APFU Admission into Diploma in Fisheries Programme

 APFU Admission into Diploma in Fisheries Programme
APFU Admissions: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సు, టెన్త్ పాసైతే చాలు
APFU Admission into Diploma in Fisheries Programme: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా యూనివర్సిటీ పరిధిలో మొత్తం 495 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం సీట్లలో ఓసీలకు 50 శాతం, బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం కేటాయించారు. పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 10న ప్రారంభంకాగా.. జూన్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆలస్యరుసుముతో జూన్ 29 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు, సర్టిఫికేట్ల వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు జులై 2, 3 తేదీల్లో అవకాశం కల్పించింది. అభ్యర్థులు జులై 6న వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు..

* డిప్లొమా ఇన్‌ ఫిషరీస్‌ ప్రోగ్రామ్‌ (ఇంగ్లిష్‌ మీడియం) 

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

సీట్ల సంఖ్య: 495 (ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 440).

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ పరిధిలోని విద్యాసంస్థలు..

i) బోధన సంస్థలు 

a) రాజ్యాంగబద్ద కళాశాలలు 

➥ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముతుకూరు,నెల్లూరు జిల్లా 

➥ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, నర్సాపురం, పశ్చిమగోదావరి జిల్లా.

b) పాలిటెక్నిక్ కళాశాలలు

1. రాజ్యాంగబద్ద పాలిటెక్నిక్ కళాశాలలు 

➥శ్రీ ఎంవీకేఆర్ ఫిషరీస్ పాలిటెక్నిక్, భవదేవరపల్లి, క్రిష్ణా జిల్లా. 

2.  అనుబంధ ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలు  

➥ బి.ఆర్. ఫిషరీ పాలిటెక్నిక్, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా. 

➥బెల్లంకొండ ఫిషరీస్ పాలిటెక్నిక్, కంభాలపాడు, ప్రకాశం జిల్లా. 

➥ పైడా కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ పాలిటెక్నిక్, పటవల, కాకినాడ జిల్లా. 

➥ పైడా గ్రూప్ ఫిషరీస్ పాలిటెక్నిక్, పటవల, కాకినాడ జిల్లా.

➥ శ్రీహరి ఫిషరీస్ పాలిటెక్నిక్, పసుపుల, కర్నూలు జిల్లా.

➥ శ్రీ వేంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్, ఎస్‌ఎస్‌ఆర్ పురం, శ్రీకాకుళం జిల్లా. 

➥ శ్రీ వేంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్, తక్కోలు, కడప జిల్లా. 

➥ శ్రీనిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్, చేకూరపాడు, ప్రకాశం జిల్లా.

ii) ఫిషరీస్ రిసెర్చ్ స్టేషన్లు:

➥ ఫిషరీస్ రిసెర్చ్ స్టేషన్, కాకినాడ, కాకినాడ జిల్లా. 

➥ ఫిషరీస్ రిసెర్చ్ స్టేషన్, ఉండి, పశ్చిమగోదావరి జిల్లా. 

➥ ఇన్‌స్ట్రక్షల్ కమ్ రిసెర్చ్ ఆక్వా ఫార్మ్, బలభద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా. 

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: 31.08.2024 నాటికి 15 – 22 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్థులు 31.08.2002 – 31.08.2009 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, స్థానికత, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు..

✪ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఏపీ ప్రభుత్వం జారీచేసిన తాజా సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ (క్యా్స్ట్ సర్టిఫికేట్).

✪ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2024-25 సంవత్సరానికి సంబంధించినది).

✪ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్

✪నాన్ మున్సిపల్ ఏరియా కోటా కింద అర్హులైనవారికి నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ (ఫామ్-1) తీసుకోవాలి.

✪ దివ్యాంగులైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ ఉండాలి.

✪ సైనిక కుటుంబాలకు చెందినవారైతే ఆర్మ్‌డ్ పర్సనల్ సర్టిఫికేట్/ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ తప్పనిసరి.

✪ఎన్‌సీసీ కోటా కింద అర్హులైనవారు NCC సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

✪స్పోర్ట్స్ కోటా కింద ప్రయోజనం పొందాలనుకునేవారు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.06.2024.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 26.06.2024.

✦ ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 27.06.2024 – 29.06.2024.

✦ సర్టిఫికేట్స్‌ ఎడిట్‌ ఆప్షన్: 02.07.2024 & 03.07.2024.

