cbse-term-2-sample-papers-link-download-papers

cbse-term-2-sample-papers-link-download-papers

CBSE Sample Papers: సీబీఎస్ఈ పరీక్షల శాంపిల్ పేపర్స్ విడుదల… డౌన్‌లోడ్ లింక్ ఇదే

CBSE Sample Papers | సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు టర్మ్ 2 పరీక్షలపై (CBSE Term 2 Exams) ఉన్న సందేహాలు తీర్చేందుకు సీబీఎస్ఈ శాంపిల్ పేపర్స్‌ని విడుదల చేసింది. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 2 బోర్డ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన శాంపిల్ పేపర్స్‌ని (Sample Papers) విడుదల చేసింది. ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుందని పలు ఊహాగానాలు వస్తుండటంతో సీబీఎస్ఈ క్లాస్ 10క్లాస్ 12 శాంపిల్ పేపర్స్‌ని రిలీజ్ చేసింది. టర్మ్ 2 బోర్డ్ పరీక్షల టెస్ట్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు ఉండవని గతంలో సీబీఎస్ఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల్లో ఉన్న సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు తాజాగా శాంపిల్ పేపర్స్‌ని రిలీజ్ చేసింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ https://cbseacademic.nic.in/ లో శాంపిల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

పలు ఆన్‌లైన్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, విద్యార్థుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయని సీబీఎస్ఈ అభిప్రాయపడింది. ఎగ్జామ్ ప్యాటర్న్‌లో మార్పులపై 2021 జూలై 5న సర్క్యులర్ జారీ చేశామని, ఈ సర్క్యులర్ ప్రకారమే టర్మ్ 1 పరీక్షలు పూర్తి చేశామని, టర్మ్ 2 పరీక్షల గురించి అప్పుడే ప్రకటించామని సీబీఎస్ఈ క్లారిటీ ఇచ్చింది.

CBSE Sample Papers: సీబీఎస్ఈ శాంపిల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

Step 1- విద్యార్థులు ముందుగా https://cbseacademic.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో అనౌన్స్‌మెంట్స్‌లో అకడమిక్ సెక్షన్‌లో Sample Question Papers for Term II Examination of Classes X and XII for the session 2021-22 లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- శాంపిల్ పేపర్స్‌కు సంబంధించిన సర్క్యులర్ కనిపిస్తుంది.

Step 4- అందులో 10వ తరగతి, 12వ తరగతి శాంపిల్ పేపర్స్‌కు సంబంధించిన లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.

Step 5- ఆ లింక్స్ క్లిక్ చేసిన తర్వాత సబ్జెక్ట్స్ వారీగా శాంపిల్ పేపర్స్ ఉంటాయి.

సీబీఎస్ఈ 10వ తరగతి శాంపిల్ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీబీఎస్ఈ 12వ తరగతి శాంపిల్ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సైన్స్, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్… ఇలా సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి శాంపిల్ పేపర్స్‌కు సంబంధించిన టర్మ్ 1, టర్మ్ 2 శాంపిల్ క్వశ్చన్ పేపర్స్‌తో పాటు మార్కింగ్ స్కీమ్‌ను కూడా వివరించింది సీబీఎస్ఈ. విద్యార్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోచ్చు. సీబీఎస్ఈ టర్మ్ 2 పరీక్ష రాయబోయే విద్యార్థులు తమ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఈ శాంపిల్ పేపర్స్ డౌన్‌లోడ్ చేసి ఓసారి చెక్ చేసుకుంటే ప్రశ్నాపత్రం తీరుపై ఉన్న అనుమానాలు, సందేహాలు తీర్చుకోవచ్చు.

సీబీఎస్ఈ క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్ 2021 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు, క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ డిసెంబర్ 22 వరకు కొనసాగుతాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మొదటిసారి రెండు దశల్లో బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!
Scroll to Top