diabetics-stop-drinking-coffee-tea-details

diabetics-stop-drinking-coffee-tea-details

మధుమేహులు టీ, కాఫీలు బంద్ చేసి ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగండి

చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగాల్సిందే.

భారతీయుల్లో ఉదయాన లేచాక టీ, కాఫీ సేవించాకే ఏ పనైనా మొదలుపెట్టే వాళ్ళు ఎక్కువమంది. టీ, కాఫీలు మితంగా తాగితే ఆరోగ్యకరమే కానీ ఇందులో ఉండే కెఫిన్ మాత్రం ఒక్కోసారి ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు కెఫీన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు. వారు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం దాల్చిన చెక్కతో చేసిన పానీయం ప్రతిరోజూ తాగితే రక్తంలో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

దాల్చిన చెక్క మంచి సువాసన వేస్తుంది. చిన్న ముక్కను టీలో వేసుకున్న చాలు మసాలా టీ అదిరిపోతుంది. అయితే పాలతో చేసిన టీని పక్కన పెట్టి దాల్చిన చెక్కతో టీను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే ఖాళీ పొట్టతో దాల్చిన చెక్క పానీయాన్ని తీసుకుంటే మధుమేహ రోగులు ఆరోగ్యంగా జీవిస్తారు. ఇది చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకుంటుంది. గుండెకు కూడా ఈ దాల్చిన చెక్క పానీయం ఎంతో సహాయపడుతుంది.

శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కూడా మధుమేహం గుండె జబ్బులు వంటివి వస్తాయి. అలా కొవ్వు పేరుకుపోకుండా చేసే శక్తి దాల్చిన చెక్కకు ఉంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటుంది. దీన్ని తాగేవారు బరువు త్వరగా తగ్గుతారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అంటువ్యాధులు త్వరగా సోకే కాలంలో జీవిస్తున్నాం. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి అనారోగ్య పరిస్థితులను అయినా దూరం పెట్టడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. దాల్చిన చెక్క మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పిల్లలకు ఈ పానీయాన్ని తాగించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చదివింది వారికి గుర్తుంటుంది. అలాగే పెద్దలు ఆర్థరైటిస్ వంటి సమస్యలు బారిన పడకుండా ఈ దాల్చిన చెక్క పానీయాన్ని తాగవచ్చు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. 

తయారు చేయడం చాలా సులువు. ఒక గిన్నెలో గ్లాసు నీరు వేయాలి. అందులో దాల్చిన చెక్క వేసి చిన్న మంట మీద పది నిమిషాలు మరిగించాలి. దాల్చిన చెక్కలోని పోషకాలు అన్ని నీటిలో చేరుతాయి. దాన్ని వడకట్టి గోరువెచ్చగా మారాక ఆ నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. దీన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే ఎంతో ఆరోగ్యం.

which-is-best-Black Tea or Black Coffee-uses

 which-is-best-Black Tea or Black Coffee-uses

Black Tea or Black Coffee: బ్లాక్‌ టీ లేదా బ్లాక్‌ కాఫీ.. వీటిల్లో ఆరోగ్యానికి ఏది మంచిది?

ఆరోగ్య స్పృహ ఉన్న వారు టీ, కాఫీలను చక్కెర, పాలతో తాగడానికి దూరంగా ఉంటారు. బదులుగా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీని తాగేందుకు ప్రాధాన్యత ఇస్తారు. రెండు పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదో.. ఆరోగ్య పరంగా ఏది మంచిదో.. అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మ కణాలను
ఆరోగ్య స్పృహ ఉన్న వారు టీ, కాఫీలను చక్కెర, పాలతో తాగడానికి దూరంగా ఉంటారు. బదులుగా బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీని తాగేందుకు ప్రాధాన్యత ఇస్తారు. రెండు పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదో.. ఆరోగ్య పరంగా ఏది మంచిదో.. అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మ కణాలను రక్షిస్తాయి. అయితే బ్లాక్ టీలో కనిపించే యాంటీఆక్సిడెంట్ బ్లాక్ కాఫీ కంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి
బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి అనేక ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంతమందికి హానికరం. బ్లాక్ టీలో కెఫిన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
బ్లాక్ కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది. వ్యాయామం లేదా వ్యాయామానికి ముందు ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి దీనిని తాగొచ్చు. అందుకే జిమ్‌కి వెళ్లే ముందు చాలా మంది బ్లాక్ కాఫీ తాగుతుంటారు. బ్లాక్ కాఫీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
బ్లాక్ టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కెఫిన్ తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు మంచిది. అయితే రెండింటిలో ఏదైనా అధికంగా వినియోగిస్తే ఆరోగ్యినికి అంత మంచిది కాదంటూ నిపుణులు సూచిస్తున్నారు.

