new-railway-lines-from-ap-capital-amaravathi

 new-railway-lines-from-ap-capital-amaravathi

ఈ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతికి రైల్వే లైన్..

విజయవాడ – గుంటూరు నగరాల్ని అమరావతితో అనుసంధానించే రైల్వే లైన్‌ ఎట్టకేలకు కదిలింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకూ 56 కిలో మీటర్ల కొత్త లైన్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమైంది. భూసేకరణకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది.

అమరావతి ప్రధాన స్టేషన్‌గా 9 స్టేషన్‌లు
విజయవాడ-హైదరాబాద్ లైన్‌లో ఎర్రుపాలెం వద్ద కొత్త లైన్ మొదలై అమరావతి మీదుగా గుంటూరు-విజయవాడ లైన్‌లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో మొత్తం 9 స్టేషన్లు నిర్మిస్తారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్ద స్టేషన్లు. వీటిలోనూ అమరావతి ప్రధాన స్టేషన్‌గా ఉంటుంది. ఈ లైన్‌లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట-వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు.

అమరావతిని త్వరితగతన పూర్తిచేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రారంభ సమయంలో అనేక ప్రాజెక్టులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆయా ప్రాజెక్టులను తిరిగి గాడినపెట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుంది.

గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రైల్వేలైన్ కోసం ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు ఈ రైల్వే లైన్‎కు భూసేకరణ కోసం రైల్వే శాఖ ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది. గత టిడిపి ప్రభుత్వంలోని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఈ రైల్వే లైను నిర్మించాలని నిర్ణయించారు.

అయితే ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నుంచి కొంత మొత్తంలో భూమిని ఇవ్వాల్సి ఉంది. దీంతో గత ప్రభుత్వం ఏదో ఒక కారణం చెప్పి నిధుల విషయంలో ముందుకు రాలేదని అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 56.53 కి.మీ కొత్త లైన్ వేసేందుకు అడుగులు ముందుకుపడ్డాయి. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణకు రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అమరావతి రైల్వే లైన్‎ అనుసంధానం ఇలా..


గత టిడిపి ప్రభుత్వంలో రాజధాని అమరావతిని ఓవైపు విజయవాడ.. మరోవైపు గుంటూరు రైల్వే లైన్‎లకు అనుసంధానం చేశారు. అయితే తాజాగా అమరావతి రైల్వే ప్రాజెక్టును ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 56.53 కి.మీ మేర డబుల్ లైను, అమరావతి – పెదకూరపాడు మధ్య 24.5 కి.మీ మేర సింగిల్ లైన్, సత్తెనపల్లి – నరసరావుపేట మధ్య 25 కి.మీ సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కి.మీ మేర కొత్త లైనుకు ఆమోదం పడింది. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆరేళ్ల పాటు ఎలాంటి కదలిక లేదు. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత పనుల్లో వేగం ఊపందుకుంది.

10th-international-yoga-day-2024-instructions

 10th-international-yoga-day-2024-instructions
గౌరవ PMSHRI HM లేదా ప్రిన్సిపాల్ లకు శుభోదయం. గౌరవ SPD గారు ఆదేశాలు మేరకు రేపు అనగా జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగ  సందర్భంగా మన పాఠశాలలో   కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ రోజున సూర్య నమస్కారాలు లేదా యోగాసనాలు లేదా యోగాలో నిష్ణాతులైన వారిచే యోగా యొక్క ప్రాముఖ్యత సెమినార్లు నిర్వహించి వాటి యొక్క వీడియోస్, స్కిట్స్, photos గాని మీకు పంపించిన ట్రాకర్ నందు పంపవలెను. ప్రతి PD లేదా PET ఈ కార్యక్రమం చేయించవలెను. PMSHRI స్కూల్స్ నందు స్కూల్ PMSHRI బ్యానర్ ఖచ్చితంగా ఉండాలి.ఈ కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ కోరుకుంటూ  సమగ్రశిక్ష,
GOOGLE LINK CLICK HERE
International Yoga Day 2024: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు?
యోగాతో లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. జూన్ 21న శ్రీనగర్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. “యోగం” అనే పదం సంస్కృత మూలం “యుజ్” నుండి వచ్చింది, దీని అర్థం “చేరడం,” “కలయిక”, లేదా “ఏకం చేయడం”. మనస్సు – శరీరం, లేదా ఆలోచనలు – చర్యలు లేదా సంయమనం- సంతృప్తి లేదా మానవులు – ప్రకృతి మధ్య సామరస్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు. శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతాయి.
INTERNATIONAL YOGA DAY  Mass Surya Namaskar Demonstration (Virtual)
Special story on International Yoga Day & Importance and Benifits of yoga CLICK HERE
2024 సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ “యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ”.
జూన్ 21 న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రాచీన భారతదేశం నుండి ప్రపంచ సాధన వరకు యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది.ఆరోగ్యపరంగా యోగా యొక్క విశిష్టతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలను నొక్కి చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలోచనను ప్రతిపాదించారు.
ఆరోగ్య ప్రయోజనాలు 
యోగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోజూవారీ పని ఒత్తిడి, ఆందోళన నిరాశకు మానసిక ఒత్తిళ్లకు మంచి ఔషధంగా యోగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు,దీర్ఘకాలిక నొప్పులనుంచి విముక్తి పొందేందుకు,యోగా ఒక చక్కటి సాధనంగా పనిచేస్తుందని వైద్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అంతర్జాతీయ యోగ దినోత్సవ ప్రోటోకాల్  21 ప్రార్థన
A. సూక్ష్మ వ్యాయమాలు (చాలన క్రియలు)
మెడ
భుజాలు
మోచేతులు
మణికట్టు
నడుము
మోకాళ్ళు
మడమలు సంబందించిన wormups చేయాలి.
B. ఆసనాలు
(నిలబడి)
తడాసన
వృక్షాసన
పాదహస్తాసన
అర్థచక్రాసన
త్రికోణాసన
కూర్చోని(sitting)
భద్రాసనం
వజ్రాసన
వీరాసన
అర్థఉష్ణ్రాసన
ఉష్ణ్రాసన
శశాంకాసన
ఉత్తానమండూకాసనం
వక్రాసన
బోర్లాపడుకొని(prone)
మకరాసనం
భుజంగాసనం
శలభాసనం
వెల్లకిలా(Supine)
సేతు బంధాసనం
ఉత్తన పాదాసనం
అర్థహలాసనం
పవనముక్తాసనం
శవాసనం
C . ప్రాణాయమాలు
కపాలభాతి
అనులోమా విలోమా
(నాడి శోధన)
శీతలీ
భ్రామరి
D.ధ్యానం
E.సంకల్పం
నేను నా మనసును ఎల్లపుడూ సంతులితంగా ఉంచుకుంటాను .   ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది .    నేను నా పట్ల , నా కుటంబం పట్ల , నా పని పట్ల , నా సమాజం పట్ల , ప్రపంచం పట్ల  శాంతి , ఆనందము , ఆరోగ్య విషయములందు కర్తవ్యబద్దుడనై ఉంటాను .
International Day of Yoga 21.06.2024.pdf CLICK HERE

