PAN-AADHAR-CARD-LINK-LAST-DATE-MARCH-31

PAN-AADHAR-CARD-LINK-LAST-DATE-MARCH-31

PAN Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేయలేకపోతున్నారా? వివరాలు ఇలా సరిదిద్దుకోండి

2023 మార్చి 31 వరకు తుది గడువు
వచ్చే ఏడాది (2023) మార్చి 31వ తేదీ లోగా (31.03.2023 లోగా) పాన్‌ – ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం చెబుతోంది.

Note

1. Name, Date of Birth and Gender as per PAN will be validated against your Aadhaar Details

2. Please ensure that ‘Aadhaar Number’ and ‘Name as per Aadhaar’ is exactly the same as printed on your Aadhaar card.

PAN Aadhaar Link | మీరు మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయలేకపోతున్నారా? అయితే ఆధార్ కార్డులోని (Aadhaar Card) వివరాలు తప్పుగా ఉంటే ఈ సమస్య రావొచ్చు. మరి మీ వివరాలు ఎలా సరిచేయాలో తెలుసుకోండి.

పాన్ కార్డ్ (PAN Card) ఉన్నవారంతా తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు (Aadhaar Card) లింక్ చేయాలి. అంటే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఇప్పటికే అనేకసార్లు గడువును పొడిగించింది. ఇంకా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సినవారి సంఖ్య లక్షల్లోనే ఉంది. అయితే పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ రెండు డాక్యుమెంట్స్‌లో పేర్లు వేర్వేరుగా ఉన్నా పాన్, ఆధార్ లింక్ కాదు. పేరు మాత్రమే కాదు పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరం లాంటివి ఒకేలా లేకపోయినా పాన్ ఆధార్ లింక్ చేయడం సాధ్యం కాదు. పాన్, ఆధార్ లింక్ చేయడానికి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఒకేలా లేకపోయినా పాన్, ఆధార్ లింక్ కావట్లేదు. మీరు కూడా ఇలా మిస్‌మ్యాచ్ సమస్యల్ని ఎదుర్కొంటున్నట్టైతే మీ ఆధార్ వివరాలు సరిచేయాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలు ఎలా సరిచేయాలో తెలుసుకోండి.

PAN-AADHAR LINK STATUS CLICK HERE

ఆధార్ కార్డ్ వివరాలు సరిదిద్దుకోండి ఇలా 

Step 1- ముందుగా https://uidai.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.

Step 2- My Aadhaar సెక్షన్‌లో Update Demographics Data and Check status పైన క్లిక్ చేయాలి.

Step 3- https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

Login పైన క్లిక్ చేయాలి.

Step 4- మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి.

Step 5- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.

Step 6- Update Aadhaar online సెలెక్ట్ చేయాలి.

Step 7- వివరాలన్నీ సరిచూసుకొని Proceed to update Aadhaar పైన క్లిక్ చేయాలి.

Step 8- మీ వివరాలన్నీ అప్‌డేట్ చేసిన తర్వాత Proceed to update Aadhaar పైన క్లిక్ చేయాలి.

Step 9- ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేసి మీ వివరాలు ఓసారి సరిచూసుకోవాలి. మీ డీటెయిల్స్ ఇంగ్లీష్‌లో, తెలుగులో సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి.

Step 10- సబ్మిట్ చేసి రూ.50 ఛార్జీలు పేమెంట్ చేయాలి.

Step 11- URN నెంబర్ జనరేట్ అవుతుంది. అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.

ఆన్‌లైన్‌లో పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్ లాంటివి అప్‌డేట్ చేయొచ్చు. ఇతర సేవల కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ అయిన తర్వాత పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. ఒకవేళ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ ఉపయోగించడానికి వీల్లేదు. గడువు తర్వాత పాన్, ఆధార్ లింక్ చేస్తే రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డును ఉపయోగిస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలి. కాబట్టి పాన్ కార్డ్ హోల్డర్లు గడువులోగా తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాలి.

Link Aadhaar TO PAN CARD CLICK HERE