Indian-army-officer-recruitment-notification-online-application-details

Indian-army-officer-recruitment-notification-online-application-details

Army Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. టెరిటోరియల్ ఆర్మీలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే జూలై 20న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను  వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అప్లై చేసేముందు ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారిని లెఫ్టనెంట్ ర్యాంకులో నియమిస్తారు.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 19
పరీక్ష తేదీ- 2021 సెప్టెంబర్ 26

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- 18 నుంచి 42 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.200
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ పరీక్షలు, మెడికల్ టెస్ట్
పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, పూణె, కోల్‌కతా, డార్జిలింగ్, గువాహతి, దిమాపూర్, చండీగఢ్, జలంధర్, షిమ్లా, ఢిల్లీ, అంబాలా, హిసర్, లక్నో, అలాహాబాద్, ఆగ్రా, భువనేశ్వర్, డెహ్రడూన్, ఉదంపూర్, శ్రీనగర్, నగ్రోటా
వేతనం- రూ.1,77,500 వరకు

Indian Army Officer Recruitment 2021:

దరఖాస్తు చేయండి ఇలా

ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ https://www.jointerritorialarmy.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Careers పైన క్లిక్ చేయాలి.
Join As An Officer పైన క్లిక్ చేయాలి.
Register పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లాంటి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి.
రిజిస్ట్రేషన్ సమయంలో సొంత ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి.
అన్ని వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేయాలి.
యూజర్ నేమ్, పాస్‌వర్డ్ గుర్తుంచుకోవాలి.
యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
లాగిన్ చేసిన తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

OFFICIAL WEBSITE

JOBS NOTIFICATION CLICK HERE

error: Content is protected !!
Scroll to Top