good-news-ap-inter-students

 good-news-ap-inter-students

Andhra Pradesh: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్‌లు అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న విధానంలోనే వీరికీ అందించాలని మంగళవారం వెలువరించిన ఆదేశాల్లో పేర్కొంది.

ఇంకా రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయంలో అడుగు పెట్టలేదు. అయినా తాను చేపట్టిన విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు యువనేత నారా లోకేష్. ఈనెల 15వతేదీన ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే విద్యార్థులకు గత వైసిపి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం నిలిపివేసిందని తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. పుస్తకాలు లేకుండా పేద విద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే ఇంటర్ విద్యార్థలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ తోపాటు బ్యాక్ ప్యాక్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.

జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించడంతో అధికారులు ఆగమేగాలపై మంగళవారం జీవో ఎం.ఎస్. నెం.28ని విడుదల చేశారు. త్వరలోనే పుస్తకాలు పంపిణీ కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.  గవర్నమెంట్ జూనియర్‌ కళాశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు, హైస్కూల్‌ ప్లస్‌ల్లో కలిపి మొత్తం 2,00,753 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరికి జులై 15లోపు ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలు బ్యాగ్, టెక్ట్స్ బుక్స్ అందించాలని గవర్నమెంట్ సూచించింది.

ap-eamcet-2024-college-predictor

 ap-eamcet-2024-college-predictor
AP EAPCET 2024 RESULTS CLICK HERE
AP EAMCET Counselling 2024 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి.. ఏపీ ఈఏపీసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ జులై 1 నుండి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి.నవ్య తెలిపారు. ఆన్ లైన్ విధానంలో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లిపు ప్రక్రియ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. జులై 7వ తేదీ లోపు పూర్తి చేయవలసి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ చూడొచ్చు.
AP EAMCET 2024 లో మీకు వచ్చిన ర్యాంక్‌కు ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో.. సీటు వస్తుందంటే..?

AP EAPCET 2024 Admissions (MPC Stream) Notification Released for Certificate Verification, Web Counselling*
★ ఏపీ ఇంజనీరింగ్‌ (బి.ఈ/బీటెక్) ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.
*★ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు:* జులై 01 నుంచి జులై 7 వరకు.
*★ ధ్రువపత్రాల పరిశీలన:* జులై 04 నుంచి జులై 10 వరకు. 
కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు: జులై 08 నుంచి జులై 12 వరకు.
*★ ఐచ్ఛికాల మార్పు:* జులై  13
*★ సీట్ల కేటాయింపు:* జులై  16
*★ కళాశాలల్లో రిపోర్టింగ్:* జులై 17 నుంచి జులై 22 వరకు.
*★ తరగతులు ప్రారంభం:* జులై 19 నుంచి
AP EAMCET OFFICIAL WEBSITE LINK CLICK HERE

ఎంసెట్ లో మీకు ఏ BRANCH లో సీటు వస్తుంది..? మీ ర్యాంక్ కి మీరు అనుకున్న కళాశాలలో మీకు సీటు వస్తుందా? విద్యార్థుల్లో ఇలాంటి ఉత్కంఠ కనిపిస్తోంది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏటా ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా మీకు సరికొత్త EAPCET 2024 కాలేజ్ ప్రిడిక్టర్‌ని అందిస్తుంది, ఇది మీకు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో .. ఏ బ్రాంచ్‌లో ర్యాంక్ వస్తుంది అని అంచనా వేస్తుంది. EAPCET-2023లో ఏ కాలేజీలో.. ఏ బ్రాంచ్‌లో ఇచ్చిన ర్యాంక్.. EAPSET 2024 కౌన్సెలింగ్‌లో మీకు దాదాపు అదే వచ్చే అవకాశం ఉందని అధికారిక లెక్కల ప్రకారం  మీ కోసం ప్రత్యేకంగా ఈ సమాచారాన్ని అందిస్తోంది.

AP EAPCET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది LINK-1  ఇక్కడ  క్లిక్ చేయండి

AP EAMET ఏ రాంక్ కి ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వస్తుంది LINK-2 ఇక్కడ క్లిక్ చేయండి 

AP EAPCET-2024 MOCK COUNSELING PREDOCTOR (FOR AGRICULTURE) CLICK HERE

WEBSITE ని సందర్శించండి

స్టెప్ 1: పై  లింక్ పై క్లిక్ చేయండి

స్టెప్ 2: మీ ర్యాంక్‌ను నమోదు చేయండి మరియు మీ లింగం, వర్గం, కోర్సు మరియు అందుబాటులో ఉన్న ఇతర ఎంపికలను ఎంచుకోండి.