✦ వెబ్‌ఆప్షన్ల నమోదు: 06.07.2024.

ap-degree-OAMDC-Admissions 2024

 AP Degree OAMDC Admissions 2024

AP Degree Admissions 2024 : ఏపీలో డిగ్రీ ప్రవేశాలు – జూన్ 18 నుంచి కౌన్సెలింగ్

AP OAMDC Admissions 2024: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ జూన్ 18 నుండి ప్రారంభం కానుంది.‌ ఆన్‌లైన్‌లోనే కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. విద్యార్థులు తమకు కావాల్సిన కాలేజీలకు వరసగా ప్రిఫరెన్సీ ఇవ్వడంతో వారికి వచ్చిన మార్కులు బట్టీ కాలేజీలను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా డిగ్రీ ప్రవేశాలు చేస్తారు.
రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈలోపు యూనివర్శిటీల అనుబంధ గుర్తింపు, ఇతరత్రా ఫీజులు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలల అనుమతుల పొడిగింపు ఫీజును చెల్లించాలని కాలేజీలకు యూనివర్శిటీలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.
ఆలిండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఏఐసీటీఈ) అనుమతి ఉంటేనే బీసీఏ, బీబీఏ కోర్సులను కౌన్సిలింగ్ పెట్టనున్నారు. ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా కౌన్సిలింగ్ చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది

ఏఏ కాలేజీల్లో ప్రవేశాలు ?

  • 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
  • రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు జరగనున్నాయి.‌ అయితే బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎఫ్ఏ, బీ. వొకేషనల్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 18 నుంచి 29 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.‌
  • ఆన్‌లైన్ దరఖాస్తు చేసే సమయంలో బీసీ విద్యార్థులు రూ. 300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200, జనరల్ కేటగిరీ (ఓసీ) విద్యార్థులు రూ.400 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
  • ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఓఏఏండీసీ ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మార్కు షీట్, కుల ధృవీకరణ, ఇతర‌ అవసరమైన పత్రాలు స్కాన్ చేసిన కాపీలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
  • విద్యార్థులు దరఖాస్తు చేయాలనుకుంటున్న కళాశాల కోసం వెబ్ ఎంపికలను చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఏస్సీహెచ్ఈ) ఆన్‌లైన్ మోడ్‌లో సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తుంది. ఎంపికైన విద్యార్థులకు కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి.

మూడు దశల్లో ప్రవేశాలు….

మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదట దశలో ప్రవేశాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ లో 80 శాతం – 90 శాతం మధ్య మార్కులు సాధించిన విద్యార్థులకు రెండో దశలో ప్రవేశాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ లో 80 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మూడో మరియు చివరి దశలో ప్రవేశాలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో 3.19 లక్షల సీట్లు ఉండగా, గతేడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులు ఉన్నాయి. వీటికి గతంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి అనుమతులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు వీటిని ఆలిండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. అయితే దీనిపై కాలేజీ యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు జూన్ 20కి వాయిదా వేసింది.‌

ONLINE REGISTRATION LINK CLICK HERE

ANGRAU-agricultural-diploma-Admissions-2024

 ANGRAU-agricultural-diploma-Admissions-2024

ANGRAU Admissions : అగ్రిక‌ల్చ‌ర్ పాలిటెక్నిక్ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌ – జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు

ముఖ్య‌మైన తేదీలు

ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి రిజిస్ట్రేష‌న్ జూన్ 1న ప్రారంభం అవుతుంది. అలాగే రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ జూన్ 20 అని ఆచార్య ఎన్‌జి రంగా యూనివ‌ర్శిటీ తెలిపింది. ద‌ర‌ఖాస్తు చేసే విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది.

Acharya NG Ranga Agricultural University Updates : ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని లాంలో ఆచార్య ఎన్‌జి రంగా వ్య‌వ‌సాయ యూనివ‌ర్శిటీ అగ్రిక‌ల్చ‌ర‌ల్ పాలిటెక్నిక్ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
ఈ కోర్సుల‌కు ప్ర‌వేశ ప‌రీక్ష లేకుండా, ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కులు ఆధారంగానే సీట్లు కేటాయింపు ఉంటుంది. ఈ డిప్లొమా కోర్సులకు జూన్ 1  నుంచే రిజిస్ట్రేష‌న్ ప్రారంభం అవుతుంది. ఈ కోర్సులు చ‌ద‌వాల‌నుకునే ఆస‌క్తి గ‌ల విద్యార్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.
 Fee structure (For academic year, 2024-25) : 
Fee to be paid at the time of admission (in Rs.) for all the Diploma programmes * I year – I Semester Government – Rs. 22,460.00 (Refundable deposit Rs.11,700.00 after completion)
I year – II Semester  – Rs. 6710.00 
Affiliated* Rs. 27,099.00 23,459.00 
ఎన్‌జి రంగా వ్య‌వ‌సాయ యూనివ‌ర్శిటీ 2024-25 సంవ‌త్స‌రానికి గానూ యూనివ‌ర్శిటీ ఆధ్వర్యంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ కోర్సులు చేయ‌డానికి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ప‌దో త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు యూనివ‌ర్శిటీ వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి…?