tips-for-your-knee-health–details

 tips-for-your-knee-health–details

మోకాళ్ళలో గుజ్జు కరిగి పోతుందా..? అయితే ఇలా చేయండి..!

ప్రస్తుతం వయసుతో తేడా లేకుండా ఎన్నో అనారోగ్యమైన సమస్యలు మానవులను పలకరిస్తున్నాయని చెప్పవచ్చు. పూర్వం వయసు తగ్గే కొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తే రోజులను ప్రస్తుతం మరిచిపోవాల్సిన సమయం వచ్చేసింది.

ప్రస్తుతం వయసుతో తేడా లేకుండా ఎన్నో అనారోగ్యమైన సమస్యలు మానవులను పలకరిస్తున్నాయని చెప్పవచ్చు. పూర్వం వయసు తగ్గే కొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తే రోజులను ప్రస్తుతం మరిచిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు వయసుతో తేడా లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు పలువురి ని పీడిస్తున్నాయనే చెప్పవచ్చు. ప్రధానంగా మోకాలు అరిగిపోవడం, మోకాలిలోని గుజ్జు కరిగిపోవడం, ఇటువంటి సమస్యలతో విపరీతమైన మోకాలి నొప్పులను చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా కొంతమంది రోగులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి స్థితిలో మోకాళ్ళ లో గుజ్జు కరిగిపోకుండా ఉండాలంటే ఎటువంటి సూచనలు పాటించాలో ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలు (Ongole) లోని రిమ్స్ వైద్యశాల ప్రొఫెసర్ డాక్టర్ వివి నారాయణ 


వివరాలు 

ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ… తమ వైద్యశాల వద్దకు సైతం చిన్న పెద్ద అనే వయసుతో తేడా లేకుండా చాలా వరకు కరోనా కాలం తర్వాత, అధిక మోకాలి నొప్పుల వ్యాధితో బాధపడుతూ రోగులు వస్తున్నారన్నారు. అటువంటి స్థితిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించిన ఎడల చిన్నపాటి ఇంజక్షన్ ద్వారా గుజ్జును కాలి లోపలికి పంపించి మరలా యధాస్థితిగా నడవగలిగేలా చేయవచ్చన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామ సాధన చేయడం ద్వారా మోకాలి నొప్పుల బారి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నారు.

కానీ ఇటువంటి మోకాలి నొప్పుల వ్యాధితో బాధపడేవారు వైద్యులు సూచించే సూచనలను పాటించాలని, లేని యెడల దీర్ఘకాలిక వ్యాదిలా మార్పు చెంది చివరకు శస్త్ర చికిత్సకు దారి తీస్తుందన్నారు డాక్టర్ వివి నారాయణ. అలాగే కరోనా వ్యాధి వచ్చి వెళ్లిన రోగుల్లో ఇటీవల ఇటువంటి మోకాలి నొప్పులు అధికమైనట్లు తాము గుర్తించామన్నారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే కాలి నొప్పుల వ్యాధులు దారి చేరవని డాక్టర్ నారాయణ రావు తెలిపారు.

bitter-guard-juice-benefits-for-diabetics

 bitter-guard-juice-benefits-for-diabetics

Diabetics: ఈ జ్యూస్‌ తాగిన 30 నిమిషాల్లో.. చక్కెర స్థాయిలు తగ్గుతాయ్‌..!


