YOUTH-ECO-CLUBS-in-ap-schools-complte-details-funds-pd-accounts

YOUTH & ECO CLUB*

వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పర్యావరణ సమస్యలను పరిష్కరించుకోవడానికి క్లబ్బులు*

ప్రతి పాఠశాలలో క్లబ్ ఏర్పాటుకు రూ.5 వేలు మంజూరు*

•2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు జూన్, జూలై నెలల్లో రాక*

పాఠశాల స్థాయి నుంచే విద్యార్ధులకు పర్యావరణం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా

విద్యార్ధులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి.. వారిని కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దనుంది. 

ఇందుకోసం ప్రతి పాఠశాలలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో యూత్ అండ్ ఎకో క్లబ్ లను ఏర్పాటు చేసింది. వీటిద్వారా పాఠశాల పరిసరాలను పరిశభ్రంగా ఉంచడం,మొక్కలు పెంచడం వాటితో పాటు వ్యక్తిగత శుభ్రతకు సంబంధించి చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటిండం వంటి కార్యక్రమాల్లో విద్యార్థులను మమేకం చేస్తూ అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. 

 2021-22 విద్యా సంత్సరానికి సంబంధించిన నిధులు జూన్, జూలై నెలల్లో రానున్నాయి.*

క్లబ్ లో సభ్యులెవరంటే..*

ప్రతి పాఠశాల నుంచి ఒక యూత్ అండ్ ఎకో క్లబ్ లను ఏర్పాటు చేయనున్నారు.

 

 ఇందులో ప్రతి తరగతి నుంచి ఇద్దరు చొప్పున పది మంది విద్యార్థులు సభ్యులుగా

ఉంటారు.  అలాగే ఒక విశ్రాంతి ఉద్యోగి, ఒక గ్రామపెద్దతోపాటు క్లబ్ పూర్తి స్థాయి నిర్వహణకు ఒక టీచర్ యూత్ అండ్ ఎకో క్లబ్ లో సభ్యులుగా ఉంటారు. పరిశుభ్రత .. పచ్చదనం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా రోగాలు దరిచేరవు.

కోవిడ్- 19 సెకండ్ వేవ్ నేపథ్యంలో పరిశుభ్రత మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తరగతిగదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి ప్రధాన అంశాలపై క్లబ్ సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.

పాఠశాల ప్రాంగణంలో ఇళ్ల వద్ద మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను

నిర్వహిస్తారు. 

అలాగే పచ్చని మెట్లు, ప్రగతికి మెట్లు అంటూ నినాదాలు చేస్తూ.. గ్రామస్తులకు చెట్ల ఆవశ్యకతను వివరించి వారికి మొక్కలు నాటేందుకు ప్రేరణ కలిగిస్తారు. అలాగే ప్రజలు పరిశుభ్రతను పెంపొందించుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అవగాహన కల్పిస్తారు.

*2021-22 విద్యా సంవత్సరానికి కూడా…*

జూన్, జూలైలో నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులు రాగానే సంబంధిత కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

Eco-Clubs in school :

Eco clubs in schools will empower students to participate and take up meaningful environmental activities and projects. It is a forum through which students can reach out to influence, engage their parents and neighbourhood communities to promote sound environmental behavior. It will empower students to explore environmental concepts and actions beyond the confines of a syllabus or curriculum. While everyone, everywhere, asserts the importance of ‘learning to live sustainably,’ environment remains a peripheral issue in the formal schooling system.

Objectives of Eco-clubs in school:

YOUTH ECO CLUBS GUIDELINES CLICK HERE

error: Don\'t Copy!!!!