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు యూనివ‌ర్శిటీ వెబ్‌సైట్ https://angrau.ac.in ను సంద‌ర్శించాలి. అందులోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అలాగే ఫీజుల విష‌యానికి వ‌స్తే, జ‌న‌ర‌ల్, ఓబీసీ విద్యార్థుల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.600, అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కోర్సులు?
  • విత్త‌న సాంకేతిక ప‌రిజ్ఞానం రెండేళ్లు
  • సేంద్రియ వ్య‌వ‌సాయం రెండేళ్లు
  • పంట‌లు నిర్వ‌హ‌ణ రెండేళ్లు
  • పంటలు విస్త‌ర‌ణ రెండేళ్లు
  • అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ మూడేళ్లు
Registration form for Admission into 2/3 years Diploma Courses 2024-25 CLICK HERE
కోర్సుల్లో ప్ర‌వేశాలు ఎలా?

ఈ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ఎటువంటి ప్ర‌వేశ ప‌రీక్ష లేదు. అకాడ‌మిక్ మెరిట్ ఆధారంగానే ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కులు ఆధారంగానే ప్ర‌వేశాలు జ‌రుగుతాయి. ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కుల‌ను మెరిట్ ఆధారంగా ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన విద్యార్థులై ఉండాలి. విద్యార్థి త‌ప్ప‌ని స‌రిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంట‌ర్మీడియ‌ట్, అంత‌కంటే ఎక్కువ విద్యార్హ‌త‌లు ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అన‌ర్హులు. విద్యార్థులు వారి ప‌దేళ్ల విద్యా కాలంలో క‌నీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠ‌శాలల్లో చ‌దివి ఉండాలి. వ‌య‌స్సు 15-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

OFFICIAL WEBSITE LINK CLICK HERE

ONLINE REGISTRATION LINK CLICK HERE

Diploma in Horticulture-Food Processing-2024

 Diploma in Horticulture-Food Processing-2024

AP హార్టికల్చర్ డిప్లొమా అంటే ఏమిటి?

AP హార్టికల్చర్ డిప్లొమా అనేది ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సంస్థలు అందించే ప్రత్యేకమైన పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్. ఉద్యాన పంటల సాగు, నిర్వహణ మరియు మార్కెటింగ్‌తో సహా హార్టికల్చర్‌లో విద్యార్థులకు సమగ్ర జ్ఞానం మరియు నైపుణ్యాలను అందించడం దీని లక్ష్యం.

  1. హార్టికల్చర్‌లో డిప్లొమా
  2. ఫ్లోరికల్చర్ మరియు ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్‌లో డిప్లొమా
  3. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ
  4. పండ్ల ఉత్పత్తిలో డిప్లొమా
  5. కూరగాయల ఉత్పత్తిలో డిప్లొమా
  6. పోస్ట్-హార్వెస్ట్ టెక్నాలజీలో డిప్లొమా

ప్రతి కోర్సు దాని స్వంత ప్రత్యేక పాఠ్యాంశాలను కలిగి ఉంది, ఉద్యానవనంలో నిర్దిష్ట ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది. ఈ డిప్లొమా ప్రోగ్రామ్‌లు వ్యవసాయ మరియు ఉద్యానవన రంగాలలోని విద్యార్థులకు విభిన్న కెరీర్ అవకాశాలను తెరుస్తాయి.

  • AP హార్టికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా అడ్మిషన్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం చాలా అవసరం.
  • ఆశావాదులు తమ 10వ తరగతి లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుండి పూర్తి చేసి ఉండాలి.
  • అదనంగా, వారు తమ మాధ్యమిక విద్యలో సైన్స్‌ని ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు పరిమితి సాధారణంగా 15 మరియు 22 సంవత్సరాల మధ్య ఉంటుంది మరియు భారతీయ జాతీయత తప్పనిసరి.
  • అంతేకాకుండా, వివిధ వర్గాల విద్యార్థులకు అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ విధానాలు అమలులో ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో శాశ్వత నివాసితులు అయి ఉండాలి.
డా.వైఎస్సార్ హార్టికల్చరల్ వర్సిటీలో మరియు అనుబంధ ఉద్యాన కళాశాలల్లో రెండేళ్ల హార్టికల్చర్ డిప్లమో కోర్సులలో 2024-25 ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
అర్హత:* 10వ తరగతి
దరఖాస్తు విధానం:* ఆన్లైన్
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:* 18-06-2024.
నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, పూర్తి వివరాలు.

