌ బూత్‌ల పరిధిలో నమోదైతే*
Note : మీ పాస్ పోర్టు ఫోటో, వయసు ధ్రువపత్రం, నివాస/చిరునామా ధ్రువపత్రాలు, మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకోండి  
ఎలా నమోదు చేసుకోవాలి ?
ఆఫ్ లైన్ లో :
👉 *ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద*
ఆన్లైన్ లో :
👉 *www.voters.eci.gov.in* లేదా 
*www.ceoandhra.nic.in* వెబ్ సైట్ కు వెళ్ళండి
సంబంధిత ఫారం సెలెక్ట్ చేసుకోండి 
ధ్రువపత్రాలను  అప్‌లోడ్ చేసి  స‌బ్‌మిట్ బ‌ట‌న్ క్లిక్ చేయండి 
అప్లికేష‌న్ నంబ‌ర్‌ను ప‌దిల ప‌రుచుకొండి 
గుర్తుంచుకోండి… 
🙏 *ఓటరు నమోదుకు ఆఖరు తేదీ April 14, 2024.

భారత ఎన్నికల కమిషన్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది*
ఓటు ఉండే ఉంటుందిలే అనే ధీమా వద్దు. ఒకసారి చెక్ చేసుకుని ఉందో లేదో నిర్ధారించుకోండి. కేవలం కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది.*
మార్పులు, చేర్పులకు అవకాశం కలదు.
మన దగ్గర ఎటువంటి డేటా లేకున్నా మన ఓటు ఉందో ? లేదో ? ఈజీ గా తెలుసుకునే విధానం
▪️ ఈ జాబితాలో మీ పేరు ఉన్నదో లేదో తెలుసుకోండి..*

*▪️మీ మొబైల్ నెంబర్ ద్వారా  ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నదో లేదో సులభంగా తెలుసుకోవచ్చు…*
*▪️మార్పులు చేర్పులకు అవకాశం కలదు…*
*ఈ క్రింది లింకు ద్వారా జాబితాలో మీ పేరు తెలుసుకోండి…
Electoral Roll Link CLICK HERE

అభ్యర్థులు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి సులభంగా మొబైల్ ద్వారా మన వివరాలు చెక్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. ఎప్పుడు మొబైల్ ద్వారా మీ యొక్క ఓటు ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు.
ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి తర్వాత లాంగ్వేజ్ ఎంపిక చేసుకోవాలి తర్వాత మీ మొబైల్ నెంబరు నమోదు చేయండి నమోదు చేసిన వెంటనే మీకు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ఎంటర్ చేసి కింద ఇవ్వబడే సెక్యూరిటీ కూడా నమోదు చేయవలసి ఉంటుంది తర్వాత మీ ఓటు యొక్క వివరాలు తెలుస్తాయి.
error: Content is protected !!