ap-ts-postal-jobs-details

ap-ts-postal-jobs-details

AP-TS Postal Jobs: పోస్టల్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఖాళీలు.. APలో 3వేలు, TSలో 2వేలకు పైగా పోస్టుల భర్తీ..

కేంద్రప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది.

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది.

  దానిలో భాగంగా.. ఇండియా పోస్ట్ (Dak Vibhag Vacancy 2022)ద్వారా ప్రస్తుతం జరుగుతున్న రిక్య్రూట్ మెంట్ ప్రాసెస్ అయిన వెంటనే నోటిఫికేషన్లను జారీ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో indiapost.gov.in లో తెలుసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్‌లో భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ మొత్తం లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి సంబంధించి 23 పోస్టల్ సర్కిళ్ల వారీగా పోస్టులను మంజూరు చేసింది. మంజూరు చేసని పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. దేశంలో ఉన్న 23 సర్కిల్స్ నుంచి శాంక్షన్డ్ పోస్టులకు సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేసిన నోటీస్ లో పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

నిరుద్యోగులకు కేంద్ర కొలువులు సాధించే అద్భుత అవకాశం! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్‌ (India Post) దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా మొత్తం 23 సర్కిళ్లకుగానూ ఖాళీల వివరాలను తెలియజేస్తూ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 59,099, మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 1445, మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 37,539 వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భరీగా ఖాళీలున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీల వివరాలు..

  • పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 2289

  • మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 108

  • మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 1166

తెలంగాణ సర్కిల్‌లో ఖాళీలు..

  • పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులు 1553

  • మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 82

  • మల్టీ టాస్కింగ్‌ పోస్టులు 878

పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 32 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే ఖాళీల వివరాలను తెలుపు పోస్టల్ శాఖ షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం వంటి ఇతర సమాచారం వివరణాత్మక అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

మెయిల్ మోటార్ సర్వీసెస్, పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బీ పోస్టులు, అసిస్టెంట్ సూరింటెండెంట్ పోస్టులు, మెయిల్ మోటార్ సర్వీస్, ఇన్ స్పెక్టర్ మరియు పోస్టల్ ఆపరేటివ్ సైడ్ కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.

అంతే కాకుండా.. రైల్వే మెయిల్ సర్వీసెస్ కింద సేవింగ్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రీజినల్ ఆఫీస్ లకు సంబంధించి పోస్టులు, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, స్టెనోగ్రాఫర్ , మల్టీ టాస్కింగ్ స్టాప్ వంటి కింది క్యాడర్ పోస్టులకు ఎన్ని పోస్టులను మంజూరు చేస్తున్నది నోటీస్ లో పేర్కొన్నారు. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన భారత విద్యా సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.

మరికొన్ని పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 32 సంవత్సరాలు ఉండాలని భారత్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 23 సర్కిల్స్ లల్లో ఖాళీలను గుర్తించారు.

అందులో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఖాళీల విషయానికి వస్తే.. అందులో 59,099పోస్టులు పోస్ట్ మ్యాన్, 1445 మెయిల్ గార్డ్, 37,539 పోస్టులు మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.

వీటితో పాటు స్టెనోగ్రాఫర్ కు సంబంధించి పోస్టులను కూడా ఆయా సర్కిళ్ల వారీగా మంజూరు చేశారు. దీనిలో ఆంధ్రప్రదేశ్ కు పోస్ట్ మెన్ పోస్టులు 2289, మెయిల్ గార్డ్ 108 మరియు ఎంటీఎస్ పోస్టులు 1166 పోస్టులను మంజూరు చేశారు. అదేవిధంగా తెలంగాణ సర్కిల్ కింద పోస్ట్ మెన్ 1553, మెయిల్ గార్డ్ 82, ఎంటీఎస్ 878 పోస్టులను మంజూరు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. 

error: Content is protected !!
Scroll to Top