Commencement of online Registration: 25-05-2024
Last date for online Registration : 18-06-2024

1. Diploma courses and duration of the courses: 
Dr. Y.S.R. Horticultural University (Dr.YSRHU) offers the following two Diploma
Programmes.
1. Diploma in Horticulture
2. Diploma in Horticultural
Food Processing
  2. Eligibility: 
The candidates should fulfill the following criteria
2.1 Academic Qualification:
I. Candidate should have passed SSC Examination conducted by Board of Secondary
Education or any other examination recognized as equivalent thereto by the Board of
Secondary Education such as Central Board of Secondary Education (CBSE), Indian
Council for Secondary Education (ICSE), National Institute of Open School (NIOS), Open
School Society (OSS).
II. Candidate should belong to the state of Andhra Pradesh as defined in G.O. (P). No. 646,
Education (W) Dept, dated. 10.07.1979 and its subsequent amendments.
III. Candidates who appeared SSC or equivalent examination held in March/April-2024, and
whose results are yet to be declared can also apply.
IV. Candidates who have passed SSC in compartmental and who have either discontinued
or failed in intermediate are also eligible for diploma admission.
V. Candidate who had passed intermediate or pursuing higher studies are not eligible for
admission into diploma courses offered by Dr.YSRHU.

2. Selection Process: 
 Per cent of marks/ Total marks obtained in SSC or its equivalent examination will be
considered in the order of merit for seat allotment.
 In case of tie, the marks/grade point obtained first in Science and later in Mathematics and
Social, respectively will be taken into consideration for tie breaking.
 In case if tie still continues, the age of the candidates will be taken into consideration and the
older candidates will be given preference.  
NOTIFICATION FOR ADMISSIONS INTO HORTICULTURE DIPLOMA CLICK HERE
ONLINE REGISTRATION LINK CLICK HERE

basara-iiit-rgukt-2024-admissions

 basara-iiit-rgukt-2024-admissions

Basara RGUKT 2024 Notification: బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎన్ని సీట్లు ఉన్నాయంటే!

తెలంగాణలోని బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక యూనివర్సిటీ (బాసర ఆర్‌జీయూకేటీ)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. జూన్‌ 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ వీసీ వి.వెంకటరమణ మే 27న వివరాలు వెల్లడించారు. 
ఈసారి కూడా మొత్తం 1500 సీట్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన చెప్పారు. వీటిల్లో 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు పోటీపడవచ్చని పేర్కొన్నారు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లో సీట్లను భర్తీ చేస్తామని ఆయన అన్నారు.
ఫస్ట్‌ ఇయర్‌కు ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్న వారు ఆ మొత్తం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ. 1000, కాషన్‌ డిపాజిట్‌ కింద రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700.. చొప్పున మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వీసీ వి వెంటక రమణ వివరించారు. ఈ ఏడాది తొలి ప్రయత్నంలో పదో తరగతి పాసైన వారు మాత్రమే ఇందులో ప్రవేశాలకు అర్హులు. అలాగే విద్యార్ధుల వయసు జూన్‌ 1 నాటికి 18 ఏళ్లకు మించకుండా ఉండాలి. 
ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు మాత్రం 21 యేళ్ల వరకు మినహాయింపు ఉంటుంది. గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్‌న్యూమరీ కింద భర్తీ చేస్తారు. ఇతర వివరాలను ఆర్‌జీయూకేటీ నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

బాసర ఆర్‌జీయూకేటీ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్‌ 26, 2024వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సీట్ల కేటాయింపు తేదీ: జులై 3, 2024. ధ్రువపత్రాల పరిశీలన తేదీ: జులై 8 నుంచి 10 వరకు

BASARA IIIT RGUKT ADMISSIONS OFFICIAL WEBSITE LINK CLICK HERE

ap-polycet-2024-counselling-schedule

ap-polycet-2024-counselling-schedule-released
AP Polycet 2024 Counselling: ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 10 నుంచి తరగతులు
ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్‌ 3 వరకు చేపట్టనున్నారు. మే 31 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకకు అవకాశం కల్పించారు..

PAYMENT OF PROCESSING FEE THROUGH ONLINE Mode
All the candidates from 1 to Last Rank can pay the processing fee from 24.05.2024 to
02.06.2024. The fee amounts are given below,
For OC/BC:Rs.700/-
For SC/ST:Rs. 250/-

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్‌ 3 వరకు చేపట్టనున్నారు. మే 31 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకకు అవకాశం కల్పించారు. ఐచ్ఛికాలు మార్చుకునేందుకు మే 5వ తేదీలోనే వెసులుబాటు కల్పించారు. ఇక మే 7న సీట్ల కేటాయింపు ఉంటుంది. మే 10 నుంచి 14 వరకు విద్యార్ధులు సీట్లు పొందిన కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. విద్యార్థులు సీటు పొందిన కాలేజీల్లో వ్యక్తిగతంగా లేదంటే ఆన్‌లైన్‌ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం జూన్‌ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

కాగా ఈ ఏడాది పాలిసెట్‌ ఫలితాలు మే 8వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించారు. వీరిలో బాలికలు 50,710 (89.81 శాతం) మంది, బాలురు 73,720 (73.72 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే ఈ ఏడాది పాలీసెట్‌ ఉత్తీర్ణత 87.61 శాతం నమోదైంది. 

ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్‌ కేటగిరి, ఇతర అంశాల ఆధారంగా కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీటు కేటాయిస్తారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు మొత్తం 267 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది.

POLYCET-2024 COUNCILLING NOTIFICATION PDF CLICK HERE
AP POLYCET-2024 OFFICIAL WEBSITE LINK CLICK HERE
AP POLYCET-2024 OFFICIAL WEBSITE LINK CLICK HERE

మీ ర్యాంక్ ఆధారంగా మీరు సీటు పొందగల కళాశాలలను అంచనా వేయండి. గత సంవత్సరం కౌన్సెలింగ్‌లో చివరి ర్యాంకులు/కటాఫ్ ర్యాంక్‌ల ఆధారంగా కళాశాలలు ప్రదర్శించబడతాయి. మీ ర్యాంక్‌ను నమోదు చేయండి, అన్ని సంబంధిత వర్గాలను ఎంచుకుని, సమర్పించండి. కటాఫ్ ర్యాంకులతోపాటు కాలేజీల జాబితా ప్రదర్శించబడుతుంది.

AP POLYCET 2024 కౌన్సెలింగ్ సమయంలో మీరు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు తదుపరి ఉపయోగం కోసం కాపీని సేవ్ చేయండి.

AP POLYCET Cut off Ranks – College Predictor (Based on 2023 Counselling Data) 

CHECK AP POLYCET-2024 MOCK COUNSELLING/COLLEGE PREDICTOR CLICK HERE

Check AP POLYCET Mock Counselling/ College Predictor CLICK HERE

AP POLYCET-2024 RANK CARDS DOWNLOAD LINK CLICK HERE
AP POLYCET: Polytechnic Colleges in AP CLICK HERE

HORTICET-2024-notification-application

   HORTICET-2024-notification-application
హార్టికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, సంక్షిప్తంగా, HORTICET 2024 రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. HORTICET 2024ని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం నిర్వహిస్తుంది.  HORTICET 2024 అనేది B.Scలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులకు ప్రసిద్ధి చెందిన ప్రీ-అగ్రికల్చర్ పరీక్ష. (ఆనర్స్.) హార్టికల్చర్, ఇది నాలుగు సంవత్సరాల UG పాఠ్యాంశం.  ఇప్పుడు పరీక్షా విధానం మరియు సిలబస్ గురించి చర్చిద్దాం.
విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్‌లో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు విశ్వవిద్యాలయం నిర్వహించే HORTICET లో స్కోర్ ఆధారంగా మొత్తం సీట్లలో 5% అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.
ELIGIBILITY  : A pass in Diploma in Horticulture course from Dr. YSRHU. 

YSR హార్టికల్చరల్ యూనివర్సిటీ HORTICET దరఖాస్తు ప్రక్రియ 2024

అందుబాటులో ఉన్న సీట్లలో 15 సీట్లకు (ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలకు 47 మరియు ప్రైవేట్ కాలేజీలకు 36) ప్రవేశం కల్పించేందుకు HORTICET నిర్వహించబడుతుంది. ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా HORTICET దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు:

  1. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.

  2. ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్‌లో “కంప్ట్రోలర్, ది YSR హార్టికల్చరల్ యూనివర్శిటీ, చెల్లించవలసిన తాడేపల్లిగూడెం” కి అనుకూలంగా డ్రా చేసిన DD రూపంలో INR 1000/- (SC/ST/PH కోసం INR 500/-) యొక్క దరఖాస్తు రుసుముతో పాటు సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను పంపండి .

  3. పూర్తి చేసిన దరఖాస్తును DD మరియు అవసరమైన పత్రాలతో పాటు వీరికి పంపండి:

The duly filled in application along filled in application along with required enclosures and online payment receipt should reach

THE Dr.YSR Horticultural University 534101,

Dr.YSR Horticultural University,

Administrative Office,

West Godavari District,

THE REGISTRAR,

Venkataramannagudem

West Godavari District, A.P.

on or before 15-06-2024  For for latest updates pertaining to UG admissions, pertaining to UG admissions https://drysrhu.ap.gov.in.