Diabetics: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య.. డయాబెటిస్‌. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ (IDF) అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా.. అర బిలియన్ కంటే ఎక్కువ మంది పెద్దలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2030 నాటికి, 640 మిలియన్ల కంటే ఎక్కువ మంది డయాబెటిస్‌ పేషెంట్స్‌ ఉంటారని అంచనా వేస్తోంది. 2019,లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 మిలియన్ల మంది డయాబెటిస్‌ కారణంగా మరణించారు. బ్లడ్‌ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోకపోతే.. కిడ్నీ, కళ్లు,గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గించడానికి కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పబ్మెడ్ సెంట్రల్‌ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, కాకారకాయ జ్యూస్‌ తాగడం వల్ల కేవలం 30 నిమిషాల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అదే సమయంలో, జ్యూస్‌ తాగిన గంటన్నర తర్వాత.. రక్తంలోని చెక్కర స్థాయిలు మరింత తగ్గి, సాధారణ స్థాయికి చేరుకుంటాయని స్పష్టం చేసింది.



దే జర్నల్‌లో ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం.. కాకరకాయలో యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు ఉన్నాయి. దీనిలోని ట్రైటెర్పెన్, ప్రొటైడ్, స్టెరాయిడ్, ఆల్కలాయిడ్, అకర్బన, లిపిడ్ , ఫినోలిక్ సమ్మేళనాల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి డయాబెటిస్ మెల్లిటస్‌ను మూలం నుంచి నిర్మూలించడంలో సహాయపడతాయి.
న్యాచురల్‌ ఇన్సులిన్‌..


కాకరకాయలో ఇన్సులిన్‌లా పని చేసే పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి గ్లూకోజ్‌ను ఉపయోగించుకోవడానికి.. కణాలకు సహాయపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.
ఈ పోషకాలు ఉంటాయి..
FDA ప్రకారం, ఒక కప్పు (94 గ్రా) కాకరకాయలో ఫైబర్: 2 గ్రా, విటమిన్ సి: 93%, విటమిన్ ఎ 44%, ఫోలేట్ 17%, పొటాషియం 8%, జింక్ 5% , ఐరన్ 4% ఉంటుంది.
ఎలా తీసుకోవాలి..
కాకరకాయ ప్రయోజనాలు పొందాలంటే రోజూ ఉదయాన్నే ఒక కప్పు జ్యూస్‌ తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని రకరకాలుగా వండుకుని, సూప్‌గా చేసుకుని మీ డైట్‌లో తీసుకోండి.
గమనిక: 

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

what-is-Alkaline-water-benefits-of-alkaline-water

 what-is-Alkaline-water-benefits-of-alkaline-water

ఆల్కలైన్ వాటర్ తాగడం మంచిదేనా..? ఈ వాటర్ లో ఏముంది..?

నీరు అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ త్రాగునీటిలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో రకం త్రాగునీరుకి ఒక్కో ప్రత్యేకత ఉందని చెప్తుంటారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నీరు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావట.. అవేంటో తెలుసుకుందాం. హెల్దీ ఈటింగ్ అన్న కాన్సెప్ట్ ఎంత పాతదో అంత కొత్తది. ఎప్పటికప్పుడు ఇందులో కూడికలూ తీసివేతలూ జరిగిపోతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇందులోకి కొత్తగా యాడ్ అయిన విషయం ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.

క్రానిక్ డిసీజెస్‌ని ప్రివెంట్ చేయడం, బాడీలోని పీహెచ్ లెవెల్స్ ‌ని రెగ్యులేట్ చేయడం, వయసు మీద పడకుండా చూడడం వంటివి ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ‌లో కొన్ని. ఆల్కలైన్ వాటర్ వల్ల బాడీలోని యాసిడ్ లెవెల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. ఈ పని నార్మల్ వాటర్ చేయలేదు. అయితే, ఈ ఆల్కలైన్ వాటర్ మంచి చెడుల గురించి చాలా చర్చలే జరిగాయి. అసలీ ఆల్కలైన్ వాటర్ అంటే ఏమిటో తెలుసుకుందాం రండి.

ఆల్కలైన్ వాటర్ అంటే..?