సబ్మిట్ పై క్లిక్ చేయండి

చివరి దశ : ఎంపిక చేసిన బ్రాంచ్‌కు సంబంధించి ప్రిడిక్టెడ్ కాలేజీలు ప్రదర్శించబడతాయి

కౌన్సెలింగ్ సమయంలో ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగించబడే జాబితాను సేవ్ చేయండి లేదా ప్రింటవుట్ తీసుకోండి.

ec-instructions-on-the-counting-of-postal-ballot-votes

ec-instructions-on-the-counting-of-postal-ballot-votes

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కీలక సూచనలు చేసిన ఈసీ.. అవేమిటంటే?
Election Commission : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో గతంకంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లుకూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సుమారు 5లక్షల40వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఇదిలాఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్ కుమార్ మీనా పంపించారు.
ఎన్నికల సంఘం సూచనలు ఇవే..
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ (Form 13 A ) పై అటెస్టేషన్ & స్టాంప్  పొందుపరచటం   , పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు పై ECI వారి తాజా మార్గదర్శకాలు*
1) PB డిక్లరేషన్ (Form 13 A) పై అటెస్టింగ్ అధికారి యొక్క సీల్ (స్టాంప్) లేకపోయినప్పటికీ….. అటేస్టింగ్ అధికారి పేరు , వివరాలు పొందుపరచబడినట్లయితే అట్టి PB చెల్లుబాటవుతుంది.
2) Form 13 A పైన ఆ టెస్టింగ్ అధికారి సంతకం అసలైనదా /కాదా అని సరిచూచుటకు వారి యొక్క పేరు తదితర వివరాలతో కూడిన స్పెసిమన్ సంతకాలను జిల్లా ఎన్నికల అధికారి అన్ని జిల్లాలకు పంపుతారు.
3) PB వెనుక వైపు సంతకం / Facsimile పొందుపరచటం RO /ARO ల బాధ్యత. అటువంటి సందర్భాలలో  PB S No. మరియు కౌంటర్ ఫోయిల్ S No. రెండు సరి చూసి  సరైన PB అని నిర్ధారించవచ్చు. ఒకవేళ అట్లు సరిపోనియెడల అది చల్లని PB గా పరిగణించవచ్చు.
4) ఒకవేళ వెలుపలి కవర్ B (Form 13 C) పై ఓటర్ సంతకం లేనప్పటికీ……  డిక్లరేషన్ (13A) పై వాటర్ యొక్క ఐడెంటిటీ సరిచూసి  సదరు PB ని చెల్లుబాటు చేయవచ్చు…
*5) లోపలి కవర్ (Form 13 B) తెరవకుండానే  ఈ క్రింది సందర్భాలలో PB ని రిజెక్ట్ చేయవచ్చు….*
— కవర్ B (Form 13 C) నందు డిక్లరేషన్ లేనప్పుడు
— డిక్లరేషన్ పై ఓటర్ సంతకం లేదా అటెస్టింగ్ అధికారి సంతకం లేనప్పుడు
— డిక్లరేషన్ (Form 13 A) లో పొందుపరిచిన పి.బి నెంబర్ మరియు లోపలి కవర్ A (Form 13 B) లో ఎండార్స్ చేయబడిన నెంబర్ వేర్వేరుగా ఉన్నప్పుడు..
5) లోపలి కవర్ B (Form 13 B) తెరిచిన పిదప కింది సందర్భాలు ఉత్పన్నమైతే PB ని రిజెక్ట్ చేయవచ్చు….
— PB పై ఎట్టి ఓట్ చేయనప్పుడు
— ఒకటికంటే ఎక్కువ అభ్యర్థులపై ఓట్ చేసినప్పుడు
— PB నకిలీది అయినప్పుడు
— PB చిరిగిపోయినప్పుడు
— ఏ అభ్యర్థికి ఓటు చేశారో చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు
— ఓటర్ ని గుర్తుపట్టేలా ఇతర రాతలు PB పై ఉన్నప్పుడు….

• గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ను చెల్లని ఓటుగా పరిగణించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
• ఫాం 13Aపై ఆర్వో సంతకం సహా పూర్తి వివరాలు నింపిఉంటే స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
• పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై ఆర్వో సంతకం సహా బ్యాలెట్ ను ధృవీకరించేదుకు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది.
• పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం-సీ పై ఓటరు సంతకం లేదని బ్యాలెట్ ను తిరస్కరించ రాదని వెల్లడించింది.
• ఫాం 13Aలో ఓటర్ సంతకం లేకపోయినా, గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా బ్యాలెట్ తిరస్కరించరాదు.
• పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా, ఆ ఓటు తిరస్కరణ కు గురి అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
AP ELECTION COMMISSION PROCEEDINGS FOR POSTAL BALLAT CLICK HERE

corrections-in-10th-class-marks-memos

corrections-in-10th-class-marks-memos
AP DGE Sri Devananda reddy sir regarding SSC Marks Short  Memos mistakes
SSC Marks memo లో ఏమైనా తప్పులు ఉంటే సంభందిత ప్రదానో పాధ్యులు correction కొరకు SSC  board లొ సంప్రదించవలసిన వారి అడ్రస్
It is hereby that, the SSC Public Examinations, March 2024 were held from 18.03.2024 to 30.03.2024 and the results were declared on 22.04.2024 and the Short Memos (Memorandum of Subject-wise Marks) are hosted on the website from 01.05.2024.
HIGH SCHOOL HEADMASTER COVERING LETTER PDF CLICK HERE
Any corrections identified by the Headmaster or Parents in the Short Memos shall be addressed to the Name & Address of the concerned Officers as said in the table below:


Hence, the Head Masters of all the Schools are hereby instructed to furnish the required corrections if any:
a) Evidence of School Records duly attaching to the Nominal Rolls.
b) A Copy of the Short Memo (Memorandum of Subject wise Marks) attested by the Head Master.
The above said documents shall be sent to the Office of Director of Government Examinations, A.P., Vijayawada on or before 10th June 2024.
DIRECTOR, BSE, AP PROCEEDINGS PDF CLICK HERE

Process To Know Your Payment-pfms

 Process To Know Your Payment-Public-finance-management-system-pfms
Inspire Manak  కు ఎంపికైన విద్యార్థులకు Rs.10,000/- వారి వారి ఖాతాలలో జమ జరుగుతున్నాయి.
విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో వారి వారి ఖాతా లో నగదు జమ కావడం జరిగిందో లేదో తెలుసుకోవచ్చు.
Status కూడా తెలుసుకోవచ్చు.
MOST URGENT: UPDATE BANK DETAILS , Aadhar & STUDENT DETAILS IMMEDIATELY.

Scholarships are of a great Scheme for the students who are not able to pay their fees because of financial poverty.

