AP EAMCET Answer Key 2023-response-key-sheet

AP EAMCET Answer Key 2023-response-key-sheet

AP EAMCET Answer Key 2023 : ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం కీ విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

AP EAMCET Answer Key 2023 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ (AP EAPCET 2023) పరీక్షలు మంగళవారం (మే 23)తో ముగిశాయి.

ఇంజినీరింగ్‌ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని.. దీనిపై అభ్యంతరాలుంటే మే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపవచ్చని AP EAPCET 2023 చైర్మన్‌ రంగజనార్ధన, కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు.

అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల కీ బుధవారం (మే 24వ తేదీ) ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రాథమిక కీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/ లో అందుబాటులో ఉంది.


Master Engineering Question Paper With Preliminary Keys

ఈ నెల 15న మొదలైన ఈఏపీసెట్‌ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇంజినీరింగ్‌ పరీక్షల ‘కీ’ కోసం లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి