Cab booking through whatsapp-uber-cab-booking

 ఇక వాట్సాప్ నుంచి కూడా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసుకోండి

ఉబెర్ (Uber) సంస్థ భారతదేశంలో ఓ సరికొత్త సర్వీసును ప్రారంభించింది. యాప్​ అవసరం లేకుండానే వాట్సాప్ (Whatsapp)​ ద్వారా క్యాబ్​ను బుక్​ చేసుకునే అవకాశాకాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ క్యాబ్​ సేవల సంస్థ ఉబెర్ (Uber) భారతదేశంలో ఓ సరికొత్త సర్వీసును ప్రారంభించింది. ఉబెర్ యాప్ (Uber App)​ అవసరం లేకుండానే వాట్సాప్​ (WhatsApp) ద్వారా క్యాబ్​ను బుక్ (Uber Cab Booking)​ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇకపై వినియోగదారులు ఉబెర్​ చాట్ బోట్​తో కనెక్ట్ అయ్యి సులభంగా క్యాబ్​ బుక్​ చేసుకోవచ్చు. ఈ సేవల కోసం ఇన్​స్టన్ట్​ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​తో ఒప్పందం చేసుకున్నట్టు ఉబెర్​ కంపెనీ పేర్కొంది. ఇలాంటి ఫీచర్​ ప్రపంచంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. అది కూడా భారత్​లోనే (India) దీన్ని తొలిసారి ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది.

రైడర్లు ఇకపై ఉబర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే వాట్సాప్​ ద్వారా రిజిస్ట్రేషన్​ దగ్గరి నుంచి క్యాబ్ బుకింగ్​, ట్రిప్​ రిసిప్ట్​ పొందడం​ దాకా అన్ని సేవలు పొందవచ్చని తెలిపింది.

ప్రస్తుతానికి ఈ సేవలను పైలెట్​ ప్రాజెక్టుగా, ఉత్తరప్రదేశ్​ రాజధాని లక్నో లోనే అమలు చేయనున్నారు. త్వరలోనే మిగతా నగరాలకూ దీన్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇంగ్లీష్​లోనే సేవలు అందుబాటులో ఉన్నా.. రానున్న రోజుల్లో మిగతా భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం మెటా(ఫేస్​బుక్​) యాజమాన్యంలోని వాట్సాప్​ భారతదేశంలో అర బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లను కలిగి ఉంది. దీంతో వాట్సాప్​తో ఉబెర్​ టై అప్​ కావడం ఆ కంపెనీకే కాకుండా కస్టమర్లకు కూడా ప్రయోజనం చేకూరనుంది

వాట్సాప్​తో క్యాబ్​ ఎలా బుక్​ చేసుకోవాలి?
వాట్సాప్​ యూజర్లు మొత్తం మూడు మార్గాల ద్వారా ఉబెర్​ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఉబెర్​ బిజినెస్​ అకౌంట్ నంబర్‌కు మెసేజ్​ చేయడం లేదా క్యూఆర్​ కోడ్‌ని స్కాన్ చేయడం లేదా ఉబెర్​ వాట్సాప్​ చాట్‌ లింక్​పై క్లిక్​ చేయడం ద్వారా ముందుగా బుకింగ్ ఓపెన్ చేయాలి. అక్కడ పికప్, డ్రాప్ లొకేషన్లను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫేర్​ వివరాలు, దగ్గర్లో ఉన్న డైవర్​ లొకేషన్​ వంటివి అక్కడే కనిపిస్తాయి. వివరాలు సరిచూసుకొని ‘బుక్​ ఎ రైడ్ పై’ ఆప్షన్‌పై క్లిక్​ చేయాలి.
ఉబెర్ యాప్​ ద్వారా నేరుగా ట్రిప్స్​ బుక్​ చేసుకునే వారికి లభించే సేఫ్టీ ఫీచర్లు, బీమా భద్రత వంటివి.. వాట్సాప్​ నుంచి బుక్​ చేసుకున్న కస్టమర్లకు కూడా వర్తిస్తాయి. ఉబెర్​లో కనిపించే డ్రైవర్​ పేరు, కారు లైసెన్స్​ ప్లేట్​ ఇందులోనూ కనిపిస్తాయి. అంతేకాదు, పికప్​ పాయింట్​కి వెళ్లే మార్గంలో మనం ఎక్కడ ఉన్నామనేది కూడా ట్రాక్​ చేసుకోవచ్చు. అలాగే ట్రిప్​లో ఉన్నప్పుడు ‘ఎమర్జెన్సీ’ ఆప్షన్​ ఎంచుకోవడం ద్వారా ఉబెర్​ సపోర్ట్ టీమ్​ నుంచి వెంటనే ఇన్​బౌండ్​ కాల్​ను అందుకుంటారు. ఉమెన్​ సేఫ్టీ కోసం సంస్థ ఈ ఫీచర్​ను తీసుకొచ్చింది.

error: Don\'t Copy!!!!