today-Jan-23rd-PRC-2022-updates-from-news-papers

పీఆర్సీ అమలు: కొత్త పీఆర్సీ ప్రకారం వేతన బిల్లులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు‌.

పీఆర్సీ అమలులోకి వచ్చిందని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు..

*ఈనెల 25లోగా  వేతనబిల్లులు రూపొందించి..సీఎఫ్ఎంఎస్ కు పంపాలని ఆదేశాలు.

ప్రతిరోజూ పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీకి నివేదిక అందించాలని ఆదేశాలు

PRC-2022 ద్వారా కొత్త జీతాలు కాకుండా, పెండింగ్ డి ఏ లు అన్నిటితో కలిపి పాత జీతాన్ని తీసుకుంటే కలిగే NET GAIN/ LOSS ను క్రింది పట్టికలలో చూపించడం జరిగింది. 

12%, 14.5% మరియు 20% HRA  పొందుతున్న వివిధ కేటగిరీల వారీగా ఒక్కొక్క టేబుల్ ను రూపొందించడం జరిగింది.

కొత్త PRC లో ఉద్యోగులకు 20% ,14.5%, 12% నుంచి HRA 16%, 8% కొత్త శ్లాబుల లోకి మారడం వలన ఎంత నష్టపోతున్నారో మీరే లెక్క పెట్టుకోవడానికి software తయారు చేయడం జరిగింది

PRC -2022 SOFTWARE WITH HRAs CLICK HERE

కొత్త జీతాలతో కోతలు తప్పవు! బకాయిలను వెనక్కిచ్చెయ్యాల్సిందే

♦భవిష్యత్తులో వచ్చే డీఏల నుంచి మినహాయింపు

♦కొందరు రూ.లక్ష వరకు చెల్లించాలి

♦లబోదిబోమంటున్న ఉద్యోగులు

♦హెచ్‌ఆర్‌ఏ మారనివారికి కొంతలబ్ధి

 ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త వేతన సవరణతో అనేక మంది ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న డబ్బులను భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.లక్షకు పైగా కోల్పోనున్న అధికారులూ ఉన్నారు. సూపరింటెండెంట్‌ కేడర్‌లోని ఉద్యోగుల్లో రూ.70 వేలకుపైగా బకాయి పడిన వారున్నారు. ఉపాధ్యాయుల్లో చాలామంది రూ.80 వేలకు పైగా వెనక్కివ్వాల్సి వస్తుంది. వీరందరి నుంచి భవిష్యత్తులో ప్రకటించనున్న కరవు భత్యం (డీఏ) బకాయిల రూపంలో ఆ మొత్తాలను వసూలు చేసుకుంటామని సర్కారు పక్కాగా ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)లో పెద్దగా మార్పు లేని ఉద్యోగులు బకాయిల రూపంలో కొంత మొత్తం అదనంగా ప్రభుత్వం నుంచి పొందుతారు.

జీవోలో సుస్పష్టంగా వివరణ

ప్రభుత్వం 11వ వేతన సవరణ సంఘం అమలుకు సంబంధించి ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తదితర అంశాలతోపాటు విధివిధానాలు ఎలా ఉంటాయో పేర్కొంటూ జనవరి 17న ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నంబరు ఒకటిలో పక్కాగా అన్ని వివరాలనూ పొందుపరిచింది. 2019 జులై నుంచి మూలవేతనంపై 27% మధ్యంతర భృతి(ఐఆర్‌) ఇచ్చిన ప్రభుత్వం తాజా జీవోల్లో 2020 ఏప్రిల్‌ నుంచి మానిటరీ ప్రయోజనం కల్పిస్తామని, 2022 జనవరి జీతంతో కలిపి నగదు రూపంలో కొత్త వేతనాలు చెల్లిస్తామంది. కొత్త పీఆర్సీలో ఫిట్మెంట్‌ను 23శాతానికి తగ్గించింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులన్నీ మార్చేసింది. సీసీఏ(సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు) పూర్తిగా తొలగించింది. అది కొన్నిచోట్ల మాత్రమే అమలులో ఉంటుంది. వీటి ప్రకారం… ఇప్పటికే అదనంగా తీసుకున్న ఐఆర్‌ మొత్తాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని డీఏ బకాయిల నుంచి మినహాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అలా మినహాయించిన తర్వాత ఉద్యోగులకు ఇంకా అదనంగా చెల్లించాల్సి ఉంటే వాటిని నాలుగు వాయిదాల్లో జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామంది. ఒకవేళ ఉద్యోగులే ప్రభుత్వానికి బకాయి ఉంటే… ఆ మొత్తాన్ని భవిష్యత్తులో ఇచ్చే డీఏ బకాయిల నుంచి మినహాయించుకుంటామని స్పష్టం చేసింది. ఈ నెల 17న ఇచ్చిన జీవో నంబరు ఒకటిలోని 10వ పేజీలో 12.4 పాయింటులో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లెక్క ఎలా కట్టాలో కూడా అదే జీవోలో పట్టిక రూపంలో ఆర్థికశాఖ అధికారులు విశదీకరించారు.

