UGC-STARTED-job-portal-2021-22-ugc-job-portal-information

UGC Job Portal: జాబ్ పోర్టల్ ప్రారంభించిన యూజీసీ…*

*️నెట్, సెట్ క్వాలిఫై కావడంతో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసినవారు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు  మంచి అవకాశం*

*1. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-NET పాసయ్యారా? రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-SET క్వాలిఫై అయ్యారా? ఏదైనా అంశంలో పీహెచ్‌డీ పూర్తి చేశారా? మీలాంటివారి కోసం యూజీసీ సరికొత్త జాబ్ పోర్టల్ ప్రారంభించింది.*

*2. నెట్, సెట్ క్వాలిఫై కావడంతో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసినవారు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు యూజీసీ ప్రారంభించిన జాబ్ పోర్టల్ ఉపయోగపడుతుంది.*

*3. నెట్, సెట్ క్వాలిఫై అయినవారికి, పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి యూనివర్సిటీలు, కాలేజీల్లో అనేక ఉద్యోగాలు ఉంటాయి. అయితే యూనివర్సిటీలు, కాలేజీలు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి.*

*4. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు విడుదల చేసే జాబ్ నోటీసులకు సంబంధించిన సమాచారం ఒకేచోట లభించట్లేదు. దీంతో నెట్, సెట్ క్వాలిఫై అయినవారికి ఆ ఉద్యోగాల గురించి తెలియట్లేదు*

*5. ఈ సమస్యకు పరిష్కారంగా నెట్, సెట్ క్వాలిఫై అయినవారి కోసం యూజీసీ ప్రత్యేకంగా జాబ్ పోర్టల్ ప్రారంభించింది. నెట్, సెట్ క్వాలిఫై అయినవారు, పీహెచ్‌డీ పూర్తి చేసినవారు https://ugc.ac.in/jobportal/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.*

*6. యూజర్లు https://ugc.ac.in/jobportal/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని ఆన్‌లైన్‌లోనే ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. అంతేకాదు… ఈ వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనలు కూడా ఉంటాయి. అందులో తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు ఉంటే అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు*

*7. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 54767 మంది నెట్ అభ్యర్థులు, 14133 మంది నెట్ జేఆర్ఎఫ్ అభ్యర్థులు, 15296 మంది సెట్ అభ్యర్థులు, 26808 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.*

*8. టీచింగ్ పోస్టులు మాత్రమే కాదు నాన్ టీచింగ్ ఖాళీలకు సంబంధించిన వివరాలను కూడా ఇదే వెబ్‌సైట్‌లో అందించేందుకు యూజీసీ కసరత్తు చేస్తోంది. త్వరలో ఈ జాబ్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసి మరికొందరికి అందుబాటులోకి తీసుకురానుంది*

UGC JOB PORTAL 2021 MAIN WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!