HORTICET-2024 NOTIFICATION CLICK HERE
OFFICIAL WEBSITE LINK CLICK HERE

ntr-girls-scholarships-2024-25

ntr-girls-education-scholarship-test-for-degree-courses-2024-25-details-at-ntrtrust

NTR Trust : ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు NTR ట్రస్ట్‌ గుడ్‌న్యూస్‌.. మూడేళ్ల పాటు నెలకు రూ.5000 పొందే ఛాన్స్‌

NTR Girls Education Scholarship Test 2024 : ప్రతిభ గల విద్యార్థినులకు గుడ్‌న్యూస్‌. స్కాలర్‌షిప్‌ అందించడానికి ఎన్టీఆర్‌ (NTR) ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను జూన్‌ 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థ వెల్లడించింది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థినులు మే 15వ తేదీ నుంచి జూన్‌ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు.. తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ పూర్తి చేసేవరకు అందజేస్తారు. అలాగే క్యాట్‌, సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ శిక్షణ ఇస్తారు. విద్యార్థినులు పూర్తి వివరాలకు https://ntrtrust.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం :

  • NTR Girls Education Scholarship Test 2024
  • అర్హతలు: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థినులు అప్లయ్‌ చేసుకోవచ్చు.
  • పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి 2 గంటలుగా నిర్ణయించారు.
  • పరీక్షాంశాలు: జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, బేసిస్ మ్యాథ్స్, ఇంగ్లిష్‌(12వ తరగతి స్థాయిలో) పరీక్ష ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.250 చెల్లించాలి.
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే 15, 2024
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: జూన్‌ 7, 2024
  • పరీక్ష తేదీ: జూన్‌ 9, 2024
  • స్థలం: ఎన్టీఆర్ జూనియర్, డిగ్రీ మహిళా కళాశాల, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్, హిమాయత్ నగర్ గ్రామం, మొయినాబాద్ మండలం, ఆర్‌ఆర్‌ జిల్లా.
  • ONLINE REGISTRATION LINK CLICK HERE

ttd-junior-colleges-admission-2024

tirumala-tirupati-devasthanams-ttd-junior-colleges-admission-2024
TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలివే

ONLINE APPLICATIONS INVITED FOR ADMISSIONS IN TTD JUNIOR COLLEGES FROM MAY 15 _ టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి మే 15వ తేదీ నుండి ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

TTD Junior Colleges Admissions 2024 : తిరుమల తిరుపతి దేవస్థానం- టీటీడీ నుంచి జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 31 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించారు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఇంగ్లిష్‌ భాషలో మాత్రమే ఉంటుంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్‌ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి :

  • విద్యార్థులు మొదట https://admission.tirumala.org/ వెబ్ సైట్ ఓపెన్‌ చేయాలి.
  • Student Manual in English or Student Manual in Telugu రెండు బాక్స్‌లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన క్లిక్ చేయాలి.
  • అనంతరం దరఖాస్తు విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అనంతరం ఇంటర్మీడియేట్ కోర్సుకు జూనియర్‌ కాలేజీని ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి.
  • క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు, తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. తమకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేయగానే టీటీడీ ఆధ్వర్యంలోని రెండు జూనియర్ కళాశాలల్లో ఉన్న గ్రూప్‌లు, అందుబాటులో ఉన్న సీట్లు, ప్రవేశానికి అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.
  • తిరుమల తిరుపతి దేవస్థానం , తిరుపతి … ఇంటర్మీడియట్ నందు జాయిన్ అవడానికి ఎలా అప్లై చేయాలో తెలిపే PDF CLICK HERE
  • విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీటు తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ పంపుతారు.
  • తరువాత సీటు పొందిన విద్యార్థి ధృవీకరణ పత్రాలను అధికారులు వారి సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్న) సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు రద్దు అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేయాలి. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. విద్యార్థులు దరఖాస్తు నింపే సమయంలో సందేహాలు, కోర్సులలోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

silver-jublee-college-cet-2024-details

silver-jublee-college-cet-2024-details
Silver Jubilee CET 2024: సిల్వర్ సెట్‌ – 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
Kurnool News: కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల ప్రవేశ ప్రకటన వెలువడింది. 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
Silver Jubilee Government College- Kurnool Admissions:  కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2024-25 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘సిల్వర్ సెట్-2024’ పరీక్షకు మే 4న ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూన్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను జూన్ 16న నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 10 నుంచి అందుబాటులో ఉంచనునున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు. 
ఆన్‌లైన్  ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌డెస్క్ 022-62507712 నంబరులో లేదా ఈమెయిల్:  sjgdc2024@onlineregistrationform.org ద్వారా సంప్రదించవచ్చు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. 

వివరాలు..

* సిల్వర్ సెట్ – 2024

అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు: బీఏ, బీకామ్, బీఎస్సీ.

దరఖాస్తు ఫీజు: రూ.700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. 
మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. 
వీటిలో మూడు పేపర్లు ఇంటర్ సంబంధిత సబ్జెక్టుల నుంచి, ఒకటి ఇంగ్లిష్ పేపర్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.05.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.06.2024. (23:59 hrs.)

➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 04.06.2024.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 10.06.2024.

➥ ఆన్‌లైన్ (సీబీటీ) పరీక్షతేది: 16.06.2024
SILVER CET-2024 ONLINE APPLICATION LINK CLICK HERE
OFFICIAL WEBSITE LINK CLICK HERE

ap-polycet-2024-mock-counselling-College-Predictor

 ap-polycet-2024-mock-counselling-College-Predictor

*🌷పాలిసెట్ కౌన్సెలింగ్ 23 నుంచి🌷*
AP POLYCET -2024

మీ ర్యాంక్ ఆధారంగా మీరు సీటు పొందగల కళాశాలలను అంచనా వేయండి. గత సంవత్సరం కౌన్సెలింగ్‌లో చివరి ర్యాంకులు/కటాఫ్ ర్యాంక్‌ల ఆధారంగా కళాశాలలు ప్రదర్శించబడతాయి. మీ ర్యాంక్‌ను నమోదు చేయండి, అన్ని సంబంధిత వర్గాలను ఎంచుకుని, సమర్పించండి. కటాఫ్ ర్యాంకులతోపాటు కాలేజీల జాబితా ప్రదర్శించబడుతుంది.

AP POLYCET 2024 కౌన్సెలింగ్ సమయంలో మీరు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు తదుపరి ఉపయోగం కోసం కాపీని సేవ్ చేయండి.

AP POLYCET Cut off Ranks – College Predictor (Based on 2023 Counselling Data) 

CHECK AP POLYCET-2024 MOCK COUNSELLING/COLLEGE PREDICTOR CLICK HERE

Check AP POLYCET Mock Counselling/ College Predictor

AP POLYCET-2024 RANK CARDS DOWNLOAD LINK CLICK HERE

ap-rgukt-admissions-2024-notification

 ap-rgukt-admissions-2024-notification
IIIT నోటిఫికేషన్ విడుదల అప్లికేషన్ ప్రారంభ తేదీ. మే 8* 
ఇది వివిధ విభాగాలలో B.Tech, M.Tech & P.hd వంటి అనేక రకాల UG, PG, PHD ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. 7 స్పెషలైజేషన్లతో 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఫుల్-టైమ్ ప్రోగ్రామ్ అయిన B.Tech కోసం అడ్మిషన్లు ఆహ్వానించబడ్డాయి. విశ్వవిద్యాలయం 10వ తరగతిలో మెరిట్ మరియు విశ్వవిద్యాలయం నిర్వహించే కౌన్సెలింగ్ ఆధారంగా తన B.Tech ప్రోగ్రామ్‌కు అభ్యర్థులను ప్రవేశపెడుతుంది. 

RGUKT AP IIIT Admissions 2024 : ఏపీ ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు.. RGUKT-Aఅడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల.
IMPORTANT DATES
Sl.No Description Dates
1 Starting date for receiving online registrations 08-05-2024
2 Last date for receiving online registrations 25-06-2024 up to 05.00 P.M
3 Date of declaration of provisional selected candidates list 11-07-2024 (Tentative

నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు భర్తీ చేస్తారు.

  • రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లు కేటాయిస్తారు.
  • మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీపడవచ్చు. ఈ సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్‌ మెరిట్‌ కింద కేటాయిస్తారు.
  • సర్కార్ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్‌ స్కోర్‌ను జోడించి మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  • వీటిల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 400 సీట్లు కేటాయిస్తారు. 
  • ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్‌ సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తొలుత గణితంలో, తర్వాత సైన్స్‌, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ ర్యాండమ్‌ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు._*
  • AP RGUKT 6 సంవత్సరాల BTech (ఇంటిగ్రేటెడ్) రిజర్వేషన్ 2024

    2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని RGUKTలో ఆరు సంవత్సరాల B.Tech ప్రోగ్రామ్ కోసం రిజర్వేషన్ వివరాలు క్రింద అందుబాటులో ఉన్నాయి, వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలను నిర్ధారించడం చాలా అవసరం. 

    • ఎస్సీ: 15%
    • ST: 6%
    • BC-A: 7%
    • BC-B: 10%
    • BC-C: 1%
    • BC-D: 7%
    • BC-E: 4%
    • శారీరక వికలాంగులు (PH): 5%
    • సాయుధ సిబ్బంది పిల్లలు (CAP): 2%
    • NCC: 1%
    • క్రీడలు: 0.5%
    • భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్: 0.5%

    అదనంగా, అమ్మాయి అభ్యర్థులు అందుబాటులో ఉన్న ప్రతి కేటగిరీ (OC/SC/ST/BC/ప్రత్యేక కేటగిరీలు)లో అమ్మాయి అభ్యర్థులకు అనుకూలంగా 33 1/3 % సీట్ల క్షితిజ సమాంతర రిజర్వేషన్ ఉంది.