Public Financial Management System

Scheme Wise Contact List For PFMS

You may also take help from the experts if you want information related to any specific scheme about specific things. Here is the procedure which you have to follow to know the number of the concerned department or person scheme-wise:

ఏ కారణం వల్ల 10,000/ అమౌంట్ డిపాజిట్ అవ్వలేదో చెక్ చేసుకోండి
2023- 24 విద్యా సంవత్సరంలో ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రాంకి ఎంపికైన అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గైడ్ టీచర్లుకు నమస్కారం.
మీ పాఠశాలలో విద్యార్థులు ఇన్స్పైర్  ప్రోగ్రామ్కి ఎంపికైనప్పటికీ కూడా సంబంధిత ఖాతాలలో కొంతమందికి అమౌంట్ పదివేల రూపాయలు జమ చేయబడలేదు. 
దానికి కారణం బ్యాంకు వివరాలు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్, స్టూడెంట్ డీటెయిల్స్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వలన అమౌంట్ జమ చేయబడలేదని ఇన్స్పైర్ అథారిటీ వారు తెలియజేస్తున్నారు. 
కావున మీరు  మీ   బ్యాంకు వివరాలను విద్యార్థి వివరాలను ఏవైతే  ఈ లిస్టులో పొందుపరిచి ఉన్నారో వాటిని మీ స్కూల్ ఇన్స్పైర్ లాగిన్ ద్వారా  అప్డేట్ చేయాలి.
మీరు వెంటనే అప్డేట్ చెయ్యకపోతే అమౌంట్ పడదు .
అప్డేట్ చేయని పాఠశాలలు వెంటనే అప్డేట్ చేయవలసిందిగా కోరుచున్నాము.

Process To Know Your Payment

To Know your payment in the scholarship you need to follow the simple steps given below:-

  • The candidate who want to check to know their scholarship payment status firstly they have to visit at the official website
  • Now at the homepage of the official website, you will get Know Your Payment Options.
  • On the webpage, enter the asked information.
  • Click on search

Know Your Paymen CLICK HERE

Track NSP Payments

  • First of all, you have to go to the official website of the public financial management system
  • The home page will open in front of you
  • On the homepage, you are required to click on track NSP payment
  • A new page will be displayed before you where you have to enter Bank name and account number or NSP application ID and captcha code
  • After that, you have to click on the search
  • NSP payment details will be on your computer screen

Know Your Paymen CLICK HERE

how-to-file-income-tax-return-in-it-website

 how-to-file-income-tax-return-in-it-website
Income Tax Return 2024: ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయాలి?
2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి 31 జూలై 2024 వరకు సమయం ఉంది. ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ లేదా యజమాని నుండి ఫారం 16ని సేకరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను కోసం ఫారమ్‌లను విడుదల చేసింది..

2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి 31 జూలై 2024 వరకు సమయం ఉంది. ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ లేదా యజమాని నుండి ఫారం 16ని సేకరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను కోసం ఫారమ్‌లను విడుదల చేసింది. మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించాలనుకుంటే మీరు దానిని కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఐటీఆర్‌ని ఆన్‌లైన్‌లో ఫైల్ చేసే దశల వారీ పద్ధతిని ఇక్కడ తెలుసుకుందాం. దీని ద్వారా ఐటీఆర్‌ కొన్ని నిమిషాల్లో సమర్పించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా దాఖలు చేయాలి?
  • ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందుగా మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీరు ఆదాయపు పన్ను వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/కి వెళ్లాలి.
  • ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ పాన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.
  • దీని తర్వాత మీరు ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌పై క్లిక్ చేయాలి.
  • తదుపరి దశలో మీరు అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలి. మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ ఫైల్ చేస్తున్నట్లయితే మీరు అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2024-25ని ఎంచుకోవాలి.
  • దీని తర్వాత వ్యక్తిగత హెచ్‌యూఎఫ్‌, ఇతర ఎంపికలు అందుబాటులో ఉంటాయి. మీరు మీ ఐటీఆర్‌ కోసం ‘వ్యక్తిగత’పై క్లిక్ చేయవచ్చు.
  • దీని తర్వాత ఐటీఆర్‌ రకాన్ని ఎంచుకోవాలి. భారతదేశంలో 7 రకాల ఐటీఆర్‌లు ఉన్నాయి. హెచ్‌యూఎఫ్‌ కోసం ఐటీఆర్‌ 1 నుండి 4 ఫారమ్‌లు.
  • తదుపరి దశలో మీరు ఐటీఆర్‌ కోసం రకం, కారణాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ మీరు ప్రాథమిక మినహాయింపు కంటే ఎక్కువ పన్ను విధించదగిన ఆదాయం వంటి ఎంపికలను ఎంచుకోవలసి ఉంటుంది. నిర్దిష్ట ప్రమాణాలు చేర్చాలి. ఇక్కడ మీరు కింద ఇచ్చిన చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయాలి.
  • ప్రీ-ఫీల్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి. ఇక్కడ మీరు పాన్, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, సంప్రదింపు సమాచారం, బ్యాంక్ వివరాలను ధృవీకరించాలి. ఇక్కడ మీరు ఆదాయం, పన్ను, మినహాయింపు మినహాయింపు వివరాలను ఇవ్వాలి. దీని తర్వాత మీరు మీ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ధృవీకరించాలి. వివరాలు ఇచ్చిన తర్వాత పన్ను మిగిలి ఉంటే చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ పత్రాలు అవసరం

