How-to-delete-old-not-using-Gmail-account

How-to-delete-old-not-using-Gmail-account

Google Account: పాత జీమెయిల్ ఐడీ వాడట్లేదా? గూగుల్ అకౌంట్ పర్మనెంట్‌గా డిలిట్ చేయండి ఇలా

ఒకరి పేరు మీద రెండుమూడు జీమెయిల్ అకౌంట్స్ ఉండటం మామూలే. ముందు ఓ జీమెయిల్ అకౌంట్ (Gmail Account) క్రియేట్ చేయడం, ఆ తర్వాత కొత్త ఐడీ క్రియేట్ చేసి పాత అకౌంట్‌ను వదిలేయడం చాలామందికి అలవాటు. అయితే పాత జీమెయిల్ ఐడీ వాడకుండా వదిలేసేవారు ఉంటారు. అయితే వారి గూగుల్ అకౌంట్ (Google Account) యాక్టీవ్‌గా ఉంటుంది. ఒకవేళ ఆ జీమెయిల్ ఐడీతో హ్యాకర్లు లాగిన్ అయ్యారంటే చిక్కులు తప్పవు. చాలావరకు సైబర్ నేరాలకు ఇది కారణమవుతోంది. అందుకే మీరు పాత జీమెయిల్ ఐడీ ఉపయోగించనట్టైతే గూగుల్ అకౌంట్‌ను డిలిట్ చేయాలి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లాగానే గూగుల్ కూడా యూజర్లు తమ అకౌంట్‌ను డిలిట్ చేసే అవకాశం ఇస్తోంది. మీ గూగుల్ అకౌంట్‌ను పర్మనెంట్‌గా డిలిట్ చేయొచ్చు. మరి మీ గూగుల్ అకౌంట్‌ను ఎలా డిలిట్ చేయాలో తెలుసుకోండి

Google Account: గూగుల్ అకౌంట్ డిలిట్ చేయండి ఇలా

Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లో https://www.google.com/account/about/ ఓపెన్ చేయండి.

Step 2- మీ గూగుల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

Step 3- హోమ్ పేజీలో Data & Privacy ఆప్షన్ ఓపెన్ చేయాలి.

Step 4- More Options పైన క్లిక్ చేయాలి.

Step 5- Delete your Google account ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 6- ఆ తర్వాత Delete your entire account and data ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 7- మీ అకౌంట్ శాశ్వతంగా డిలిట్ చేయడానికి మరోసారి మీ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది.

Step 8- గూగుల్ అకౌంట్ డిలిట్ చేస్తే గూగుల్ సేవలు ఏవీ యాక్సెస్ చేయలేరని మెసేజ్ కనిపిస్తుంది.

Step 9- మీ గూగుల్ అకౌంట్‌లో ఉన్న డేటాను డౌన్‌లోడ్ చేయడానికి download your data ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Step 10- ఆ తర్వాత కనిపించే రెండు బాక్సులు టిక్ చేయాలి.

Step 11- Delete Account పైన క్లిక్ చేయాలి.

Step 12- మీ గూగుల్ అకౌంట్ డిలిట్ అయిపోతుంది.

మీ గూగుల్ అకౌంట్ డిలిట్ చేసేముందు ముఖ్యమైన డేటా ఉంటే డౌన్‌లోడ్ చేయడం మర్చిపోవద్దు. జీమెయిల్, గూగుల్ ఫోటోల్, గూగుల్ డ్రైవ్‌లో ఏవైనా ఫైల్స్ ఉంటే ముందు డౌన్‌లోడ్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్ డిలిట్ చేయాలి. ఒక్కసారి మీ గూగుల్ అకౌంట్ డిలిట్ చేశారంటే ఇక ఆ అకౌంట్‌తో లాగిన్ చేయడం సాధ్యం కాదు. అంతేకాదు… మీరు గతంలో గూగుల్ అకౌంట్‌తో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో లాగిన్ అయినట్టైతే మళ్లీ అదే అకౌంట్‌తో లాగిన్ చేయలేరు.

DELETE YOUR OLDNOT USING GMAIL ACCOUNT CLICK HERE