ap-ecet-2024-results-rank-cards

ap-ecet-2024-results-rank-cards

AP ECET Results: ఏపీ ఈసెట్‌-2024 ఫలితాలు విడుదల, 90.41 శాతం ఉత్తీర్ణత నమోదు – ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి

AP ECET Results: ఏపీలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

AP ECET 2024 Rank Cards: ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన ‘ఏపీఈసెట్-2024’ పరీక్ష ఫలితాలు నేడు (మే 30) విడుదలయ్యాయి. అనంతపురం జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఫలితాలను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ స్ట్రీమ్, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 8న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీఈసెట్ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 89.35 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 93.34 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.

AP ECET 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..

AP ECET-2024 RESULTS CLICK HERE

Step 1: ఈసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx 

Step 2: అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే  AP ECET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.

Step 4: ఈసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 

ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఈసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..