  • పాన్, ఆధార్ కార్డ్
  • బ్యాంకు వాగ్మూలం
  • ఫారం 16
  • విరాళం స్లిప్
  • పెట్టుబడి, బీమా పాలసీ చెల్లింపు రసీదులు, గృహ రుణ చెల్లింపు సర్టిఫికేట్ లేదా రసీదు.
  • వడ్డీ సర్టిఫికేట్
OFFICIAL INCOMETAX WEBSITE CLICK HERE
E-filing చేసేటప్పుడు గుర్తించు* *కోవలసిన కొన్ని ముఖ్య విషయాలు….*
*1.  ప్రొఫైల్ లొ ఎమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే, చేసుకోవాలి, like, address, phone number mail ID,*
*2.  మీరు కొత్త PASPORT తీసుకొని ఉంటే, ఆ డిటైల్స్ కూడా ఎంటర్ చేయాలి.*
*3.  Salary income gross amount correct గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేయాలి, ఒక వేళ NPS employee అయితే, gross amount కు employer contribution కూడా add చేయాలి. కొన్ని income tax software లతో, income from other sources కింద చూపించారు. ఇది కరెక్ట్ కాదు, ఒకే employer, salary DA, HRA, NPS ఇస్తున్నాడు కావున, 17(1), 17(2) ప్రకారం NPS AMOUNT add చేయాలి. 80CCD (2) కింద deduct చేయాలి.*
*4.)ఎవరైతే పర్సన్ విత్ dissability ఉన్నారో & 80DD, 80U కింద మినహాయింపు కోరుతున్నారో, వారు తప్పనిసరిగా 10-IA form, నీ ఫైల్ income tax forms నందు అప్లోడ్ చేయాలి.*
*5) మీకు ఏమైనా refund amount ఎమైనా వచ్చేది ఉంటే, july-31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత, చేస్తే, ఫైన్ తర్వాత ఇంకా ఎమైనా మిగిలి ఉంటే, ఆ refund రాదు. 89(1) కింద 10E file చేసి refund పొందగోరే వాళ్లు కూడా july-31 లోపలే చేసుకోవాలి. Dead line పొడిగించబడదు.*
*6.  TDS amount 26AS లొ reflect అయ్యకనే E-filing కి వెళ్ళాలి., అవసరం అయితే, 26AS, AIS,print/pdf తీసుకోవాలి. బ్యాంక్ SB/FD interest ఎమైనా ఉంటే, వాళ్ళ రూల్ ప్రకారం 10%tds కట్ చేస్తారు. మనం ఎమైనా అదనంగా ఉంటే , e-filing అప్పుడే చాలన్ పే చేసి, e-filing complete చేయాలి.*
*7.ఇతరుల మాటలు గుడ్డి గా నమ్మి, హెల్త్ /ట్రీట్మెంట్ /హాస్పిటల్ బిల్స్ అని చెప్పి 80DDకింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్ లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికీ వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేక పోతే సెక్షన్ 133(6) కింద మి assessing officer ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే, అవి సెక్షన్ కిందికి రాదు అంటే, పెనాల్టీ+tax రెండు పే చేయాలి.*
*8.) నా దృష్టికి వచ్చిన కొంత మంది నోటీస్ లలో, HRA proof కూడా అడిగారు, అంటే రెంట్ అగ్రిమెంట్, form-12BA, సైన్ విత్ DDO, and original form -16 ( traces). And all deduction proof. For three years, notice one years ki వస్తె, ప్రూఫ్ 3 years కి అడుగుతున్నారు.*
*9.ఎవరి ఇయర్ మన tax మి bar graph ద్వారా అనలైజ్ చేస్తున్నారు, మి ప్రిఫైల్ ఓపెన్ చేసి  రైట్ సైడ్ కింది భాగాన observe చేయవచ్చు.*
*10. TDS July-31 వరకు కూడా కాకపోతే, nil tax return file చేయండి, 234F కింద ఫైన్ పడదు, TDS తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే, సరిపోతుంది.*
*11. మీరు తీసుకున్న హోం LOAN INTEREST ను, కరెక్ట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి, 2L వరకు, 24B, ఆ తర్వాత, 80EE, 80EEA, మి లౌన్ సాంక్షన్ డేట్ నీ బట్టి ఎంటర్ చేయండి.*
*12. ఇంకా ఏమైనా పాత నోటీస్ లు ఉన్నాయేమో చెక్ చేయండి,*
*13. 80G కింద ఎమైనా అమౌంట్ contribute చేసి ఉంటే, మి దోనర్ దగ్గర ఆన్లైన్ receipt దగ్గర పెట్టుకోండి.*
*14. నాకు ఉన్న అవగాహన ప్రకారం మనం EHS కింద contribute చేసే amount 80G kinda చూపాలి, ఎందుకంటే, 80D అనేది హెల్త్ ఇన్స్యూరెన్స్, అది IRDAI, నిర్దేశించిన హెల్త్ insurence company లకే వర్తిస్తుంది.మనం చేసేది, ఎంప్లాయీస్ హెల్త్ scheme(EHS) not health insurance..*
*15. ఏ emoloyee కానీ,సెక్షన్ 80DD & సెక్షన్80U రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు. ఒకటి మాత్రమే.*
*16. Process అయ్యాక 143(1) నోటీస్ వచ్చింది అంటే, మనం సేఫ్ సైడ్ అదే మనకు 143(2) వస్తె, మనం రిస్క్ లొ ఉన్నట్లే, మన చేసిన e-filing, assessing officer మరింత సమాచారం కావాలి, మీరు గతం లొ తీసుకోని మినహాయింపులు తీసుకున్నారు అని, హెచ్చరిక ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి.*
*17. Income tax లొని section లు, కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటాయి, కానీ అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వాలి, high value, transactions జరిగిన, ఇట్టే AIR లొ తెలిసిపోతుంది,*
*18. E-filing complete అయ్యాక మళ్ళీ Declaration బాగా చదవండి, పూర్తిగా నేనే బాధ్యుని( ఆధార్ OTP) sender. అని అర్థం.*
*19. 120 డేస్ లోపల మీకు రావలసిన రెఫండ్ రాలేదు అంటే, 18004190025 కి సంప్రదించి హిందీ/ఇంగ్లీష్ లో కంప్లైట్ రైస్ చేయాలి*

ITR 2024-changes-in-AIS-IT Return 2024

 

ITR 2024: AISలో వచ్చిన కొత్త మార్పుతో టాక్స్‌పేయర్లకు వచ్చే ప్రయోజనమేంటి?
IT Return 2024: ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ముందు AISని క్రాస్‌ చెక్‌ చేస్తే, రిటర్న్‌లో తప్పులు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం ఆదాయ పన్ను రిటర్న్‌లు జోరుగా దాఖలవుతున్నాయి. ఈ ఏడాది ఫైలింగ్‌ సీజన్ ప్రారంభమైన తర్వాత, ఇప్పటివరకు 10 లక్షలకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. ITR సమర్పించేందుకు 31 జులై 2024 వరకు సమయం ఉంది.

ఈ సంవత్సరం, పన్ను చెల్లింపుదార్లకు మరింత వెసులుబాటు కల్పించేలా, AISకు సంబంధించి, ఆదాయ పన్ను విభాగం పెద్ద మార్పు తీసుకువచ్చింది.

