reliance-industries-junior-software-engineers-jobs-online-application

reliance-industries-junior-software-engineers-jobs-online-application

Reliance Industries లో జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.5 లక్షల వరకూ జీతం

రిలయన్స్‌ ఆఫ్‌ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ

బీఈ, బీటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు

Off Campus Drive 2022:రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ ద్వారా 100 జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం:

  • విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులో బీఈ/బీటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. 2020, 2021, 2022 లో ఉత్తీర్ణులైన వాళ్లు మాత్రమే అప్లయ్‌ చేసుకోవడానికి అర్హులు.

  • అవసరమైన స్కిల్స్‌: ఓపెన్‌ సోర్స్‌ టెక్నాలజీస్‌ తెలిసి ఉండాలి.

  • ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ టూల్స్‌ (నోడ్‌ జేఎస్‌/య్యాంగులర్‌/రియాక్ట్‌/ఫ్లట్టర్‌) వంటివి తెలిసి ఉండాలి.

  • జీతం: ఏడాదికి రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఉంటుంది.

  • ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, టెక్నికల్‌ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

  • జాబ్‌ లొకేషన్‌: నవీ ముంబై

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.ril.com/

error: Content is protected !!
Scroll to Top