uses-of-Income-tax-ITR-e-filing

Income Tax Return: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022.

ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం వల్ల  ప్రయోజనాలు:

బ్యాంకు రుణం సౌలభ్యం:*

మీరు సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

దేశంలోని అన్ని బ్యాంకులు పన్ను రిటర్న్ కాపీ గురించి అడుగుతాయి. ITR సహాయంతో బ్యాంకుల్లో రుణాలు పొందడం సులభం అవుతుంది. గృహ రుణాలు, వాహనరుణాలు పొందడంలో సులభతరం అవుతుంది.

*వీసా పొందడానికి..*

వీసా దరఖాస్తు సమయంలో చాలా మంది ఎంబసీలు, కాన్సులేట్‌లు గత రెండేళ్లుగా ప్రయాణికుల ITR కాపీని సమర్పించాలని కోరుతున్నారు. డాక్యుమెంటేషన్ పూర్తి అయినట్లయితే ఇది అప్లికేషన్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

*నష్టాలను తగ్గిస్తుంది:*

 ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఐటీఆర్‌ ఫైల్‌ చేసేవారికి గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభంతో భర్తీ చేయవచ్చు. మీరు మీ ITR ను సకాలంలో ఫైల్ చేసినట్లయితేనే ఈ ప్రయోజనం పొందవచ్చు. IT చట్టం ప్రకారం.. మీరు మీ బకాయి ఖర్చులను వచ్చే సంవత్సరానికి కూడా ఐటీఆర్‌లో నమోదు చేసుకోవచ్చు.

*జరిమానాలు నివారించడానికి..*

 ఐటీఆర్ సకాలంలో దాఖలు చేయకపోతే ఆ వ్యక్తిపై ఐదు వేల రూపాయల వరకు జరిమానా చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా, వ్యక్తి సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీపై బ్యాంకులు తగ్గించిన TDS తిరిగి పొందవచ్చు.

*చిరునామా రుజువుగా..*

 ITR చిరునామా, ఆదాయ రుజువుగా కూడా ఉపయోగించవచ్చు. అలాగే సభ్యత్వం మొదలైన వాటి కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

error: Don\'t Copy!!!!