ఆల్కలైన్ వాటర్ అంటే అయొనైజ్ చేసిన వాటర్. అంటే, వాటర్ యొక్క పీహెచ్ లెవెల్ ‌ని పెంచడం. ఈ పీహెచ్ లెవెల్ అనేది ఒక సంఖ్య. ఈ సంఖ్య ఒక పదార్ధం ఎసిడిక్ పదార్ధమా, ఆల్కలైన్ పదార్ధమా అని సున్నా నుండి పద్నాలుగు వరకూ ఉన్న స్కేల్‌లో చెబుతుంది. అంటే, పీహెచ్ లెవెల్ ఒకటి అయితే అది ఎసిడిక్ పదార్ధమనీ, పదమూడైతే బాగా ఆల్కలైన్ పదార్ధమనీ తెలుస్తుంది. నార్మల్ వాటర్ పీహెచ్ లెవెల్ ఏడు. అదే ఆల్కలైన్ వాటర్ పీహెచ్ లెవెల్ ఎనిమిది గానీ, తొమ్మిది కానీ ఉంటుంది. అందుకే నార్మల్ వాటర్ ఎసిడిక్ కాదు, ఆల్కలైన్ కాదు, అది న్యూట్రల్.

ఈ ఆల్కలైన్ వాటర్ యాసిడ్ ని తగ్గిస్తుంది కాబట్టి ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారికి హెల్ప్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇలా యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుండి మనని కాపాడుకోగలుగుతాం. స్పెషల్ ఫిల్టర్స్, ఫాసెట్ ఎటాచ్ మెంట్స్, ఎడిటివ్స్ వంటి వాటి ద్వారా నార్మల్ వాటర్ ని ఆల్కలైన్ వాటర్ ‌గా మార్చవచ్చు.

అయితే, శరీరంలో రకరకాల ద్రవాలు ఊరుతూ ఉంటాయి. ఇవి ఎసిడిక్ ‌గా ఉంటాయి. కాబట్టి ఆల్కలైన్ వాటర్ వీటిని న్యూట్రలైజ్ చేస్తుంది. నిజానికి మన ఆహారం డెబ్భై శాతం ఆల్కలైన్ ‌గా ముప్పై శాతం ఎసిడిక్ ‌గా ఉండాలి. అప్పుడే అది లోపలికి వెళ్ళిన తరువాత శరీరం యొక్క పీహెచ్ లెవెల్ న్యూట్రల్ అయిపోతుంది. ఇలా పీహెచ్ లెవెల్స్ ‌ని బాలెన్స్ చేయని ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు ఆల్కలైన్ వాటర్‌ని తీసుకోమని సజెస్ట్ చేస్తారు.చాలా మందికి నార్మల్ వాటరే మంచిది. అయితే, హైబీపీ, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉన్న వారికి ఆల్కలైన్ వాటర్ హెల్ప్ చేస్తుందని అంటున్నారు. ఈ వాటర్ ఎంత మంచిదో, ఎందుకు మంచిదో, ఎవరికి మంచిదో తేల్చి చెప్పేంత సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగిందంటున్నారు. కానీ, ఈ బెనిఫిట్స్ ఉంటాయని మాత్రం ఆల్కలైన్ వాటర్ మంచిదని నమ్మేవాళ్ళు చెబుతున్నారు.

ఆల్కలైన్ వాటర్ బెనిఫిట్స్..

ఈ వాటర్ ఎంత మంచిదో, ఎందుకు మంచిదో, ఎవరికి మంచిదో తేల్చి చెప్పేంత సైంటిఫిక్ రీసెర్చ్ ఇంకా జరగలేదు. కానీ, ఈ బెనిఫిట్స్ ఉంటాయని మాత్రం ఆల్కలైన్ వాటర్ మంచిదని నమ్మేవాళ్ళు చెబుతున్నారు.

1. నార్మల్ వాటర్ కంటే ఆల్కలైన్ వాటర్ లో హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ. అందువల్ల రెగ్యులర్ గా వర్కౌట్స్ చేసే వారికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది.
2. శరీరం లోని యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఈ వాటర్ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది.
3. ఆల్కలైన్ వాటర్ లో మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ ఉన్నాయి. ఇవి బోన్స్ హెల్దీ గా ఉండేలా చూస్తాయి.
4. ఆల్కలైన్ వాటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకుంటాయి.

How-to-increase-your-memory-power

How-to-increase-your-memory-power

Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే

మెదడు పనితీరు సక్రమంగా ఉంటేనే పనులు సరిగా చేసుకోగలుతారు. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి.