♦ఈ ఉదాహరణలు చూడండి…

* తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఒక ప్రభుత్వ శాఖలో సూపరింటెండెంట్‌ కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగి తాజా వేతన సవరణతో రూ.72,252 ప్రభుత్వానికి వెనక్కి చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తాన్ని ఇప్పటికిప్పుడే జీతంలో కోత పెట్టి తీసుకోరు. భవిష్యత్తులో ఇచ్చే డీఏల నుంచి మినహాయించుకుంటారు. ఈ బకాయిని తీర్చాకే కొత్త డీఏలు పొందుతారు. ఈ ఉద్యోగి 2020 ఏప్రిల్‌ నుంచి (మూల వేతనం రూ.43,680) 2021 డిసెంబరు వరకు 27% ఐఆర్‌, పాత హెచ్‌ఆర్‌ఏ, సీసీఏల ప్రకారం పొందిన జీతం రూ.18,24,237గా లెక్క తేలింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త పేస్కేళ్లలో జీతాలను లెక్క కట్టాల్సి ఉంది. అప్పుడు ఆయన కొత్త మూల వేతనం రూ.67,190 అవుతుంది. నాటి నుంచి ఆయన పొందిన మొత్తం వేతనం రూ.17,31,384గా తేల్చారు. దీనికి డీఏ బకాయిలు రూ.20,601 కలిపారు. అంటే… కొత్త వేతన స్కేళ్ల ప్రకారం రూ.17,51,985 పొందాల్సి ఉండగా ఇప్పటికే రూ.18,24,237 డ్రా చేశారు. దీంతో ఆయన రూ.72,252 వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు ఎనిమిది కి.మీ. దూరంలో ఇన్నాళ్లూ 20% ఇంటి అద్దె భత్యంతో జీతం తీసుకున్న ఒక ఉపాధ్యాయుడు (స్కూల్‌ అసిస్టెంటు) రూ.51,905 వెనక్కి చెల్లించాల్సి వస్తోంది. ఈయన ఇప్పటికే రూ.19,18,795 డ్రా చేశారని… కొత్త స్కేళ్ల ప్రకారం ఆయనకు నికరంగా రావాల్సింది (డీఏ బకాయిలతో కలిపి) రూ.18,66,890గా లెక్క తేలుతోంది.

* ఒక జిల్లాలోని ముఖ్య పట్టణంలో జలవనరుల శాఖలో ఎస్‌ఈగా పనిచేస్తున్న అధికారి రమారమి రూ.1.10 లక్షలు తిరిగి చెల్లించాల్సి వస్తోంది.

* కృష్ణా జిల్లా నూజివీడులో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న ఉద్యోగి రూ.6,078 వెనక్కి కట్టాల్సి వస్తోంది. ఈయన ఇంతకాలం 14.5% హెచ్‌ఆర్‌ఏ తీసుకున్నారు. ఇప్పుడది 8 శాతానికి తగ్గిపోయింది. కొత్త వేతనం ప్రకారం రూ.12,42,032 పొందాల్సి ఉండగా ఇప్పటికే రూ.12,48,110 డ్రా చేశారు.

* కర్నూలులో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు రూ.60 వేలకు పైగా వెనక్కి చెల్లించాల్సి వస్తోంది.

* విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇంతకాలం 14.5% హెచ్‌ఆర్‌ఏ ఉన్న పట్టణంలో పనిచేసిన రికార్డు అసిస్టెంట్‌… తాజా వేతన  సవరణతో రూ.27,264 ప్రభుత్వానికి బాకీ పడ్డారు.

♦కొందరికి బకాయిలు రానున్నాయ్‌

ప్రభుత్వ జీవోలోని రెండు కేటగిరీల ప్రకారం పాత, కొత్త జీతాలు ఎలా లెక్క కట్టాలో వివరించి చూపింది.

* గతంలో 12% హెచ్‌ఆర్‌ఏ ఉండి తాజా వేతనాల్లో 8 శాతానికి మారిన ఉద్యోగి ఒకరు (పాత మూలవేతనం రూ.51,230- కొత్త మూలవేతనం రూ.78,820) ఇప్పుడు రూ.16,569 పొందనున్నారు. ఈ మొత్తాన్ని జీపీఎఫ్‌లో జమ చేస్తారు.

* గతంలో హెచ్‌ఆర్‌ఏ 20 శాతంగా ఉండి ఇప్పుడు 16 శాతంగా ఉన్న నగరాల్లో (పాత మూలవేతనం రూ.25,840- కొత్త మూలవేతనం రూ.39,800) ఉన్న ఉద్యోగి రూ.26,658 అదనంగా అందుకుంటారు.