AIS అంటే ఏమిటి?
AIS అంటే వార్షిక సమాచార ప్రకటన (Annual Information Statement). పన్ను చెల్లింపుదార్లకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కరించగల డాక్యుమెంట్‌ ఇది. ఈ పత్రంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి సంపాదించిన మొత్తం ఆదాయ వివరాలు ఉంటాయి. కొన్నిసార్లు, పన్ను చెల్లింపుదారుకు తెలీకుండానే మరికొన్ని మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. ఉదాహరణకు సేవింగ్స్‌ అకౌంట్‌ మీద వడ్డీ ఆదాయం. ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ముందు AISని క్రాస్‌ చెక్‌ చేస్తే, రిటర్న్‌లో తప్పులు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

పన్ను విధించదగిన మొత్తం ఆదాయం గురించిన మొత్తం సమాచారం AISలో కనిపిస్తుంది. జీతం కాకుండా ఇతర మూలాల నుంచి వచ్చిన ప్రతి ఆదాయ వివరం ఇందులో ఉంటుంది. దీంతోపాటు TIS ‍‌(Taxpayer Information Summary) అనే మరో డాక్యుమెంట్‌ కూడా ఉంటుంది. ప్రాథమికంగా AIS సారాంశమంతా TISలో ఉంటుంది.

AISలో వచ్చిన మార్పు ఏంటి?
పన్ను చెల్లింపు వ్యవస్థను పారదర్శకంగా మార్చడానికి  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వార్షిక సమాచార ప్రకటనలో కొత్త ఫంక్షన్‌ను జోడించింది. దీనివల్ల, పన్ను చెల్లింపుదార్లు AISలో కనిపించే ప్రతి లావాదేవీపై తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు, స్టేటస్‌ను చెక్‌ చేయవచ్చు. ఇప్పటివరకు, పన్ను చెల్లింపుదారు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే సౌకర్యం మాత్రమే ఉండేది.

AISలో వచ్చిన మార్పు వల్ల ఉపయోగం ఏంటి?
కొత్త మార్పు గురించి మరింత వివరంగా చెప్పుకుందాం. పన్ను చెల్లింపుదారు AISలోని ఏదైనా లావాదేవీ విషయంలో పొరపాటు/ లోపాన్ని కనుగొంటే, గతంలో అతను ఫీడ్‌బ్యాక్‌ మాత్రమే ఇవ్వగలిగేవాడు. ఆ ఫీడ్‌బ్యాక్‌పై అవతలి పక్షం ఎలాంటి చర్య తీసుకుందో టాక్స్‌పేయర్‌కు అర్ధమయ్యేది కాదు. ఇప్పుడు, పన్ను చెల్లింపుదారు తన ఫీడ్‌బ్యాక్‌ మీద అవతలి పక్షం స్పందనను (స్టేటస్‌) చూడడంతో పాటు, ఎలాంటి చర్య తీసుకున్నారో తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఫలితంగా, ఒకవేళ AISలో ఏదైనా తప్పు దొర్లితే సరిదిద్దవచ్చు. ఈ ప్రక్రియపై రియల్‌ టైమ్‌ అప్‌డేట్స్‌ కూడా పొందుతారు. దీనివల్ల, ఆదాయ పన్ను విభాగం – పన్ను చెల్లింపుదారుల మధ్య పారదర్శకత పెరుగుతుంది. వివాదాలు, కోర్టు కేసులు తగ్గుతాయి.

AISని ఎలా చూడాలి/ డౌన్‌లోడ్ చేయాలి?
ఆదాయ పన్ను ఫైలింగ్ పోర్టల్‌ www.incometax.gov.in లోకి వెళ్లండి.
యూజర్‌ ఐడీ (PAN), పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
అప్పర్‌ మెనులో సర్వీసెస్‌ ట్యాబ్‌ మీద క్లిక్‌ చేయండి.
డ్రాప్‌డౌన్‌ మెను ఓపెన్‌ అవుతుంది. అందులో, ‘యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌’ (AIS) ఎంచుకోండి.
ప్రొసీడ్‌పై క్లిక్ చేసిన వెంటనే మరో విండో ఓపెన్ అవుతుంది.
కొత్త విండో పేజీలో AIS ఆప్షన్‌ ఎంచుకోండి.
ఇక్కడ, AISను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది.
AISని PDF లేదా JSON ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

new-update-in-income-tax-notice-column

 new-update-in-income-tax-notice-column
ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. ITR పోర్టల్‌లో కొత్త ఫీచర్లు.. ఇక నోటీసులొచ్చినా నో టెన్షన్!
Income Tax: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించింది ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం. ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు, లెటర్లు, డిమాండ్ నోటీసులు, మెసేజ్‌లు వచ్చినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. వాటికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో తెలియక సతమతమవుతుంటారు. ఇకపై అలాంటి టెన్షన్లు ఉండవంటున్నారు ట్యాక్స్ నిపుణులు. ఐటీఆర్ పోర్టల్‌లో రెండు కొత్త ఫీచర్లు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఐటీ శాఖ. ఇ-ప్రొసీడింగ్స్ ట్యాబ్‌లో కొత్త ఫీచర్లను జోడించింది. పెండింగ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ గల ట్యాక్స్ పేయర్లకు ఈ కొత్త ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వారికి సంబంధించిన పెండింగ్ ప్రొసీడింగ్స్ సమాచారాన్ని ఈజీగా సర్చ్ చేసి వాటికి సమాధానం ఇవ్వవచ్చు. ఈ మేరకు తరుచూ అడిగే ప్రశ్నలకు సమాధానాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ట్యాక్స్ నోటీసులు, లెటర్లు, డిమాండ్ నోటీసులకు ఈజీగా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే సమాధానం ఇచ్చేందుకు ఇ-ప్రొసీడింగ్స్ ట్యాబ్ లో కొత్త ఫీచర్లు జోడించినట్లు తెలిపింది.

అతిగా స్క్రోలింగ్ అవసరం లేదు..

ఒక నిర్దిష్ట ప్రొసీడింగ్ కోసం శోధిస్తున్నప్పుడు పోర్టల్‌లో ఎక్కువగా స్క్రోలింగ్ చేయాల్సిన అవసరాన్ని తొలగించేందుకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక పేజీలను తీసుకొచ్చింది. ఈ మార్పును అమలు చేయడానికి ముందు బహుళ ప్రొసీడింగులను నావిగేట్ చేయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేందని, పన్ను చెల్లింపుదారులు, వారి అధీకృత వినియోగదారులు సంబంధిత ప్రొసీడింగులకు వెళ్లేటప్పుడు అవాంతరాలను ఎదుర్కొంటున్నారని ట్యాక్స్ నిపుణులు చెప్పారు. ఇకపై అలాంటి సమస్యలు ఉండవంటున్నారు.

