whatsapp-group-admins-full-powers

Whatsapp: గ్రూప్‌ అడ్మిన్‌లూ.. ఇకపై మీరే కింగ్‌లు.. అడ్మిన్‌లకు తిరుగులేని పవర్‌ ఇవ్వనున్న వాట్సాప్‌..

Whatsapp: యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ, ఎన్నో అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్లను అట్రాక్ట్‌ చేస్తూనే ఉంటుందీ యాప్‌. అందుకే ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వచ్చినా వాట్సాప్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు.

ఇప్పటికే డిలీట్‌ ఫర్‌ ఎవ్రీ వన్‌ గడువును పెంచింది, డీపీ ఎంపిక చేసిన వారికి మాత్రమే కనిపించేలా సెట్‌ చేసుకునే ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఇలా ఎన్నో సూపర్ ఫీచర్స్‌ను తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా.. గ్రూప్‌ అడ్మిన్‌ల కోసం ప్రత్యేకంగా ఓ ఫీచర్‌ను తీసుకురానుంది. తప్పుడు సమాచారం వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికే ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీంతో వాట్సాప్‌ అడ్మిన్‌లకు గ్రూపుల్‌ ఏ మెసేజ్‌నైనా తొలగించే అధికారం రానుంది.

వాట్సాప్‌ గ్రూప్స్‌లో సర్క్యూలేట్‌ అయ్యే కంటెంట్‌కు అడ్మినే బాధ్యుడు అని చట్టం చెబుతోన్న నేపథ్యంలో వాట్సాప్‌ తీసుకొచ్చే ఈ కొత్త ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.

ఇప్పటికే ఈ ఫీచర్‌ను బీటా వెర్షన్‌లో టెస్టింగ్‌ చేస్తున్నారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పలు కారణాలతో కొందరు వాట్సాప్‌ గ్రూపుల్లో ఇరుక్కుపోతుంటారు. బయటకి వస్తే గ్రూప్‌ సభ్యులు ఏమనుకుంటారో అనే సందేహం.

ఒకవేళ వెళ్లిపోతే ‘ఎందుకెళ్లిపోయావ్‌?’ అన్ని ప్రశ్నలు. దీంతో కక్కలేక మింగలేక ఆ గ్రూప్‌లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసమే వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపుల్లోంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకునే సదుపాయం కల్పించింది.

దీంతో పాటు మరో రెండు ప్రైవసీ ఫీచర్లను కూడా వాట్సాప్‌ పరిచయం చేసింది. త్వరలోనే ఈ ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం రండి..

వాట్సాప్‌ గ్రూప్‌ల్లో ప్రస్తుతం ఎవరైనా సభ్యుడు లెఫ్ట్‌ అయితే.. వెంటనే అందరికీ తెలిసిపోతుంది.

వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌ ద్వారా ఎవరైనా సభ్యుడు గ్రూప్‌ నుంచి ఎవరికీ తెలీకుండా వెళ్లిపోవచ్చు. కేవలం గ్రూప్‌ అడ్మిన్లకు మాత్రమే ఆ వివరాలు కనిపిస్తాయి.

మనం ఆన్‌లైన్‌లో ఎవరితోనో ఛాట్‌ చేస్తుంటాం. అదే టైమ్‌లో కొందరు మెసేజ్‌ చేస్తుంటారు. వారికి రిప్లయ్‌ ఇవ్వడానికి మనకి ఇష్టం ఉండదు.

అలాగని సైలెంట్‌గా ఉంటే.. ఆన్‌లైన్‌లో ఉన్నా రిప్లయ్‌ ఇవ్వలేదన్న అపవాదు ఉండిపోతుంది. అలాంటి వారికోసమే ఈ ఫీచర్‌. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరెవరు మిమ్మల్ని చూడొచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు.

వాట్సాప్‌లో ఏదైనా ఫొటోను, వీడియోను ఒకసారే చూసే విధంగా వాట్సాప్‌ ఓ సదుపాయం తీసుకొచ్చింది. ఇలా పంపినప్పటికీ ఫొటోలను, వీడియోలను స్క్రీన్‌షాట్‌ తీసుకునే అవకాశం ఉంది. ఇకపై స్క్రీన్‌షాట్‌ను సైతం తీసుకునే వీల్లేకుండా వాట్సాప్‌ అడ్డుకోనుంది.

error: Don\'t Copy!!!!