ysr-raithu-bharosa-kisan-financial-assurance-farmers-Rs7500
వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన జగన్
రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయల అందజేత
వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలను అందిస్తున్నారు. వెబ్ ల్యాండ్ ఆధారంగా అర్హులైన రైతులకు ఈ సాయం అందిస్తున్నారు. కౌలుదారులకు కూడా ఈ డబ్బులు ఇస్తున్నారు. తొలి విడత మేలో, రెండో విడత అక్టోబర్‌లో మూడో విడత జనవరిలో ఇస్తున్నారు.
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 52.30 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు నిధులను జమ చేసింది. మొదటి విడతగా ఒక్కో రైతుకు రూ. 7,500 లను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేసింది.
వరుసగా ఐదోసారి వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కి సాన్ పథకం కింద సీఎం జగన్ గురువారంనాడు రైతులకు నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కర్నూల్ జిల్లా పత్తికొండలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు.
వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల*
అర్హులైన రైతులకి రూ. 7,500 విడుదల.*
వైస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ 2023-2024
YSRRB(2023-24) Payment Status LINK

https://ysrrythubharosa.ap.
YSR RYTHU BHAROSA OFFICIAL WEBSITE LINK
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హమీని నిలబెట్టుకుంటున్నామన్నారు సీఎం జగన్. మేనిఫెస్టోలో ప్రకటించిన దాని కంటే ఎక్కువగా రైతు భరోసా అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
ప్రతి రైతుకు ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ. 54 వేలు ఆర్ధిక సహాయంగా అందించామని సీఎం జగన్ వివరించారు.
ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో రైతులకు ఇన్ పుట్ సబ్సీడీని అందిస్తున్నామన్నారు.
విత్తనం నుండి రైతు పండించిన ధాన్యం కొనుగోలు వరకు రైతుకు అండగా నిలుస్తున్నామన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తున్న విషయాన్న సీఎం గుర్తు చేశారు.