ఈజీ సర్చ్ కోసం కొత్త ఫిల్టర్లు..

తమ పెండింగ్ ప్రొసీడింగులను ఈజీగా తెలుసుకునేందుకు కొత్త ఫిల్టర్లు తీసుకొచ్చింది ఐటీ శాఖ. ప్రొసీడింగ్ స్టేటస్, అసెస్మెంట్ ఇయర్, ప్రొసీడింగ్ డేట్, నోటీస్ తేదీలు, వంటి ఆధారంగా కొత్త ఫిల్టర్లు పని చేయనున్నాయి. వీటిని ఉపయోగించి ట్యాక్స్ పేయర్లు తమ ప్రొసీడింగులను తెరిచి, చెక్ చేసుకుని వాటికి తగిన విధంగా స్పందించవచ్చని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చాలా ఈజీగా ఇంటి నుంచే పని పూర్తి చేయవచ్చని చెబుతున్నారు.

ఇ-ప్రొసీడింగ్స్ ట్యాబ్ ఎలా గుర్తించాలి?

  • ముందుగా మీ వివరాలతో ఐటీఆర్ ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి లాగిన్ కావాలి.
  • పెండింగ్ యాక్సన్స్ లోకి వెళ్లి ఇ-ప్రొసీడింగ్స్ పై క్లిక్ చేయాలి.
  • మీకు ఎలాంటి ఇ-ప్రొసీడింగ్స్ లేకుంటే అక్కడ ఏ వివరాలు కనిపించవు. మీకు ఎవైనా పెండింగ్ ప్రొసీడింగ్స్ ఉంటే.. వాటి వివరాలు కనిపిస్తాయి. అందులోంచి మీకు కావాల్సినవి ఎంచుకుని సమాధానం ఇవ్వవచ్చు.

internet-is-slow-on-your-phone-change-these-settings

 internet-is-slow-on-your-phone-change-these-settings

Internet Speed : మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ స్లోగా ఉందా..? అయితే.. ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

How to Increase Your Internet Speed : నేటి సాంకేతిక కాలంలో ఇంటర్నెట్‌ అనేది మనందరి జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నిద్రలేచింది మొదలు.. నిద్రపోయే వరకు నిత్యజీవితంలో అనేక పనులు ఇంటర్నెట్‌ ఆధారంగా మొబైల్‌తోనే చేస్తున్నాం. పాల ప్యాకెట్‌ దగ్గర నుంచి రెంట్‌ పే చేయడం, డబ్బు లావాదేవీలు, కొనడాలు, సినిమాలు, గేమ్స్‌ వంటి అనేక పనులు ఇంటర్నెట్‌ లేకుండా సాధ్యం కాదు. అయితే కొన్నిసార్లు ఇంటర్నెట్ వేగం సడెన్‌గా తగ్గిపోతుంది. దీంతో బ్రౌజింగ్, డౌన్‌లోడ్ సరిగా జరగదు. చాలా పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఈ పరిస్థితుల్లో మనం తీవ్ర ఆందోళనకు గురవుతాం. అయితే ఈ చిట్కాలను ఉపయోగించి ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. అవేమిటంటే..

స్మార్ట్‌ఫోన్‌లన్నింటిలో ‘ఫైట్ మోడ్’ ఆప్షన్ ఉంటుంది. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫైట్ మోడ్‌ను ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత ఆన్ చేస్తే, మీ ఫోన్ ఇంటర్నెట్ పూర్తి వేగంతో పనిచేస్తోంది.
మీ ఫోన్ నెట్ స్పీడ్‌ని మెరుగుపరచడానికి మరొక సులభమైన మార్గం మెుబైల్ డేటా ఆప్షన్‌ను ఆఫ్ చేయడం. మీరు ఫోన్ డేటాను కాసేపు ఆఫ్ చేసి.. కొద్దిసేపటి తర్వాత రీస్టార్ట్ చేయడం ద్వారా మొబైల్ డేటా ఫుల్ స్పీడ్‌తో రన్ అవుతుంది.
సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ నెట్వర్క్ టైప్‌ను బట్టి ఉంటుంది. 4G నెట్‌వర్క్ ఉంటే ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉంటుంది. కొన్ని నెట్‌వర్క్ సరిగ్గా పని చేయవు. దీని కోసం మొదట ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మొబైల్ నెట్‌వర్క్‌ను 4Gకి ఎనేబుల్ చేయాలి. తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్‌కు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లపై క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్ట్ గా రీసెట్ చేయాలి.
చాలా సందర్భాల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా రాకపోవడానికి కారణం మీ డివైజ్ లేటెస్ట్ అప్‌డేట్‌తో ఇన్‌స్టాల్ చేయకపోవడం కూడా కారణం కావచ్చు. అందువల్ల, ఫోన్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ అయ్యిందో లేదో చెక్‌ చేసుకోండి.

స్పీడ్ టెస్టులో మీ ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నట్లు తేలితే DNS సర్వర్‌ మార్చుకోవడం ద్వారా వేగాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
క్రాష్, కుక్కీలను క్లియర్ చేయాలి. మోబైల్ ఫోన్ లో క్రాష్, కుక్కీలను క్లియర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ వేగవంతం అవుతుంది.
డేటా సేవింగ్ మోడ్‌ని ఆన్ చేయాలి. ఫోన్ లో డేటా సేవింగ్ మోడ్ ను ఆన్ చేయడం కూడా ఇంటర్నెట్ వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది.
బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి. ఒకేసారి చాలా యాప్‌లను రన్ కావడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. RAMని ఖాళీ చేయడం వలన ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. ఇందుకోసం బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి.
ఆటో-అప్‌డేట్‌లను నిలిపివేయాలి. ఆటోమేటిక్ అప్‌డేట్‌లు చాలా డేటాను తీసుకుంటాయి. దీని వలన ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో యాప్‌ల ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఆఫ్ చేయాలి.