శరీరంలోని 20 శాతం కేలరీలను మెదడు ఉపయోగిస్తుంది. మనం రోజంతా ఏకాగ్రతగా ఉండటానికి దీనికి ఇంధనం అవసరం. నిద్రలో ఉన్నప్పుడు మెదడు మినహా అన్ని శరీర అవయవాలు స్తబ్దుగా ఉంటాయి. మెదడు మాత్రం నిరంతరం చురుకుగా ఉంటుంది. అందుకే మెదడుని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మంచి ఆహారం తీసుకోవాలి.

నిరంతరం పని చేయడం, ఒత్తిడి వంటివి మానసిక అలసటకి దారితీస్తాయి. దాన్ని తగ్గించుకోవడం కోసం విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, ధ్యానం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవే కాదు మీ మెదడుని ఆరోగ్యంగా ఉంచాలంటే విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం ఇవ్వడం కూడా ముఖ్యమే.

సాధారణ జీవితంలో కొంతమంది చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. వయసు రీత్యా మెమరీ లాస్ రావడమే కాదు ఇప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జ్ఞాపకశక్తి కుంటుపడుతుంది. దాన్ని మెరుగుపరచాలంటే మెదడుని ఉత్తేజపరిచే ఆహారాలు ఎంచుకోవాలి. కొన్ని విటమిన్లు మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోకుండా కాపాడతాయి. అందుకే మెదడు సరిగా పని చేయాలంటే మీ ఆహారంలో ఈ విటమిన్లు చేర్చుకోవాలి. అప్పుడే జ్ఞాపకశక్తికి ఎటువంటి ఢోకా ఉండదు.

విటమిన్ సి: సిట్రస్ పండ్లలో సమృద్ధిగా ఉంటుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, ఎముకలను బలోపేతం చేయడం మాత్రమే కాదు మెదడు పనితీరు కూడా బాగుండెలా చూస్తుంది. అందుకే పార్స్లీ , మొలకలు, సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, బ్రొకోలి, బంగాళాదుంపలు, కివీ, రెడ్ పెప్పర్, క్యాబేజీ ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి.

విటమిన్ ఇ: చర్మం, జుట్టు కోసం విటమిన్ ఇ అవసరమే. దీనితో పాటు జ్ఞాపకశక్తి నష్టాన్ని నివారించేందుకు ఈ విటమిన్ కావాలి. పొద్దు తిరుగుడు గింజలు, గోధుమలు, బాదం, గుమ్మడికాయ, బచ్చలికూర, క్యాప్సికమ్, పాలకూర వంటివి వాటిలో ఈ విటమిన్ పుష్కలంగా దొరుకుంటుంది.

మెగ్నీషియం: యాపిల్స్, సెలెరీ, చెర్రీస్, అంజీరా, బొప్పాయి, బఠానీలు, రేగు పండ్లు, బంగాళాదుంపలు, ఆకుకూరలు, వాల్నట్స్ లో మెగ్నీషియం లభిస్తుంది. ఇది మెదడుని ధృడంగా ఉంచేందుకు సహకరిస్తుంది.

విటమిన్ బి12: పాలు, చికెన్, గుడ్లు, చేపలు మొదలైన వాటిలో లభించే బ్రెయిన్ ఫుడ్ ఇది. శాఖాహారులకి విటమిన్ బి12 సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి. అందుకే శాఖాహారులు త్వరగా విటమిన్ బి12 లోపం బారిన పడతారు.

లెసిథిన్: సహజ వనరులైన గుడ్డు సొనలు, బాదం గింజలు, సిసెమ్ గింజలు, సోయా బీన్స్, గోధుమల్లో ఇది సమృద్ధిగా దొరుకుంటుంది.

ఫాస్ఫాటిడైల్సెరిన్: ఇది సప్లిమెంట్ రూపంలో లభిస్తుంది. సోయాబీన్స్‌లో కూడా ఉంటుంది. సోయా పాలు, టోఫు తీసుకోవడం ద్వారా దీన్ని పొందవచ్చు.

విటమిన్ బి: మెదడుకి శక్తి కావాలంటే విటమిన్ బి6 తో పాటు బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. విటమిన్ బి6 ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసే మెలటోనిన్ విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. దాన్ని పొందాలంటే అరటి పండ్లు, వేరుశెనగలు, ఓట్స్, చికెన్, చేపలు వంటి ఆహారాలు తీసుకోవాలి.

