Today-school-assembly-news-02-02-2023
TODAY LEARN A WORD A DAY CLICK HERE
Today News 02-02-2023 in English PDF
నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వార్తలు తెలుగులో PDF
🙏School Assembly*
*02-02-2023*
*🔥Today News*
> *Budget 2023 live - Income tax relief, sops for women, scheme for artisans, and more*
> *Budget 2023 - Maturity proceeds of life insurance policies with annual premium of over ₹5 lakh to be taxed: Finance Minister*
> *India, U.S. step up strategic partnership with technology initiative*
> *Western allies differ over jets for Ukraine as Russia claims gains*
> *Gold jumps ₹1,090; Silver zooms ₹1,947 amid strong global cues*
> *TELANGANA: Stage set for budget session of legislature as Governor summons both Houses on Feb 3*
> *Single window clearance system in Andhra Pradesh comes in for praise at investors’ meeting in New Delhi*
> *Budget 2023: Allocation for education hiked to Rs 1.13 lakh crore, up by 8.3% from last year*
> *APOSS time table 2023 released: SSC, Inter exams from April 3*
> *UPSC Civil Services 2023: 1105 vacancies notified, highest in 7 years*
> *IND vs NZ 3rd T20 Highlights: India win by 168 runs, clinch T20I series 2-1*
*🌻Proverb/ Motivation*
*Happiness keeps you sweet. Trials keep you strong. Sorrow keeps you human. Failure keeps you humble. And Courage keeps you going.*
*💎నేటి ఆణిముత్యం💎*
*కట్టడదప్పి తాము చెడు కార్యముఁ చేయుచునుండిరేనిఁదో*
*బుట్టినవారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం*
*దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుఁడా*
*పట్టున రాముఁజేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!*
తాత్పర్యము: *భాస్కరా! దశకంఠుడగు రావణబ్రహ్మ యొక్క సోదరుడు విభీషణుడు అన్నను వదిలేసి, శ్రీ రామమూర్తికి నేస్తమై అతనిచే శాశ్వతమైన లంకానగరాథిపత్యమును పొందెను. అలాగే చెడ్డ పనులు చేసినచో సోదరుడైననూ వానిని విడిచిపెట్టుట తథ్యమని భావం. రావణబ్రహ్మ సీతను అపహరించుకొని పోవుటయే చెడ్డపని.*
*🌷Today's GK*
Q: *In which country did cannabis originate?*
A: *China

👭నేటి 𝐀𝐏 - పాఠశాల అసెంబ్లీ👬*
❍─━━━━━━━❐━━━━━━━─❍
*🗓️𝟎𝟐 - 𝟎𝟐 - 𝟐𝟎𝟐𝟑*
*🗒️𝐓𝐇𝐔𝐑𝐒 𝐃𝐀𝐘*
❍─━━━━━━━❐━━━━━━━─❍
*✍🏻నేటి వార్తలు📜*
━━━━━━━━━━━━━━━━━━━━
*_🧑🏻💻నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది _________ , ______వ తరగతి*
*👩🏻🏫నేటి ప్రాముఖ్యత:-*
┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅┅
*_🌎ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం_*
*🧑🏻💻అంతర్జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──
*_➨దేశ రహస్య పత్రాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఎఫ్.బి.ఐ నిన్న దాడులు నిర్వహించింది._*
*_➨ప్రస్తుతం అమలులో ఉన్న అత్యవసర స్థితిని మరొక ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మయన్మార్ లో అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వం నిన్న ప్రకటించింది._*
*_➨ఆస్ట్రేలియాలో కొద్ది రోజుల కిందట గల్లంతైన రేడియో ధార్మిక క్యాప్సూల్ నిన్న మైనింగ్ పట్టణం న్యూ మాన్ కు సమీపంలో గ్రేట్ నార్తన్ హైవేపై లభ్యమైంది._*
*🧑🏻💻జాతీయ వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━━──
*_➠2023-24 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం రాబడి 45 లక్షల 3 వేల 97 కోట్ల రూపాయలు గా అంచనా వేశారు._*
*_➠తొలి హైడ్రోజన్ రైలు ఈ ఏడాది చివరి కల్లా అందుబాటులోకి వస్తుందని, దేశీయంగానే తయారవుతుందని కేంద్ర రైల్యే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు._*
*_➠ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని 2024 వరకు కొనసాగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు._*
*_➠నూతన ఆదాయపుపన్ను విధానాన్ని బడ్జెట్ లో రూ.7 లక్షల వార్షికాదాయం వరకు ఆదాయపు పన్ను రిబేటును ప్రతిపాదించారు. పన్ను స్లాబులను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు._*
*_➠కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి వ్యవసాయ నిర్వహణకు ప్రత్యామ్నాయ పోషకాల ప్రోత్సాహం పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు._*
*_➠చక్రీయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు రూ.10వేల కోట్ల పెట్టుబడితో గోవర్ధన్ పథకాన్ని ప్రకటించారు._*
*_➠చిత్తడి నేలలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మూడు సంవత్సరాల పాటు అమృత్ దరోహర్ పథకాన్ని, ఉద్యాన పంటలకు అవసరమైన నాణ్యమైన పరికరాలను రూపొందించేందుకు రూ.2,200 కోట్లతో ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం లను ప్రారంభించనున్నారు._*
*_➠2023-24 కేంద్ర బడ్జెట్ లో మునిపెన్నడూ లేని విధంగా 2.5% అనగా రూ.1,12,899 కోట్లు విద్యారంగానికి కేటాయించారు._*
*_➠నూతన బడ్జెట్ ప్రకారం దేశ ప్రజల తలసరి ఆదాయం రూ 1.97 లక్షలకు పెరిగింది._*
*🧑🏻💻రాష్ట్ర వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──
*_➢కాకినాడ జిల్లాలో తుఫాను కారణంగా పంట నష్టపోయిన 14,153 మంది రైతులకు రూ.15.72 కోట్లను పరిహారంగా అందజేయాలని కాకినాడ వినియోగదారుల కమిషన్ తీర్పు ఇచ్చింది._*
*_➢విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఈనెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు._*
*_➢ప్రఖ్యాత ప్రేరణ కర్త రచయిత నిక్ వుజిసిక్ నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు._*
*🏏క్రీడా వార్తలు:-*
──━━━━━━━━━━━━━━━──
*_➯భారత్ న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన - 3వ, చివరి T-20 మ్యాచ్ లో భారత్ 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీ సాధించాడు._*
*_➯బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సాయి ప్రణీత్ ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించాడు._*
*_➯దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత మహిళాజట్టు నేడు ఈస్ట్ లండన్ లో జరిగే ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా తో తలపడనుంది_*
*నేటి వార్తలు ఇంతటితో లు సమాస్తం....🙏🏻*
*✍🏻నేటి సూక్తి*
──━━━━━━━━━━━━━━━──
*_మనం కేవలం విజయాలనుంచే పైకిరాలేము.అపజయాలనుండి కూడా నేర్చుకోవాలి._*
-అబ్దుల్ కలాం.
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
──━━━━━━━━━━━━━━──
*_మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తడి,పొడి చెత్తలను వేరుగా చెత్త డబ్బాలో వేయాలి.._*
*📚నిన్నటి జీకే ప్రశ్న❓*
──━━━━━━━━━━━━━━━──
*_Q) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?_*
A: ముంబాయి
*📕నేటి జీకే ప్రశ్న❓*
──━━━━━━━━━━━━━━━──
*_Q)నీలగిరి కొండల్లో ఎత్తైన పర్వత శిఖరం ఏది?_*