కొత్త జీతాలపై సర్కారు కసరత్తు, మార్గదర్శకాలతో తాజా ఉత్తర్వులు, మరోవైపు ఉద్యోగుల సహాయ నిరాకరణ

 ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కేళ్లతోనే జనవరి నెల జీతాలు సకాలంలో చెల్లించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఖజానా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికశాఖ అధికారులు మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే ఖజానా ఉద్యోగుల సర్వీసు అసోసియేషన్‌ తాము ఈ ప్రక్రియలో పాల్గొనబోమని ప్రభుత్వానికి తెలిపింది. ఆ సంఘం నాయకులు పి.శోభన్‌బాబు, రవికుమార్‌ ఉన్నతాధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. తాజాగా పే అండ్‌ అకౌంట్సు ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.వెంకటేశ్వరరెడ్డి, పి.శివప్రసాద్‌ కూడా ఉన్నతాధికారులను కలిసి తాము పీఆర్సీ అమలు ప్రక్రియలో పాల్గొనబోమని తేల్చిచెప్పారు.

ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ రెండ్రోజుల కిందట వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో రవి సుభాష్‌, ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు, పే అండ్‌ అకౌంట్సు అధికారి కె.పద్మజ, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస పూజారి, జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, సహాయ ఖజానా అధికారులు, ఉప ఖజానా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖజానా శాఖ నిత్యం ఏమేం చేయాలనే దానిపైనా రావత్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. 

* ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు డీడీలతో, ఎస్‌టీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పీఆర్సీ ఎలా అమలు చేయాలో వివరించాలి.

* అనంతరం ఖజానా శాఖ అధికారులందరూ సంబంధిత డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంట్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వాలి.

* ఖజానా శాఖ అధికారులంతా జనవరి 22కల్లా పరిశీలన కార్యక్రమం పూర్తిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా అడుగు ముందుకు పడ్డ దాఖలాలు లేవు.

* రోజూ జిల్లా ఖజానా అధికారులు ఉదయం 11 గంటలకల్లా ఖజానా శాఖ డైరెక్టర్‌కు పురోగతి వివరించాలి. ఆయన మధ్యాహ్నం 12 గంటల లోపు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పురోగతి తెలియజేయాలి.

* సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో అవసరమైన సాంకేతిక సహకారం అందించాలి. ఖజానా శాఖ అధికారులందరికీ డీడీవో వారీగా డ్యాష్‌బోర్డులో సమాచారం అందుబాటులో ఉంచాలి.

* ఖజానా అధికారులంతా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలి.

* జనవరి 25 కల్లా అందరు డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారులకు తాజా పే రోల్స్‌ అందుబాటులో ఉంచాలి. ఇంతకుముందున్న విధానం ప్రకారమే వాటిని ఖజానా అధికారులకు పే అండ్‌ అకౌంట్సు అధికారులకు వారు సమర్పించి జీతాల చెల్లింపు పూర్తిచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు

ఆ లెక్కలు తప్పు  తగ్గకపోతే పాత జీతాలే ఎందుకు అడుగుతాం

జీవోలను ఉపసంహరించుకోవాల్సిందే, అశుతోష్ మి కమిటీ నివేదిక ఇచ్చాకే చర్చలు

♦తేల్చిచెప్తున్న ఉద్యోగ సంఘాలు, నేడు స్టీరింగ్ కమిటీ సమావేశం

♦రేపు సమ్మెకు అల్టిమేటం, చర్చలకు ససేమిరా

కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవని అధికారులు చెబుతున్న గణాంకాలు వాస్తవంకాదని ఏపీజేఏసీల నేతలు స్పష్టం చేస్తున్నారు. జీతాల్లో కోత పడకపోతే పాతజీతాలనే అమలుచేయాలని. ఎందుకు డిమాండ్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం మొండివైఖరిని అవలంబిస్తున్నందనే తాము ఆందోళనకు పూనుకుంటు న్నామని చెప్తున్నారు. సంప్రతింపుల కమిటీలో సైతం ఇదే విషయాన్ని వివరిస్తామని ఐక్యా వేదిక నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రభకు తెలిపారు. ఆదివారం రాష్ట్రస్థాయిలో ఉద్యోగసంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశంతో పాటు వివిధ టేబుల్ సమావేశాలు నిర్వహించి సోమవారం ప్రభుత్వానికి జిల్లాల్లో రౌండ్ సమ్మె అల్టిమేటం జారీ చేసేందుకు ఉద్యోగసంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇప్పటికీ నిలువనీడలేని పరిస్థితులు ఉన్నాయని అయినా ప్రభుత్వానికి సహకరిస్తున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కోత విధిస్తే ఏరకంగా వెసులుబాటు కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వంతో గత మూడు విడతలుగా చర్చలు జరిపినా ప్రయోజనంలేదనేది జీవోల విడుదలతో తేటతెల్లమైందని చెప్తున్నారు. ఉద్యోగులు ఆందోళన విరమణకు ఒక్కటే మార్గమని తాజా జీవోల ఉపసంహరణతో పాటు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఉద్యోగులకు అందజేసి ఆ తరువాత మొదటి నుంచి చర్చలకు ఆహ్వానించే వరకు తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. జేఏసీలతో పాటు ఉద్యోగ సంఘాలు మొత్తం ఏకం కావడంతో నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఆందోళన ఏరకంగా నిర్వహించాలనే దానిపై స్పష్టత ప్రకటించాలని నిర్ణయించాయి.

error: Don\'t Copy!!!!