ఫ్లేవనాయిడ్స్: ఉల్లిపాయలు, క్యాబేజ్, బ్రొకోలి, క్యాలీప్లవర్, టర్నిప్, నారింజ రంగు పండ్లు, మిరియాలు, బీన్స్ వంటి వాటిలో ఇవి సమృద్ధిగా దొరుకుతుంది.

కెరొటీనాయిడ్స్: క్యారెట్, మొలకలు, చిలగడదుంపలు, బచ్చలికూర, సెలెరీ, ఎరుపు క్యాప్సికమ్, టోమోటాలు, నారింజల్లో కెరొటీనాయిడ్లు ఉంటాయి. ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచి మీ జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి

Ragi-java-malt-sop-ppt-in-mdm

 Ragi-java-malt-sop-ppt-in-mdm-ap

*Ragi Malt Info*

🧋 *వారంలో ప్రతీ మంగళ, గురు, శనివారాలలో ఉదయం 8:45 కి పిల్లలకు పంపిణీ.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటల్లోగా యాప్ లో అప్లోడ్ చేయాలి..

 *Ragi Malt SOP, PowerPoint Presentation తయారీ విధానం వీడియో విడుదల. రాగి జావ ను ఈ నెల 10వ తేదీ నుండి విద్యార్థులకి అందించాలి.* ఈ క్రింది లింక్ నుండి ఎస్.ఓ.పి ని డౌన్లోడ్ చేసుకోండి. *రాగి జావ తయారీ విధానం – అధికారిక వీడియో FP షాపులకి చేరిన ప్యాకెట్లు… రాగి జావ కోసం మీ పాఠశాలకు కేటాయించిన రాగి పిండి, బెల్లం పాకెట్లు FP షాప్ కి చేరాయి. వీటిని హెడ్మాస్టర్ తీసుకోవాలి. వాటి వివరాలను మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి ఈ క్రింది లింక్ లో తెలుసుకోండి.
రేపటి నుండి రాగి జావ అమలు…అయితే FP Shop లేదా MDU వెహికల్ నుండి ఈ రోజు వరకు రాగి పిండి, బెల్లం ప్యాకెట్ లను తీసుకొని అన్ని జిల్లాల స్కూల్స్ వివరాలు (09.03.2022 7AM) ఈ క్రింది లింక్ లో కలవు.

1.Collection of Ragi flour and jaggery from fair price shop (చౌకధరల దుకాణం) “today”

2.To be served by MDM on Tuesday, Thursday, Saturday, morning 8.45 am

3.Upload details of Ragi malt material in imms app by today 2 pm

4.Send details of Ragi malt received to MEO office by 3pm today.

5.Ragi malt serving staring Day 10.3.23 by 8.45 AM

IMMS APP UPDATED VERSION IS AVAILABLE NOW

UPDATED VERSION : 1.5.4*

UPDATED ON : 08-03-2023*

WHAT’S NEW

*Ragi Jaggery module changes*

Andhra Pradesh Government – School Education Department would like to implement Ragi Malt ( Ragi Java ) from March 10th in all Government Schools. Hence below instructions issued for smooth and proper implementation of Ragi Java under Jagananna Goru Mudda MDM programme from March 10th 2023

ముఖ్య గమనిక మరియు సూచన : రాగి జావా స్టాక్ IMMS App

AD గారు & MEO గారు & ఆఫీస్ టీం పూర్తి బాధ్యత వహించి ….

రాగి & బెల్లం పాకెట్స్ ని ప్రతి HM గారు FP షాప్ నుండి స్కూల్స్ కు తీసుకువెళ్లిన వెంటనే imms app లో HM గారి లాగిన్ లో Ragi and Jaggery received quantity ని తప్పని సరిగా ఎంట్రీ వేపించ వలెను …

పైన తెలిపిన విధంగా HM గారి తో ఎంట్రీ వేపించిన చో మనకి మన జగనన్న గోరుముద్ద logins లో report వస్తుంది. దీని ద్వారా స్టాక్ రిసీవ్ చేసుకోని HMs తో స్టాక్ తెచ్చుకోమని చెప్పి వెంటనే ఎంట్రీ వేపించే విధంగా monitoring చేయవచ్చు.
The above instructions by the Director, MDM & SS.

https://youtu.be/t9RT6bFHXCQ

Ragi java malt sop cimplete information

Ragi malt Java PPT CLICK HERE

error: Content is protected !!