ap-inter-mdiate-online-admissions-process

ap-inter-mdiate-online-admissions-process

ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలు 

AP Inter Admissions-2021: ఏపీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి…

Inter 1st YEAR ONLINE ADMISSION LINK

How to Admission in 1st Year inter 2021-22

Registration Process

  • Visit “https//:bie.ap.gov.in”

  • Click on Registration form and fill the details

  • Click on Proceed to Payment

  • Fill the Payment Details

  • Click on Make Payment

  • On Successful payment

  • “Payment Succeeded”

  • Message will be displayed

  • Click on OK

  • Print Receipt will be displayed

  • Print the Receipt

  • Candidate’s ID and Password will be sent to

  • Registered Mobile No.

Students Login Process

  • Click on LOGIN

  • Enter Candidate’s ID, Password and Captcha and

  • Click on Sign-in

  • Fill the Additional Details

  • Click on Preview Details

  • Click on Submit if Data found correct

  • Else click on Edit and Correct the data and Click on Submit Application

  • Successfully Registered message will be Displayed

  • Then Click on Web Options

Web Option Steps

  • Click on Web Options

  • Select by Course / by college

  • Enter required details in the Dropdown Lists

  • Click on show Colleges

  • Click on View to know about a particular College

  • Select Colleges with Priority numbers and Second Language (Minimum 10 number of colleges should be selected)

  • Save WEB Options to save the Data

  • If you need any corrections Delete WEB Options Select NEW Options and SAVE

  • Print your Application

  • Allotment Letter will be available in student’s LOGIN as per Schedule Visit College with Allotment Letter, Pay the FEE (Online / Offline) to JOIN

  • If the student didn’t get Allotment in any of the preferred Colleges in Phase-I, he/she can proceed to the next Phase of admissions as per Schedule

టెన్త్‌ పూర్తయిన  విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశానికి గతంలో మాదిరిగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ నిర్ణయించింది.

ముందస్తుగా బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాటుచేసిన యాప్‌లోకి పదో తరగతి విద్యార్థి హాల్‌ టికెట్‌ ద్వారా దరఖాస్తు ప్రారంభించుకోవాలి.

విద్యార్థికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. దీనిలోనే జిల్లాలోని కళాశాలల వివరాలు ఉంటాయి. విద్యార్థి నచ్చిన కళాశాల ఎంపిక చేసుకోవాలి.

ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆన్‌లైన్‌ ప్రోసెస్‌ ఎలా ఉంటుందో దాదాపు ఆ విధంగానే విద్యార్థి దరఖాస్తు చేసుకోవాలి.

INTER MEDIATE ONLINE ADMISSIONS NOTIFICATION & GUIDELINES CLICK HERE

ఇంటర్‌లో స్థానిక కోటా

రాయలసీమ, నెల్లూరు వారికి విజయవాడ, గుంటూరుల్లో 15% సీట్లే

ఇప్పటికే ప్రవేశాలు పొందిన వారిలో ఆందోళన

 ఇప్పటివరకూ ఏ ప్రాంత విద్యార్థి అయినా తనకు నచ్చినచోట ఇంటర్మీడియట్‌లో చేరేవాడు.

ఇక నుంచి అలా కుదరదు. ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో రిజర్వేషన్ల కారణంగా ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి వెళ్లి చదువుకోవడం కష్టమవుతుంది. రాయలసీమ విద్యార్థులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని జూనియర్‌ కళాశాలల్లో చేరాలంటే ఇబ్బంది అవుతుంది.

రిజర్వేషన్లతో స్థానికేతరులకు పరిమిత సీట్లే ఉంటాయి. దీంతో ఇప్పటికే విజయవాడ, గుంటూరు, ఇతర ప్రాంతాల్లో ఇంటర్మీడియట్‌లో చేరిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

ర్నూలుకు చెందిన ఓ విద్యార్థి విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరాడు.

కళాశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లవల్ల ఆ కళాశాలలో సీటు వస్తుందో.. లేదోననే ఆందోళన అతడి తల్లిదండ్రుల్లో నెలకొంది. వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు వచ్చి ఇంటర్లో చేరిన చాలా మందిది ఇదే పరిస్థితి.

స్థానిక కోటా అమలు

ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో స్థానిక, స్థానికేతర కోటా అమలు చేస్తున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఒక రీజియన్‌గా..

శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు ఒక రీజియన్‌గా ఉంటాయి.

ఆ ప్రాంతాలవారికి స్థానిక కోటాలో 85%, ఇతరులకు 15% సీట్లు ఉంటాయి.

దీంతో విద్యార్థులకు ఇతర ప్రాంతాల్లో చేరడం కష్టమవుతుంది.

ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్‌ కోటాను సెక్షన్‌ (గ్రూపు) యూనిట్‌గా అమలు చేయనున్నారు.

ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% రిజర్వేషన్‌ అమలుచేస్తారు.

ఈడబ్ల్యుఎస్‌ కోటా కోసం సీట్లను 10శాతం పెంచుతారు.

ఈడబ్ల్యుఎస్‌ మినహా మిగతా రిజర్వేషన్‌ అభ్యర్థులు లేకపోతే వాటిని అన్‌ రిజర్వుడుగా మారుస్తారు. 

మార్కుల మదింపులో వ్యత్యాసం

కరోనా కారణంగా పది పరీక్షలను రద్దు చేసిన విద్యాశాఖ అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు కేటాయించింది. రాష్ట్రప్రభుత్వ పరీక్షల విభాగం ఒక విధానాన్ని పాటిస్తే, సీబీఎస్‌ఈ మరో విధానాన్ని పాటించింది.

ఇప్పుడు రెండు విభిన్న మదింపులతో మార్కులు పొందినవారికి సీట్ల కేటాయింపులో ఎలా న్యాయం చేస్తారనే దానిపైనా సందిగ్ధత నెలకొంది.

ప్రైవేటులో ఎక్కువ మందికి 10/10 రాగా.. ప్రభుత్వ విద్యార్థులకు తక్కువగా వచ్చాయి.

దీంతో వీరిద్దరి పోటీలో ప్రైవేటు వారికే అవకాశం లభిస్తుంది.

ఇంటర్ అడ్మిషన్లకు 23 చివరి తేదీ*

2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ రెండేళ్ల కోర్సుకు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చని, కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 23 చివరి తేదీ అని

ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పేర్కొంది.

అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్థులు

http//bie.ap.gov.in ద్వారా చేరవచ్చని తెలిపింది. 

ఈ నెల 13 నుంచి ఇంటర్మీడియట్ సాధారణ కోర్పులతో పాటు వృత్తిపరమైన (ఒకేషనల్) కోర్సులు ప్రారంభించనున్నట్లు బోర్డు సెక్రటరీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 మొదటి విడత అడ్మిషన్లు పూర్తయిన అనంతరం రెండోవిడత ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.ఒసి/బిసి విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎసి, వికలాంగులు రూ.50 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. 

సీట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఆన్లైన్ అడ్మిషన్లు గురించి తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబరు 1800-2749868 నెంబరు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఈనెల 16 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులను ప్రారంభించనున్న ప్రభుత్వం.. అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Inter 1st YEAR ONLINE ADMISSION LINK

విద్యార్థులు http://bie.ap.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి Online Admissions 2021-22 (APOASIS) User Manual ద్వారా అప్లే చేసుకోవాలని తెలిపింది.

INTER COLLEGES LIST IN ALL 13 DISTRICTS (WITH COLLEGE CODE)

INTER MEDIATE BOARD OFFICIAL WEBSITE

FOR MORE DETAILS CLICK HERE PDF