Card-payments-changes in debit and credit card payment options

Card-payments-changes in debit and credit card payment options

Card Payments: డెబిట్​, క్రెడిట్ కార్డు పేమెంట్ ఆప్షన్లలో భారీ మార్పులు

సెన్సిటివ్ డేటాను నాన్-సెన్సిటివ్​ డేటాగా మార్చే ప్రక్రియను టోకెన్స్ అంటారు. యూజర్ల క్రెడిట్​ లేదా డెబిట్ కార్డుల 16 అంకెల డిజిటల?

వినియోగదారుల క్రెడిట్ కార్డు(Credit Cards), డెబిట్ కార్డుల(Debit Cards) వివరాలు ఆన్​లైన్ ప్లాట్​ఫామ్​ల ద్వారా లీక్ అవుతున్న ఘటనలు తలెత్తుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. మర్చంట్ సైట్లకు టోకెనైజేషన్​ను కట్టడి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆన్​లైన్ ప్లాట్​ఫామ్​ల్లో క్రెడిట్​, డెబిట్ కార్డుల వివరాలు ఇక సేవ్ కావు. 2022 జనవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. “కార్డు లావాదేవీలు​, పేమెంట్ చైన్లలో కార్డుల వివరాలు నిల్వ చేయకూడదు.

కార్జులు జారీ చేసే వారు లేదా కార్డు నెట్​వర్క్​లకు​ మినహాయింపు ఉంటుంది. ఇది 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది” అని ఆర్​బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
టోకెనైజేషన్ అంటే ఏంటి..

సెన్సిటివ్ డేటాను నాన్-సెన్సిటివ్​ డేటాగా మార్చే ప్రక్రియను టోకెన్స్ అంటారు. యూజర్ల క్రెడిట్​ లేదా డెబిట్ కార్డుల 16 అంకెల డిజిటల్ అకౌంట్​ను.. డిజిటల్ క్రెడెన్షియల్​గా టోకెన్ మార్చేస్తుంది. దీని ద్వారా కస్టమర్ల కార్డు డేటా మర్చంట్ పేమెంట్ సిస్టమ్​లో సేవ్ అయి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది.

డేటా బ్రీచ్​లు జరిగిన సమయంలో పేమెంట్ టోకెన్లు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

అయితే సందర్భాల్లో పాన్ కార్డుకు అనుసంధానం చేయడం వల్ల యూజర్ల అకౌంట్లలో డబ్బు సేఫ్​గా ఉంది.

అయితే కార్డు వివరాలు లీకవుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్ననేపథ్యంలో ఆర్​బీఐ టోకెనైజేషన్​పై కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఒకవేళ వినియోగదారుడు కార్డు డేటా సేవ్ చేసుకోవాలనుకుంటే.. ఎడిషన్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పకుండా ఉండాలని వెల్లడించింది.