Summer-vacation-Activities-2023-24-Instructions

 Summer vacation Activities for the academic year 2023-24 – Instructions 

వేసవ సెలవులు ఏప్రిల్ 24 నుంచి*
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ,విద్యార్థులు నిర్వహించాల్సిన ఆక్టివిటీస్ పై తాజా ఉత్తర్వులు*
రోజువారి యాక్టివిటీస్ షెడ్యూలు కృత్యాల వివరాలు సవివరంగా విడుదల తాజా ఉత్తర్వులు విడుదల*

వేసవి సెలవులలో విద్యార్ధులు చేయదగినవి
వేసవి కార్యకలాపాలను నిర్వహించడానికి, ఉపాధ్యాయుల భాగస్వామ్యం మరియు ప్రణాళిక కీలకం. ఈ విషయంలో, ఉపాధ్యాయులకు ఈ క్రింది సూచనలను వ్యాప్తి చేయాలి:
1. తరగతి ఉపాధ్యాయులు తప్పనిసరిగా వారి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో Whats App సమూహాలను సృష్టించాలి.
2. వేసవి కార్యకలాపాల కోసం ఒక నోట్‌బుక్‌ను నిర్వహించమని మరియు తిరిగి తెరిచే సమయంలో దానిని సమర్పించమని ఉపాధ్యాయులు విద్యార్థులను అడగాలి.
3. ఉపాధ్యాయులు విద్యార్థులతో సన్నిహితంగా ఉండాలి మరియు తల్లిదండ్రులు వారి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తారు.
4. వాట్స్ యాప్ గ్రూప్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల కార్యకలాపాలను చిత్రాలు, వీడియోలు మరియు నివేదికల రూపంలో సేకరించాలి.
5. వేసవి సెలవుల్లో విద్యార్థులు చేసే అన్ని కార్యకలాపాలను పాఠశాలల పునఃప్రారంభ వేడుక సమయంలో ప్రదర్శించాలి.
6. కార్యాచరణల షెడ్యూల్‌ను రూపొందించి, వారితో భాగస్వామ్యం చేయాలని నిర్ధారించుకోండి
విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు.
7. వేసవి విరామ సమయంలో చదవమని విద్యార్థులను ప్రోత్సహించండి మరియు వారు ఎంచుకోగల పుస్తకాల జాబితాను సూచించండి.
8. విద్యార్థుల విద్యా మరియు వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన ఆసక్తి ఉన్న అంశాలపై ఆన్‌లైన్ తరగతులు, వెబ్‌నార్లు లేదా వర్క్‌షాప్‌లను నిర్వహించండి.
9. విద్యార్థులకు వారి సృజనాత్మకత మరియు విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరిచే ప్రాజెక్ట్‌లను కేటాయించండి.
10. క్రీడలు, నృత్యం లేదా యోగా వంటి శారీరక కార్యకలాపాలను ప్రోత్సహించండి మరియు విద్యార్థులకు వనరులు మరియు మార్గదర్శకత్వం అందించండి.
11.ఆన్‌లైన్ యాక్టివిటీస్ లేదా వర్చువల్ ఈవెంట్‌ల ద్వారా విద్యార్థులు తమ తోటివారితో ఎంగేజ్ అయ్యే అవకాశాలను అందించండి.
12. రెగ్యులర్ కమ్యూనికేషన్ మరియు ఫీడ్‌బ్యాక్ ద్వారా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండండి.
13.చివరిగా, విద్యార్థుల పనిని సేకరించి, వారి తల్లిదండ్రులతో పంచుకోండి. వారి ప్రయత్నాలను గుర్తించి, జరుపుకోవడానికి పాఠశాల వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో దీన్ని ప్రదర్శించండి.

School Education – Summer vacation Activities for the academic year 2023-24 – Instructions.
As the summer vacation approaches, it is our duty to ensure that students utilize their time during the vacation in a constructive and meaningful way. In order to provide the students with opportunities for holistic growth and learning, it is proposed to conduct various activities during the summer holidays. 
Summer activities can be focused on various areas such as academics, sports and games, arts, vocational skills etc. These activities should be designed in a creative way to engage the students but also help them to acquire new skills and knowledge. Some indicative activities that can be organized are herewith provided.
The main objective of these summer activities is to ensure that the students do not lose their academic momentum during the break and to provide them with a platform to develop their interests and hobbies. In addition, these activities will also help foster curiosity, creativity, and imagination in young minds and develop spirit of teamwork, leadership, discipline, life skills, values etc. among the students. The list of activities and guidelines prepared by the SCERT is placed at Annexure-I.

SUMMER BREAK ACTIVITIES GUIDELINES FOR TEACHERS CLICK HERE
SUMMER ACTIVITIES TARL CLICK HERE

We Love Reading 2023-24
This form is for students, teachers, teacher educators, student teachers and Principals of DIETs
A google form link is provided for submission of the activities of competitions https://forms.gle/73sw7jBbWM4vDrEo6
To conduct summer activities, the participation and planning of teachers are crucial. In this regard, the following instructions should be disseminated to teachers:
1. Class teachers must create Whats App groups with their students and parents. 2. Teachers should ask students to maintain a notebook for summer activities and submit it at the time of reopening. 
3. Teachers should keep in touch with the students and and parents encourage them from time to time to monitor their activities. 
4. Teachers should gather students’ activities in the form of pictures, videos and reports through the Whats App group. 
5. All the activities done by the students during summer vacation should be presented at the time of re-opening ceremony of schools. 
6. Make sure to create a schedule of activities and share it with the students and their parents. 
7. Encourage students to read during the summer break and suggest a list of books that they can choose from. 
8. Conduct online classes, webinars or workshops on topics of interest that are relevant to the students academic and personal growth. 
9. Assign students the projects that will enhance their creativity and critical thinking skills. 
10.Encourage physical activities such as sports, dance or yoga and provide students with resources and guidance. 
11.Provide students with opportunities to engage with their peers through online activities or virtual events. 
12.Keep in touch with the students and their parents through regular communication and feedback. 
13.Finally, collect students’ work and share it with their parents. Showcase it on the school’s website or social media handles to acknowledge and celebrate their efforts.
AP CSE PROCEEDINGS FOR SUMMER ACTIVITIES CLICK HERE

SUMMER BREAK ACTIVITIES GUIDELINES FOR TEACHERS CLICK HERE
SUMMER ACTIVITIES TARL CLICK HERE

error: Content is protected !!