    ముఖ్యమైన తేదీలు:

    • నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 6, 2024
    • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 8, 2024
    • తరగతుల ప్రారంభం: జులైలో.
  • AP RGUKT 6-సంవత్సరాల BTech అప్లికేషన్ ఫీజు 2024

    ఆంధ్రప్రదేశ్‌లోని RGUKTలో 2024-25 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ మరియు నాలుగు సంవత్సరాల B.Tech ప్రోగ్రామ్ (ఇంటిగ్రేటెడ్) కోసం దరఖాస్తు రుసుము ₹300/-, అయితే, SC మరియు ST అభ్యర్థులకు ఇది కేవలం ₹. 200 అందించిన చెల్లింపు పద్ధతుల్లో ఒకదాన్ని ఉపయోగించి గడువులోగా అవసరమైన మొత్తాన్ని చెల్లించాలి, లేకుంటే అతని లేదా ఆమె అప్లికేషన్ యాక్సెస్ చేయబడదు.

RGUKT ఇంటిగ్రేటెడ్ B.Tech అడ్మిషన్ 2024

RGUKT UG స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లలో ఆరు సంవత్సరాల B.Tech ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. X తరగతిలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత కనీస అర్హత ప్రమాణం. పదవ తరగతిలో మార్కుల ఆధారంగా ప్రవేశం అందించబడుతుంది. చివరి సీటు కేటాయింపు సమయంలో అభ్యర్థులు కౌన్సెలింగ్ రౌండ్‌కు షార్ట్‌లిస్ట్ చేయబడతారు.

గమనిక: 85% సీట్లు APకి చెందిన విద్యార్థులకు మరియు 15% AP మరియు తెలంగాణ విద్యార్థులకు తెరిచి ఉన్నాయి.

RGUKT దరఖాస్తు ప్రక్రియ 2024

AP ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడం ద్వారా లేదా RGUKT అధికారిక వెబ్‌సైట్‌లో (AP & తెలంగాణ అభ్యర్థుల కోసం) ఇచ్చిన లింక్‌ను అనుసరించడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. RGUKT అందించే కోర్సులకు దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి.

  1. RGUKT యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. మెను బార్‌లోని ‘ అడ్మిషన్’ తర్వాత ‘ యూజీ అడ్మిషన్స్’పై క్లిక్ చేయండి .
  3. ఇప్పుడు ‘ ఎలా అప్లై చేయాలి’పై క్లిక్ చేసి , మీ అప్లికేషన్ మోడ్‌ను ఎంచుకోండి, అంటే, AP ఆన్‌లైన్ (అందరి అభ్యర్థులకు) లేదా ‘ AP తెలంగాణ విద్యార్థుల కోసం అప్లికేషన్ లింక్’ని ఎంచుకోండి .
AP RGUKT IIIT ONLINE REGISTRATION LINK CLICK HERE
Instructions: Submit Online Application for Andhra Pradesh and Telangana Students CLICK HERE

గమనిక 1:  AP మరియు తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, గల్ఫ్ దేశాలు లేదా NRIలు ‘ఇతర రాష్ట్రాలు & NRI విద్యార్థులు’ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

 గమనిక 2:  PH/ CAI/ NCC స్పోర్ట్స్ కేటగిరీలు మాత్రమే తమ దరఖాస్తులను RGUKTకి పోస్ట్ ద్వారా పంపాలి.

 ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్థుల కోసం దరఖాస్తు ప్రక్రియ:  ‘AP ఆన్‌లైన్ సెంటర్’తో పాటు, AP మరియు తెలంగాణకు చెందిన అభ్యర్థులు కూడా ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు:

  1. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి మరియు కావలసిన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  2. దరఖాస్తు రుసుము INR 150 (SC/ST కోసం INR 100) చెల్లించండి.
  3. భవిష్యత్ సూచన కోసం దరఖాస్తును సమర్పించి, సేవ్ చేయండి.

 గమనిక: PH/ CAP/ NCC/ స్పోర్ట్స్ కేటగిరీలకు  చెందిన అభ్యర్థులు పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. కవర్ పైన పేర్కొనండి “ అడ్మిషన్ల కోసం దరఖాస్తు 2021- RGUKT, A.P’.

కన్వీనర్, UG అడ్మిషన్స్-2021,

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్,

ఫ్లాట్ నంబర్ 202, రెండవ అంతస్తు, NRI బ్లాక్(C),

శ్రీ మహేంద్ర ఎన్‌క్లేవ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా – 52250

AP RGUKT IIIT OFFICIAL WEBSITE LINK CLICK HERE

error: Content is protected !!