new-law-against-anti-paper-leak Law-2024

new-law-against-anti-paper-leak Law-2024

పేపర్‌ లీక్‌చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.కోటి జరిమానా!

వరుస పేపర్‌ లీక్‌లతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పేపర్‌ లీకేజీలకు పాల్పడుతున్న వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీక్‌లు, చీటింగ్‌లను అరికట్టడానికి ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను తీసుకువచ్చింది. ఆ చట్టం జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది

వరుస పేపర్‌ లీక్‌లతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పేపర్‌ లీకేజీలకు పాల్పడుతున్న వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీక్‌లు, చీటింగ్‌లను అరికట్టడానికి ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను తీసుకువచ్చింది. ఆ చట్టం జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షల లీకేజీలతో వెల్లువెత్తిన భారీ వివాదాల మధ్య ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చట్టం చేసినా ఎన్నికల నేపథ్యంలో అమలు తేదీని ప్రకటించలేదు. జూన్‌ 20న జరిగిన విలేకర్ల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను మీడియా ప్రశ్నించింది. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే కేంద్ర చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయడం విశేషం.

తాజాగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి ప్రధాన సంస్థలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వేలు, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ వంటి పబ్లిక్ పరీక్షలలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను బయటికి తెచ్చినా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా నేరంగా పరిగణిస్తారు. నిందితులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు.

వ్యవస్థీకృత నేరాలను పాల్పడినట్లు రుజువైతే సర్వీస్ ప్రొవైడర్‌లలోని సీనియర్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నట్లు రుజువైతే కనీసం మూడేళ్ల నుంచి 10 యేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే రూ. 1 కోటి జరిమానా. వ్యవస్థీకృత పరీక్షల మాల్‌ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఎగ్జామినేషన్ అధికారులు లేదా సర్వీస్ ప్రొవైడర్‌లకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 10 యేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దీనితోపాటు రూ. 1 కోటి జరిమానా ఉంటుంది.

error: Content is protected !!